నేటి నుంచి విద్యుత్తు ఉద్యోగుల ఆందోళన బాట..

నేటి నుంచి విద్యుత్తు ఉద్యోగుల ఆందోళన బాట.

విద్యుత్తు ఉద్యోగులకు 2022, ఏప్రిల్‌ నుంచి వర్తింపజేయాల్సిన పీఆర్సీ కోసం ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఎంప్లాయీస్‌ ఐకాస సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.మంగళవారం నుంచి మార్చి 24 వరకు వివిధ దశల్లో సమావేశాలు, నిరసన ప్రదర్శనలు, రిలే నిరాహార దీక్షలు, ధర్నా తదితర కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. యాజమాన్యం స్పందించకపోతే మార్చి 24న భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఐకాస నేతలు తెలిపారు._