నేటి పంచాంగం…

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌹పంచాంగం🌹
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 28 – 07 – 2023,
వారం … భృగువాసరే ( శుక్రవారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయనం – వర్ష ఋతువు,
అధిక శ్రావణ మాసం – శుక్ల పక్షం,

తిథి : దశమి ఉ9.39 వరకు,
నక్షత్రం : అనూరాధ రా9.11 వరకు,
యోగం : శుక్లం ఉ9.07 వరకు,
కరణం : గరజి ఉ9.39 వరకు,
తదుపరి వణిజ రా9.07 వరకు,

వర్జ్యం : రా2.39 – 4.13,
దుర్ముహూర్తము : ఉ8.14 – 9.05 &
మ12.31 – 1.22,
అమృతకాలం : ఉ10.50 – 12.25,
రాహుకాలం : ఉ10.30 – 12.00,
యమగండo. : మ3.00 – 4.30,
సూర్యరాశి : కర్కాటకం,
చంద్రరాశి : వృశ్చికం,
సూర్యోదయం : 5.40,
సూర్యాస్తమయం: 6.31,

*_నేటి మాట_*
*ఈ మాసంలో అమ్మవారి పూజా ఫలం*

ఈ మాసంలో ఆ జగజ్జనని అయిన అమ్మవారు వివిధ రూపాలతో .. వివిధ నామాలతో పూజలు అందుకుంటూ ఉంటుంది…

అలాంటి అమ్మవారిని ఒక్కోరోజున అభిషేకించడం వలన ఒక్కో నైవేద్యాన్ని సమర్పించడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

ఆవు పాలతో అమ్మవారికి అభిషేకం చేయడం వలన సమస్త దోషాలు తొలగిపోతాయి.

ఆవు పెరుగుతో అభిషేకం చేయడం వలన సంపదలు చేకూరతాయి.

ఆవునెయ్యితో అభిషేకం చేయడం వలన అనారోగ్యం దరిచేరదు.

తేనెతో అమ్మవారిని అభిషేకించడం వలన కీర్తి పెరుగుతుంది.

పసుపు నీళ్లతో అమ్మవారిని అభిషేకించడం వలన సౌభాగ్యం నిలుస్తుంది.

ఇక అమ్మవారికి అత్యంత ఇష్టమైన నైవేద్యంగా ‘పాయసం’ చెప్పబడుతోంది.

‘పాయసం’ నైవేద్యంగా సమర్పించడం వలన, అమ్మవారు ప్రీతి చెందుతుంది…

తన భక్తుల అవసరాలను గ్రహించి వారి మనసులోని ధర్మబద్ధమైన కోరికలు నెరవేరేలా అనుగ్రహిస్తుంది.

ఆపదలను తొలగిస్తూ ఆయురారోగ్యాలను .. సంతాన సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది, అందువలన అనునిత్యం అమ్మవారిని పూజిస్తూ .. సేవిస్తూ .. తరిస్తూ ఉండాలి…

*_🌹శుభమస్తు🌹_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏