ఓం శ్రీ గురుభ్యోనమః
పంచాంగం
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 21 – 05 – 2026,
వారం … బృహస్పతివాసరే ( గురువారం )
శ్రీ పరాభవ నామ సంవత్సరం,
ఉత్తరాయణం,
గ్రీష్మ ఋతువు,
అధిక జ్యేష్ఠ మాసం,
శుక్ల పక్షం,
తిథి : *పంచమి* మ2.09 వరకు,
నక్షత్రం : *పునర్వసు* ఉ9.44 వరకు,
యోగం : *గండ* సా4.33 వరకు,
కరణం : *బాలువ* మ2.09 వరకు,
తదుపరి *కౌలువ* రా1.10 వరకు,
వర్జ్యం : *సా5.19 – 6.50*
దుర్ముహూర్తము : *ఉ9.47 – 10.38*
మరల *మ2.56 – 3.47*
అమృతకాలం : *ఉ7.29 – 8.59*
మరల *రా2.24 – 3.55*
రాహుకాలం : *మ1.30 – 3.00*
యమగండo : *ఉ6.00 – 7.30*
సూర్యరాశి : వృషభం,
చంద్రరాశి : కర్కాటకం
సూర్యోదయం : 5.30,
సూర్యాస్తమయం : 6.22,
*_నేటి మాట_*
*భగవంతుడు సర్వాంతర్యామి అంటారు కదా – ఎలా??*
శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులనే పంచ గుణము లుండడంచేత భూమి చాలా భారంగా ఉన్నది.
జలములో శబ్ద, స్పర్శ, రూప, రసాలున్నాయిగాని, గంధము లేదు, ఆ ఒక్క గుణము తగ్గిపోవడంతో దీనికి కదలిక వచ్చింది,
మూడవది అగ్ని…
ఇందులో శబ్ద, స్పర్శ, రూపములున్నాయిగాని, రస గంధాలు లేవు, అందువల్ల ఇది పైకి పోతుంది.
నాలుగవది వాయువు,
ఇందులో శబ్ద, స్పర్శ గుణాలు రెండు మాత్రమే ఉన్నాయి; రూప, రస, గంధములు లేవు.
మూడు గుణాలు తగ్గేసరికి ఇది ఎంతో తేలికైపోయి సర్వత్రా సంచరిస్తూ ఉంటుంది.
ఐదవది ఆకాశము,
దీనికి శబ్దమొక్కటే ఉన్నది; స్పర్శ, రూప, రస, గంధాదులు లేవు, కనుక, ఆకాశం ఎక్కడ చూసినా వుంటుంది.
ఇది ఒకే గుణంతో ఉన్నది కనుక, అంతటా ఉన్నది.
*భగవంతునికి ఆ ఒక్క గుణం కూడా లేదు కాబట్టి, అతడు సర్వాంతర్యామి*.
శుభమస్తు
సమస్త లోకా సుఖినోభవంతు