పంచాంగం.

పంచాంగం.
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 20 – 07 – 2023,
వారం … బృహస్పతివాసరే ( గురువారం)
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయనం – వర్ష ఋతువు,
అధిక శ్రావణ మాసం – శుక్ల పక్షం,

తిథి : తదియ తె3.13 వరకు,
నక్షత్రం : ఆశ్రేష ఉ9.40 వరకు,
యోగం : సిద్ధి ఉ11.06 వరకు,
కరణం : తైతుల మ3.13 వరకు,
తదుపరి గరజి తె3.13 వరకు,

వర్జ్యం : రా10.58 – 12.44,
దుర్ముహూర్తము : ఉ9.56 – 10.48 &
మ3.07 – 3.58,
అమృతకాలం : ఉ7.53 – 9.39,
రాహుకాలం : మ1.30 – 3.00,
యమగండo : ఉ6.00 – 7.30,
సూర్యరాశి : కర్కాటకం,
చంద్రరాశి : కర్కాటకం,
సూర్యోదయం : 5.38,
సూర్యాస్తమయం: 6.34,

L *_నేటి మాట_*

*సాధన…!!*
మనసుని కలుషితంచేసే కోరికలే కాదు అనవసరంగా దొర్లే చిన్న మాట కూడా మనని బాహ్యముఖంచేసి శాంతిని దూరం చేస్తుంది.

అందుకే సాధకులు స్నేహితులు, బంధువులతో కూడా మితంగానే ఉండాలి, ఏదో ఒక గుర్తింపు కోరుకునే మనసుకు అనామకత్వాన్ని అలవాటు చేయాలి.

సాత్వికత లేనివారి సహచర్యాన్ని, లౌకిక విషయాసక్తిని, సాధనకు సహకరించని పరిచయాలను తగ్గించుకోవాలి.

ఎంతమందిలో ఉన్నా దైవనామాన్ని జపిస్తూ అంతర్గతంగా ఏకాంతాన్ని అలవాటు చేసుకోవాలి.
మనసులో ఆలోచనలు రేకెత్తించే వ్యాపకాలను తగ్గించుకోవాలి.

ఇవన్నీ ఆచరించిన రోజున నిజమైన గురుబోధ మనలో నుండి వినిపిస్తుంది.

గురు అనుగ్రహం వల్ల కలిగే పరిణామం అంతర్ముఖత్వం, మనసు అంతర్ముఖం కావడమంటే ఎప్పుడూ కళ్ళు మూసుకొని కూర్చోవడం మాత్రమే కాదు, చూసిందల్లా కావాలనిపించని నిర్లిప్త గుణం అలవడితే మనసు అంతర్ముఖం అవుతుందని అర్ధం.

గురువు అందించే ఈ గుణాన్ని అలవాటు చేసుకునేందుకు నిరంతర సావధానత అవసరం.
మన మనసును అనుక్షణం నిగ్రహించుకుంటే గానీ ఇది సాధ్యం కాదు…

*_💫శుభమస్తు💫_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏