నేటి పంచాంగం…నేటి విశేషం…

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌺పంచాంగం🌺
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 05 – 02 – 2025,
వారం … సౌమ్యవాసరే ( బుధవారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
శిశిర ఋతువు,
మాఘ మాసం,
శుక్ల పక్షం,

తిథి : *అష్టమి* తె3.13 వరకు,
నక్షత్రం : *భరణి* రా11.20 వరకు,
యోగం : *శుక్లం* రా12.11 వరకు,
కరణం : *విష్ఠి* సా4.21 వరకు,
తదుపరి *బవ* తె3.13 వరకు,

వర్జ్యం : *ఉ9.54 – 11.24*
దుర్ముహూర్తము : *ఉ11.51 – 12.36,*
అమృతకాలం : *సా6.51 – 8.21,*
రాహుకాలం : *మ12.00 – 1.30,*
యమగండం : *ఉ7.30 – 9.00,*
సూర్యరాశి : మకరం,
చంద్రరాశి : మేషం,
సూర్యోదయం : 6.36,
సూర్యాస్తమయం: 5.53,

*_నేటి విశేషం_*

*భీష్మాష్టమి*
రధ సప్తమి తరువాత వచ్చే రోజునే భీష్మ అష్టమి గా పిలుస్తారు ఎందుకంటే, భీష్ముడు అంపశయ్య మీద ప్రాణ త్యాగం చేసిన రోజు ఇదే కనుక , ఆ భీష్మ పితామహుని తలుచుకుంటూ మనిషి గా పుట్టిన ప్రతి వారు నీటిని తర్పణం గా విడువమని చెప్పింది శాస్త్రం
తల్లిదండ్రులు ఉన్నవారైనా సరే తర్పణ విడువడమే కర్తవ్యమ్
తర్పణ ఇచ్చేటప్పుడు ఇలా చదువుతూ ఇవ్వమని చెప్పింది శాస్త్రం…

*భీష్మః శాన్తనవో వీరః: సత్యవాది జితే౦ద్రియః !*
*ఆభిరద్భిరవాప్నోతు పుత్ర పౌత్రోచితా౦ క్రియామ్ !!*

*వైయాఘ్ర పద గోత్రాయ సా౦కృత్య ప్రవరాయచ !*
*అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్మణే !!*

*వసూనామవతారాయ శంతనోరాత్మజాయచ !*
*అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే !!*

*అనేన భీశం అర్ఘ్యప్రదానేన సర్వాత్మకో భగవాన్ శ్రీ హరి జనార్దనః ప్రీయతాం – ఓం తత్ సత్!!*

*_🌺శుభమస్తు🌺_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏