ఓం శ్రీ గురుభ్యోనమః
పంచాంగం..(neti panchangam)
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 08 – 06 – 2023,
వారం … బృహస్సతివాసరే ( గురువారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు,
జ్యేష్ఠ మాసం – బహళ పక్షం,
తిథి : పంచమి రా10.49 వరకు,
నక్షత్రం : శ్రవణం రా10.58 వరకు
యోగం : ఐంద్రం రా11.06 వరకు,
కరణం : కౌలువ మ12.02 వరకు,
తదుపరి తైతుల రా10.49 వరకు,
వర్జ్యం : ఉ.శే.వ. 5.49 వరకు
మరల రా2.41 – 4.10 వరకు,
దుర్ముహూర్తము : ఉ9.48 – 10.40 &
మ3.00 – 3.52,
అమృతకాలం : మ1.15 – 2.45,
రాహుకాలం : మ1.30 – 3.00,
యమగండo : ఉ6.00 – 7.30,
సూర్యరాశి : వృషభం,
చంద్రరాశి : మకరం,
సూర్యోదయం : 5.28,
సూర్యాస్తమయం: 6.28,
*_నేటి విశేషం_*
*నేటి నుండి – మృగశిర కార్తె ప్రారంభం*
ఈ కార్తె రోజు ప్రతి ఇంట్లో చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది.
దీని వెనుక ఆరోగ్య రహస్యం దాగివుంది, రోళ్లు పగిలే ఎండలను మోసుకొచ్చిన రోహిణికార్తె ముగిసి… చల్లబరిచే మృగశిర మొదలవుతుంది.
మృగశిర కార్తె అంటే…
ఆశ్విని మొదలుకుని రేవతి వరకూ మనకున్న 27 నక్షత్రాల్లో సూర్యుడి ప్రవేశం ఆధారంగా కార్తె నిర్ణయం జరుగుతుంది.
భారతీయ జ్యోతిష్య సాంప్రదాయం ప్రకారం..
ఒక్కో కార్తెలో ఒక్కో విధంగా ప్రకృతిలో మార్పులు జరుగుతుంటాయి.
ఈ క్రమంలో సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించి నాటినుంచి నైరుతి రుతుపనాలు వస్తాయి, వాతావరణం ఒక్కసారి చల్లబడటం , ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకునే నేపథ్యంలో అనేక రకాల చెడు సూక్ష్మీక్రిములు వంటివి పునురుత్పత్తి అవుతాయి…
మానవునిలో రోగ నిరోధకశక్తి తగ్గి జ్వరం , దగ్గు , శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయి,
మృగశిర కార్తెలో చేపలు తినడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవచ్చని, ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది.
చేపలు తినడం వల్ల ముఖ్యంగా గుండె జబ్బులు , ఆస్తమా , మధుమోహ వ్యాధి ఉన్నవారు , గర్భిణులు ఈ సమయంలో చేపలు తింటే ఎంతో ప్రయోజనం ఉంటుంది…
ఈ నేపథ్యంలో మనిషి శరీరంలో మార్పులు జరిగి వ్యాధుల బారిన పడే ప్రమాదముంది…
గుండెజబ్బులు , ఆస్తమా తదితర ఆనారోగ్యసమస్యలు ఉత్పన్నమవుతాయి, వీటన్నింటికి అడ్డుకట్ట వేయాలంటే చేపలు తినాల్సిందే.
పంచాగ ప్రకారం ఆరుద్ర నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే సమయంలోని తిథి , వార , నక్షత్ర , యోగ , కరణాలు , శకునాలు తదితర అంశాల ఆధారంగా చేసుకుని ఆ సంవత్సరం యొక్క వర్షాన్ని నిర్ణయించడం జరుగుతుంది. ఈ విధంగా వ్యవసాయదారులకు నిత్యజీవనోపయోగిగా,వ్యవసాయం పనులకు మార్గదర్శకంగా ఈ కార్తెలు ఉపయోగపడుతున్నాయి.
*పురాణగాధ ప్రకారం*
మృగశిరస్సు కలిగిన మృగవ్యాధుడు అను వృతాసురుడు వరప్రభావంచే పశువులను , పంటలను హరించి వేయడం ప్రకృతి భీభత్సాలాను సృష్టించడం , వర్షాలకు అడ్డుపడటం జరుగుతూ ఉండేడిది.
ఇతను చనిపోకుండా అనేక వరాలు కలిగి ఉండటంచేత ఇంద్రుడు సముద్ర హలల నుండి వచ్చే నురుగును ఆయుధంగా చేసి చంపేస్తాడు.
ప్రకృతి మార్పు ప్రభావం
ఈ కథ ఆధారంగా ఖగోళంలో ఇంద్ర నక్షత్రమైన జ్యేష్టాకు మృగశిరకు 180 డిగ్రీల దూరంలో ఉండటం వలన తూర్పు ఆకాశంలో ఇంద్ర నక్షత్రం ఉదయించగానే వృతాసుర నక్షత్రం అస్తమిస్తుంటుంది.
ఇక్కడ నురుగు అనేది ఋతుపవనాలకు , వర్షాలకు సూచన.
ఇంద్ర నక్షత్రమైన జ్యేష్ట ఉదయించినపుడు సూర్యుడు మృగశిరలోకి ప్రవేశించడం వలన మృగశిరకార్తె ప్రవేశిస్తుంది.
వర్షాలు పడకుండా అడ్డుపడ్డ మృగాసురుని చంపిన ఇంద్రున్ని వర్షప్రదాతగా , వర్షదేవుడుగా పిలుస్తారు, ఇదీ కథ…
స్వస్తి …