ఓం శ్రీ గురుభ్యోనమః
పంచాంగం.(neti panchangam)
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ (date )… 23 – 07 – 2023,
వారం … భానువాసరే( ఆదివారం sounday)
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయనం – వర్ష ఋతువు,
అధిక శ్రావణ మాసం – శుక్ల పక్షం,
తిథి : పంచమి ఉ7.52 వరకు,
తదుపరి షష్ఠి,
నక్షత్రం : ఉత్తర సా4.56 వరకు,
యోగం : పరిఘము మ12.41 వరకు,
కరణం : బాలువ ఉ7.52 వరకు,
తదుపరి కౌలువ రా8.31 వరకు,
వర్జ్యం : రా1.58 – 3.41,
దుర్ముహూర్తము : సా4.49 – 5.41,
అమృతకాలం : ఉ9.04 – 10.49,
రాహుకాలం : సా4.30 – 6.00,
యమగండo : మ12.00 – 1.30,
సూర్యరాశి : కర్కాటకం,
చంద్రరాశి : కన్య,
సూర్యోదయం : 5.39,
సూర్యాస్తమయం: 6.33,
*_నేటి మాట_*
*మానవ జన్మకు సార్థకత ఏమిటి??*
అన్ని జన్మలకన్న మానవ జన్మ చాలా సుకృతమైనది, మానవ జన్మ ఎత్తినది మళ్లీ జన్మ ఎత్తకుండా చేసుకోవడానికే కానీ ఈరోజు ధనం, బందుఘనం, ఆడంభరం చేయడానికే అని భావిస్తున్నాము…
భ్రమరం గురించిన ఆలోచనతో కీటకం, కొంతకాలానికి తానే భ్రమరంగా మారిపోతుందిట…
(కీటకం బెప్పుడూ భ్రమరం ధ్యానము చేసి భ్రమరమే తానాయె ఓరామ, అని (‘అధ్యాత్మ రామయణ కీర్తన)
వెలుగు కోసం భ్రమరం కీటకాన్ని తన గూటిలో బంధిస్తుంది.
భ్రమరం చేసే ఝుంకార నాదాన్ని ఆ కీటకం, వినీ వినీ, తానే భ్రమరంగా మారిపోయి ఝుంకారం చేస్తూ బయటకు వెళ్లి పోతుంది…
ఆవిధంగా దైవం నుండి వచ్చిన మనము, ఎల్లప్పుడు దైవ చింతన చేస్తూ ఉంటే , చివరకు ,తనే దైవం అని తెలుసుకుంటాడు…
అదే నరజన్మకు సార్థకత, ఒక్కటి గుర్తుంచుకోవాలి, మన సఖుడు, మన బాంధవుడు, మన మిత్రుడు అంతా దైవమే, అని ఎల్లప్పుడూ విశ్వశించాలి,
అప్పుడే మన జన్మకు సార్థకత చేకూరుతుంది…
*_🥀శుభమస్తు🥀_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏