నేటి పంచాంగం.. రాశి ఫలాలు..

తేది : 22, ఆగష్టు 2022
సంవత్సరం : శుభకృతునామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : శ్రావణమాసం
ఋతువు : వర్ష ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : సోమవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : ఏకాదశి
(ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 37 ని॥ నుంచి
మర్నాడు ఉదయం 6 గం॥ 7 ని॥ వరకు)
నక్షత్రం : మృగశిర
(నిన్న తెల్లవారుజాము 4 గం॥ 41 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 7 గం॥ 41 ని॥ వరకు)
యోగము : వజ్రము
కరణం : భద్ర(విష్టి)
వర్జ్యం : (ఈరోజు సాయంత్రం 5 గం॥ 9 ని॥ నుంచి ఈరోజు రాత్రి 6 గం॥ 57 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు రాత్రి 11 గం॥ 28 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 1 గం॥ 16 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 12 గం॥ 43 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 33 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 3 గం॥ 15 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 5 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 34 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 8 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 53 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 27 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 10 గం॥ 43 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 17 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 0 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 37 ని॥ లకు
సూర్యరాశి : సింహము
చంద్రరాశి : మిథునము

మేషం?
నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. అవసరానికి ఆర్థిక సహాయం అందుతుంది
అదృష్ట సంఖ్య 4

వృషభం?
వృధా ఖర్చు విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి ఉద్యోగములలో అధికారులతో చికాకులు తప్పవు నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి. నూతన ఋణ ప్రయత్నాలు అంతగా కలసిరావు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
అదృష్ట సంఖ్య 3

మిథునం?
కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి వ్యాపారపరంగా భాగస్థులతో చర్చలు అనుకూలస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల పదోన్నతులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.
అదృష్ట సంఖ్య 1

కర్కాటకం?
పెద్దల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. ఇంటా బయట గందరగోళ వాతావరణం ఉంటుంది ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలుంటాయి ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. స్థిరస్తి క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు ఉండవు.
అదృష్ట సంఖ్య 5

సింహం?
గృహంలో వివాహది శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది వ్యాపార ఉద్యోగాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు సమాకూరుతాయి. సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు పెరుగుతాయి. రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి.
అదృష్ట సంఖ్య 3

కన్య?
స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అధికారులతో సఖ్యత కలుగుతుంది.
అదృష్ట సంఖ్య 1

తుల⚖️
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. పాత రుణాల ఒత్తిడి వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో మరింత కష్టపడాలి. ఇంటాబయట సమస్యలు అధికమవుతాయి.
అదృష్ట సంఖ్య 4

వృశ్చికము?
కుటుంబ వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్పులు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తిచేస్తారు.
అదృష్ట సంఖ్య 5

ధనస్సు?
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. చాలా కాలంగా వేధిస్తున్న సమస్య నుండి కొంత వరకు బయట పడతారు.ఉద్యోగమున ఉన్నత పదవులు పొందుతారు. గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. యాపారమున అనుకూల వాతావరణం ఉంటుంది.
అదృష్ట సంఖ్య 2

మకరం?
వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో అంచనాలు అందుకుంటారు. బంధు మిత్రులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. నూతన గృహ వాహన యోగం ఉన్నది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా సాగుతుంది. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది.నిరుద్యోగుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.
అదృష్ట సంఖ్య 2

కుంభం⚱️
రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందక నిరాశ పడతారు. చేపట్టిన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటారు వ్యాపార ఉద్యోగాలలో కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.
అదృష్ట సంఖ్య 9

మీనం?
కుటుంబ విషయాలలో స్థిరత్వం లేని ఆలోచనలు వలన మాటపట్టింపులు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన రుణాలు చేయకపోవడం మంచిది నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి ఆటంకాలుంటాయి.
అదృష్ట సంఖ్య 7