🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌺పంచాంగం🌺
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 27 – 09 – 2023,
వారం … సౌమ్యవాసరే ( బుధవారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయనం – వర్ష ఋతువు,
భాద్రపద మాసం – శుక్ల పక్షం,
తిథి : త్రయోదశి రా8.49 వరకు,
నక్షత్రం : ధనిష్ఠ ఉ6.05 వరకు,
తదుపరి శతభిషం తె4.26 వరకు,
యోగం : ధృతి ఉ7.51 వరకు,
కరణం : కౌలువ ఉ10.03 వరకు,
తదుపరి తైతుల రా8.49 వరకు,
వర్జ్యం : ఉ12.47 – 2.16,
దుర్ముహూర్తము : ఉ11.28 – 12.16,
అమృతకాలం : రా9.43 – 11.13,
రాహుకాలం : మ12.00 – 1.30,
యమగండo : ఉ7.30 – 9.00,
సూర్యరాశి : కన్య,
చంద్రరాశి : మకరం,
సూర్యోదయం : 5.53,
సూర్యాస్తమయం: 5.53,
*_నేటి విశేషం_*
*పుణ్య దినం – భవ్య దినం – షిర్డీసాయి బాబా వారి – జన్మదినం*
ఒక రోజు హేమాదిపంత్ బాబా వద్దకు వచ్చి, బాబా జీవిత చరిత్ర వ్రాయటానికి అనుమతి తీసుకున్నాడు…
ఎంతో వెదుకొనగా బాబా వారు అనుమతి అనుగ్రహించారు…
అప్పుడు బాబా జీవిత చరిత్ర రాయడం ప్రారంభించారు, మొత్తం సాయి బాబా జీవిత చరిత్ర ను వ్రాసి వారు అతడే…
కానీ, అత డెంత ప్రార్ధించి నప్పటికీ, బాబా, తానెక్కడ పుట్టాడో, తల్లి తండ్రులెవరో, తన అసలు పేరేమిటో చెప్పలేదు.
అసలు ఈ విషయాలను బాబా ఎవ్వరికీ చెప్పలేదు…
కానీ, ఒకసారి మహల్సాపతి, ఏకాంతంగా సేవ చేస్తున్న సమయంలో, అడగకుండానే అతనికి బాబా తాను పుట్టిన తేదీ మరియు ఇతర వివరాలు అన్ని తెలియ చేశాడు.
బాబా తత్వం ఎవ్వరికీ తెలియదు, ఈవారం అర్థం చేసుకోడం కూడా కష్టమే…
ఆరోజులలో దాదా, నానా, అబ్దుల్ బాబా, చందోర్కర్, మహల్సాపతి — వీరందరు బాబా వెంబడి ఎప్పుడు ఉండేవారు.
మొన్న మొన్నటి వరకూ, అబ్దుల్ బాబా జీవించాడు, అతడొక గొప్ప భక్తుడు…
ఇతడేకాక, ‘కాకదీక్షిత్’ అనే మరొక భక్తుడు కూడా ఉండేవాడు,
ఆ దీక్షత్ కొడుకు కూడా బృందావనంలో 20సం. లు ఉన్నాడు…
కాకాదీక్షిత్ నుండి, అతని కొడుకు వ్రాసుకున్న డైరీలో, బాబా తాను తిరిగి ఎక్కడ జన్మిస్తాడో,తెలిపినట్లు గా వ్రాయబడింది…
*బాబా క్రీస్తు. శ. 1854 సం. తన 16 వ యేట మొట్టమొదటి సారిగా షిర్డీ లో ప్రవేశించాడు…*
*తిరిగి 3 సం. ల తర్వాత, చాందూభాయ్ పటేల్ తో తిరిగి షిర్డీ వచ్చి షిర్డీ ని వదిలి వెళ్లలేదు…*
*క్రీస్తు. శ. 1838, సెప్టెంబర్ 27 న జన్మించి,*
*క్రీస్తు. శ. 1918 సం. లో విజయదశమి రోజున దేహాన్ని చాలించాడు…*
*అంతాకలిసి, 80 సం. లు. జీవించాడు…*
ఆ కాలంలో బాబా తన శక్తి సామర్ధ్యాలను నిరూపిస్తూ, ప్రజలకు అనేక ప్రభోదలు చేస్తూ జీవించాడు…
ఎన్నో మహిమలు, ఎన్నెన్నో భోదలు సలుపుతూ, భక్తులకు కొంగు బంగారమై అడుగడుగునా కాపాడుతూ, ఇప్పటికీ వారి ఇంటా వెంటా జంట వుంటున్నారు…
*ముఖ్యంగా :-*
నీవు నన్ను చూడు – నేను నిన్ను చూస్తాను అని అన్నారు …
అంటే తన విగ్రహం పెట్టుకునో లేక ఫోటో పెట్టుకొని చూడమని కాదు…
ప్రతి వ్యక్తి లో, ప్రతి వస్తువులో , నిరంతరం నువ్వు చేస్తున్న పనిలో, అన్నింటిలో నన్నే చూడమని అర్థం, అప్పుడు మనం నిర్వహించే కార్యం అంతా సాయి కార్యమే అవుతుందని, వారి బోధ, ఇలా ఎన్నెన్నో భోధిస్తూ … భక్తుల హృదయాలు పవిత్రం గావించిన అవతారమే షిర్డీసాయి అవతారం…
నమ్మిన వాడికి సొమ్ము – నమ్మని వాడికి దుమ్ము
శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ సాయినాధ మహరాజ్ కీ జై 🙏🙏🙏
*_🌺శుభమస్తు🌺_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏