*నేటి రాశి ఫలాలు*
🐐 *_మేషం_*
ఈరోజు (16-07-2023)
గతంలో కన్నా మంచికాలం ఉంటుంది. సప్తమ చంద్రబలం బాగుంది. ప్రారంభించబోయే పనుల్లో విజయావకాశాలు పెరుగుతాయి. దృష్టి సారించి పనిచేస్తే అనుకున్నది సాధిస్తారు. అనవసరమైన విషయాలను
పట్టించుకోవద్దు. శ్రీరామ నామాన్ని జపించాలి.
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
ఈరోజు (16-07-2023)
మీ మీ రంగాల్లో ప్రయత్నబలాన్ని రెట్టింపు చేసి విజయాలను అందుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి. ద్వితీయంలో చంద్రబలం మిశ్రమంగా ఉంది. పనిలో శ్రమ పెరుగుతుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ఆదిత్య హృదయం చదవాలి.
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
ఈరోజు (16-07-2023)
మంచికాలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో జయకేతనం ఎగురవేస్తారు. అపరాన్నకాలం నుంచి శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి. జన్మరాశిలో చంద్రబలం అనుకూలంగా ఉంది. బంధు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపార పెట్టుబడి లాభిస్తాయి. శ్రీధనలక్ష్మి
ఆరాధన శ్రేష్టం.
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
ఈరోజు (16-07-2023)
తోటి వారి సహకారంతో పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. కీలక విషయాల్లో ఒకటికి రెండుసార్లు ఆలోచించి తుది నిర్ణయం తీసుకోవడం మంచిది. మాట పట్టింపులకు పోవద్దు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆంజనేయస్తుతి చేయాలి.
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
ఈరోజు (16-07-2023)
గతంలో కన్నా మెరుగైన ఫలితాలు ఉన్నాయి. సంతృప్తికరమైన జీవనం కొనసాగిస్తారు. లాభంలో చంద్రబలం అనుకూలంగా ఉంది. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక శుభవార్త మీలో ఆనందాన్ని నింపుతుంది. శని శ్లోకం చదువుకోవాలి.
🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
ఈరోజు (16-07-2023)
శ్రమ ఏవ జయతే అన్న వాక్యాన్ని పాటిస్తారు. ఆత్మవిశ్వాసాన్ని వీడకండి. గొప్ప విజయాలు ఉన్నాయి. దశమంలో చంద్రుడు ప్రయత్న కార్యసిద్ధిని ప్రసాదిస్తున్నారు. భోజన సౌఖ్యం కలదు. డబ్బుల విషయంలో నమ్మి మోసపోకండి. ప్రయాణాల్లో జాగ్రత్త. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.
💃💃💃💃💃💃💃
⚖ _తుల_*
ఈరోజు (16-07-2023)
ప్రారంభించబోయే పనులలో శ్రమ అధికం అవుతుంది. పనులను వాయిదా వేయకండి. ఉద్యోగస్థులపై అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. తోటివారితో వాగ్వాదాలకు పోరాదు. నవమంలో చంద్రుడు మిశ్రమ ఫలితాలను ఇస్తున్నారు. కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలగాలి. ఈశ్వరారాధన చేయాలి.
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
ఈరోజు (16-07-2023)
చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. పట్టుదల తగ్గకుండా పనిచేయాలి. పని భారం ఎక్కువ అవ్వడం వల్ల శారీరక శ్రమ పెరుగుతుంది. ఇంటా బయట జాగ్రత్త వహించాలి. చంద్ర ధ్యాన శ్లోకం చదవాలి.
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
ఈరోజు (16-07-2023)
శుభకాలం. మీ రంగాల్లో అన్ని విధాలా కలిసివచ్చే కాలం. ప్రారంభించిన పనులు చకచకా పూర్తవుతాయి. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. కీర్తి పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలు లభిస్తాయి. శ్రీలక్ష్మీగణపతి ఆరాధన శ్రేయోదాయకం.
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
ఈరోజు (16-07-2023)
అసాధారణ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే సత్ఫలితాలను సాధిస్తారు. పనిలో అలసత్యాన్ని రానీయకండి. శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. – మనఃశ్శాంతి కోసం తగిన విశ్రాంతి అవసరం అవుతుంది. అనవసర విషయాల్లో కలుగజేసుకోకుండా ఉండటం మంచిది. దుర్గా ఆరాధన శ్రేష్టం.
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
ఈరోజు (16-07-2023)
ముందుగా జాగ్రత్త పడాలి. పంచమంలో చంద్రబలం ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు ఎదురు కాకుండా అనుకూలించలేదు. రెట్టించిన మనోబలంతో ముందుకు సాగితే సత్ఫలితాలు వస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆగ్రహావేశాలకు పోరాదు. లక్ష్మీ అష్టకం చదవాలి.
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
ఈరోజు (16-07-2023)
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. చంచల బుద్ధి వల్ల కార్యవిఘ్నం కలుగకుండా జాగ్రత్త పడాలి. స్థిరమైన నిర్ణయాలతో విజయం వరిస్తుంది. చతుర్ధంలో చంద్రబలం అనుకూలంగా లేదు. తోటివారితో అతి చనువు పనికిరాదు. మీ పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగితే సత్ఫలితాలు వస్తాయి. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం ఉత్తమం.
🦈🦈🦈🦈🦈🦈🦈