నేటి పంచాంగం.. రాశి ఫలాలు..

తేది : 2, అక్టోబర్ 2022
సంవత్సరం : శుభకృతునామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : ఆశ్వయుజమాసం
ఋతువు : శరత్ ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : ఆదివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : సప్తమి
(నిన్న రాత్రి 8 గం॥ 46 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 6 గం॥ 46 ని॥ వరకు)
నక్షత్రం : మూల
(ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 12 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 1 గం॥ 52 ని॥ వరకు)
యోగము : సౌభాగ్యము
కరణం : గరజ
వర్జ్యం : (ఈరోజు ఉదయం 10 గం॥ 45 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 15 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు రాత్రి 7 గం॥ 49 ని॥ నుంచి ఈరోజు రాత్రి 9 గం॥ 19 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 28 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 15 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 34 ని॥ నుంచి ఈరోజు రాత్రి 6 గం॥ 3 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 4 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 33 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 12 గం॥ 5 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 34 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 6 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 4 ని॥ లకు
సూర్యరాశి : కన్య
చంద్రరాశి : ధనుస్సు

మేషం?
ఆలయ దర్శనాలు చేసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో పురోగతి కలుగుతుంది వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
అదృష్ట సంఖ్య 1

వృషభం?
గృహమునకు కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుంటారు. వ్యాపారపరంగా అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగ అనుకూలత కలుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు
అదృష్ట సంఖ్య 9

మిథునం?
ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితులతో కలహా సూచనలు ఉన్నవి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. ముఖ్యమైన పనులలో శ్రమకు ఫలితం ఉండదు. కొత్త రుణయత్నాలు వేగవంతం చేస్తారు.
అదృష్ట సంఖ్య 7

కర్కాటకం?
బంధుమిత్రులతో విభేదాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలు శ్రమతో పూర్తి చేస్తారు. చేపట్టిన పనులు మధ్యలో వాయిదా పడతాయి. కుటుంబంలో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి
అదృష్ట సంఖ్య 1

సింహం?
ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. ప్రతికూల పరిస్థితుల నుండి తెలివిగా బయటపడతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. చేపట్టిన పనులలో ఆకస్మిక విజయం సాధిస్తారు. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది విద్యార్థుల ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి.
అదృష్ట సంఖ్య 9

కన్య?
చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. సమాజంలో పేరు కలిగిన వ్యక్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.ఆలయ దర్శనాలు చేసుకుంటారు.
అదృష్ట సంఖ్య 7

తుల⚖️
బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి కొన్ని పనులు వ్యయప్రయాసలతో గాని పూర్తి కావు. ఉద్యోగ వాతావరణం నిరాశ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యల విషయంలో అశ్రద్ధ పనిచేయదు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.
అదృష్ట సంఖ్య 1

వృశ్చికము?
దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు దూరప్రయాణాలలో శ్రమ మరింత అధికమవుతుంది. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. నిరుద్యోగులకు కష్టానికి తగిన ఫలితం ఉండదు చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు.
అదృష్ట సంఖ్య 2

ధనస్సు?
దూరపు బంధువుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. మంచి మాట తీరుతో ఇంటా బయట అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. ప్రముఖుల సలహాలు కొన్ని వ్యవహారాలలో పనిచేస్తాయి.
అదృష్ట సంఖ్య 8

మకరం?
ఆలోచనలు స్థిరంగా ఉండవు. రుణదాతల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది.
అదృష్ట సంఖ్య 8

కుంభం⚱️
ఉద్యోగాలలో వ్యాపారస్తుల అవసరానికి ధన సహాయం లభిస్తుంది. అధికారుల సహాయ సహకారాలు పొందుతారు. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రుల నుంచి ఆకస్మిక ధన లబ్ది పొందుతారు.
అదృష్ట సంఖ్య 6

మీనం?
అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికమవుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణా సూచనలు ఉన్నవి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత ఒత్తిడులు పెరుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది.
అదృష్ట సంఖ్య 4.