నేటి పంచాంగం.. నేటి మాట…

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🥀పంచాంగం🥀
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 05 – 10 – 2023,
వారం … బృహస్పతివాసరే ( గురువారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయనం – వర్ష ఋతువు,
భాద్రపద మాసం – బహళ పక్షం,

తిథి : షష్ఠి ఉ8.47 వరకు,
నక్షత్రం : మృగశిర రా11.28 వరకు,
యోగం : వ్యతీపాతం ఉ10.28 వరకు,
కరణం : వణిజ ఉ8.47 వరకు,
తదుపరి విష్ఠి రా8.59 వరకు,

వర్జ్యం : ఉ.శే.వ6.07 వరకు,
దుర్ముహూర్తము : ఉ9.50 – 10.38 &
మ2.35 – 3.22,
అమృతకాలం : మ2.22 – 4.01,
రాహుకాలం : మ1.30 – 3.00,
యమగండo : ఉ6.00 – 7.30,
సూర్యరాశి : కన్య,
చంద్రరాశి : వృషభం,
సూర్యోదయం : 5.54,
సూర్యాస్తమయం: 5.46,

*_నేటి మాట_*

*దేవుడు దేవుడు అంటారు, దైవానికి అంత ప్రత్యేకత ఎందుకివ్వాలి???…*

భగవంతుడు, ఆకారంలో వస్తాడు, కానీ నిరాకారుడు.
అటువంటి భగవంతుని అనేక రకములుగా ఆరాధిస్తున్నాము, కానీ, అందరికీ అనుకూలమైన స్థితిలో లేడు కదా!!!…

అట్టి దైవాన్ని మనం విశ్వసించి, ఆరాధించి, అనేకమైన విధాలుగా ఆనందాన్నందుకుంటున్నాము!!!….

దైవము నందున్న చైతన్య మే సర్వజీవుల యందు కూడా ఉంటుంది.
ఎంతో మంది గురువులు, యోగులు, ఋషులు వున్నారు, కదా !!!
వారికి కాకుండా దైవత్వానికే ఎందుకు ప్రత్యేకత ఇవ్వాలి?
అని ఈరోజుల్లో అందరికీ సందేహము కలగవచ్చు!!…

బల్బులన్నీ సమానంగానే గోచరించినప్పటికీ వాటిలోని ఫిలమెంటులలో వ్యత్యాసం ఉంటుంది…
ఒకటి 40 w , మరొకటి 60 W
అదే రీతిగా మరొకటి 100 W గా ఉండవచ్చు.

వీరందరిలో ఉన్న సంకల్పములు, వికల్పాలు యందు భేదముంటున్నది…
కానీ భగవంతుని యందు వున్న ఫిలమెంటు కొలకట్ట లేనిది, దాని శక్తి అపారమైనది, పవిత్ర మైనది , అనంత మైనది, అందుకే దైవ శక్తి ఉన్నతమైనది … ఎందుకంటే వీరందరినీ సృష్టించినది ఆయనే కాబట్టి…

ఇట్టి దైవశక్తి మానవాకారంలో ఉన్న దైవము నందు అధికంగా ఉంటుంది…
అందువల్లనే దైవానికి ప్రత్యేకత ఇవ్వవలసి వుంది….
సామాన్య మానవులలో అహంకార, మమకారములు ఎక్కువగా ఉండుటచేత , ప్రకృతి శక్తులన్నీ తనవి గా భావిస్తుoటాడు…
అందుకే ఈ దివ్య తత్వానికి దూరంగా ఉంటారు…
అందుకే దివ్యత్వానికి ప్రత్యేకత ఇవ్వాలి…
అది కేవలం అనుభవించిన వారికి మాత్రమే అర్థం అవుతుంది…

*_🥀శుభమస్తు🥀_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏