🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
☘️పంచాంగం☘️
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 03 – 03 – 2025,
వారం … ఇందువాసరే ( సోమవారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం,
శుక్ల పక్షం,
తిథి : *చవితి* రా10.30 వరకు,
నక్షత్రం : *రేవతి* ఉ10.43 వరకు,
యోగం : *శుక్లం* మ12.59 వరకు,
కరణం : *వణిజ* ఉ11.41 వరకు,
తదుపరి *భద్ర* రా10.30 వరకు,
వర్జ్యం : *తె5.19 నుండి*
దుర్ముహూర్తము : *మ12.35 – 1.22,*
మరల *మ2.55 – 3.42,*
అమృతకాలం : *ఉ8.28 – 9.58,*
మరల *రా2.20 – 3.49,*
రాహుకాలం : *ఉ7.30 – 9.00,*
యమగండం : *ఉ10.30 – 12.00,*
సూర్యరాశి : కుంభం,
చంద్రరాశి : మీనం,
సూర్యోదయం : 6.23,
సూర్యాస్తమయం: 6.02,
*_నేటి మాట_*
*నిరంతర దైవస్మరణతో ఉంటే…!!*
మన అనుభవాలన్నీ సుఖ, దుఃఖాల మధ్యే ఉన్నాయి.
ప్రకృతితో ఏర్పడ్డ అనుకూల సంబంధాన్ని సుఖమని, ప్రతికూలమైతే దుఃఖమని అంటున్నాం.
ఈ రెంటినీ సమంగా స్వీకరించేలా మనసును సిద్ధం చేయటమే ఆధ్యాత్మిక, ప్రకృతిలో మార్పు సహజం, ప్రకృతిలో భాగమైన మనం ఆ మార్పులకు అతీతులం కాదు. బాహ్యజీవనం సాగించక తప్పదు.
అందుకే జీవనమంతా ఆధ్యాత్మికతతో పరిమళించేలా ఉండాలి.
అప్పుడే అది పరిపూర్ణ జీవనం అవుతుంది… నిద్రపోయినప్పుడు కూడా కలల రూపంలో ప్రకృతి మనని అంటిపెట్టుకొని ఉంటుంది.
ఆ తర్వాత సుషుప్తి అవస్థలో మాత్రమే అది మనని పూర్తిగా వదులుతుంది.
ఇలలోని దేహాన్ని, కలలోని దేహభావనను వదిలి ఉండాల్సిన సత్యవస్తువుతో ఉండటం ధ్యాన సమాధి.
ఆ సత్యవస్తువు మనకు ముందే తెలియదు కాబట్టి మన సాధన మనని ఆ స్థితికి చేరుస్తుంది.
నామజపం, యోగసాధన, భజన, భక్తి పారవశ్యమైనా మనకి ఆ స్థితి రుచి చూపించటానికే..
మహర్షులు నిరంతర జప, ధ్యాన సమాధుల్లో ఉండేవారు, నిరంతర దైవస్మరణతో ఉంటే మన నిత్య జీవితంలో కూడా ఆ ఫలాన్ని పొందవచ్చు…
*_☘️శుభమస్తు☘️_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏