🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌷పంచాంగం🌷
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 15 – 04 – 2025,
వారం … భౌమవాసరే ( మంగళవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
వసంత ఋతువు,
చైత్ర మాసం,
బహుళ పక్షం,
తిథి : *విదియ* ఉ8.30 వరకు,
నక్షత్రం : *విశాఖ* రా12.49 వరకు,
యోగం : *సిద్ధి* రా9.34 వరకు,
కరణం : *గరజి* ఉ8.30 వరకు,
తదుపరి *వణిజ* రా9.26 వరకు,
వర్జ్యం : *ఉ.శే.వ 6.15 వరకు,*
మరల *తె5.12 నుండి,*
దుర్ముహూర్తము : *ఉ8.17 – 9.06,*
మరల *రా10.50 – 11.36,*
అమృతకాలం : *మ3.05 – 4.51,*
రాహుకాలం : *మ3.00 – 4.30,*
యమగండం : *ఉ9.00 – 10.30,*
సూర్యరాశి : మేషం,
చంద్రరాశి : తుల,
సూర్యోదయం : 5.49,
సూర్యాస్తమయం: 6.11,
*_నేటి మాట_*
*నీకు నిజమైన మిత్రులు ఎవరు ???*
నిజమైన మిత్రులు ఎవరు అని అనుకున్నప్పుడు, బాధలు పడేటువంటి వారు, దు:ఖములో ఉన్నటువంటి వారు, నిరాశ లోపల ఏవిధమైనటువంటి ఆధారము లేనటువంటి నిరారాధంలో ఉండేటటువంటి వారు అని చెప్పాలి!!…
ఇలాంటి వారే మనకు నిజమైనటువంటి మిత్రులుగా మనము భావించి, వారికి తగినటువంటి యొక్క సహాయమును మనము అందించడానికి పూనుకోడంలో అతి శ్రధ్ధను వహించాలి.
చాలా మంది ధనమున్నవారితో మనము ఫ్రెండ్ షిప్ చేసుకోడం వలన చాలా లాభం కలుగుతుంది అని చెబుతారు,
అందువలన మనకు వచ్చేటువంటి పెద్ద ఇది కాదు.
అందరి యందు, అందరితో ఫ్రెండ్ షిప్ ఉండవలసిందే, కానీ ధనమున్నటువంటివారితో నీవు ఫ్రెండ్ షిప్ చేసుకున్నప్పుడు ఏదో ఒక సమయం లోపల 10 రూపాయలు నీవు అడగ వలసి వస్తుంది.
10 రూపాయలు అడిగినప్పుడు నీ ఫ్రెండ్ షిప్ కట్అయిపోతుంది, నీకు ఇక మొహం చూపించడు, చూస్తే అడుగుతాడేమో ఏమో అని తాను వేరైపోతాడు.
కనుక ఎవ్వరితోనైన కూడను మనము మిత్రులు కావలసిందే, కానీ నిజమైన మిత్రులు ఎవరంటే నీ సేవను అందుకోవటానికి ఎవరు పూనుకుంటారో వారే నీ మిత్రులుగా భావించుకోవాలి.
*_🌷శుభమస్తు🌷_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏