🙏సర్వేజనాః సుఖినోభవంతు🙏
🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
🌹పంచాంగం🌹
శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు,
తేది … 24 – 10 – 2023,
వారం … భౌమ్య వాసరే (మంగళ వారము),
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయనం,
శరదృతువు,
ఆశ్వీజమాసం,
శుక్ల పక్షం,
తిధి : దశమి మ 12.48 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం : ధనిష్ఠ మ 2.07 వరకు
తదుపరి శతభిషం
యోగం: గండం మ 3.15 వరకు
తదుపరి వృద్ధి
కరణం : గరజి మ 12.48 వరకు
వణిజ రా 11.35 వరకు
అమృతకాలం : తె 5.45 నుండి
దుర్ముహూర్తం : ఉ 8.17 – 9.03 వరకు
రా 10.30 – 11.20 వరకు
వర్జ్యం : రా 8.49 – 10.18 వరకు
రాహుకాలం : మ 3.00 – 4.30 వరకు
యమగండకాలం : ఉ 9.00 – 10.30 వరకు
సూర్యరాశి : తుల
చంద్రరాశి : కుంభం
సూర్యోదయం : 5.58
సూర్యాస్తమయం : 5.32.
🌸శుభోదయం🌸
🌺నేటిపెద్దలమాట🌺
మనకు ఏర్పడే సమస్యల పట్ల, కలిగే సంఘటనల పట్ల మనకు గల దృక్పధమే, మన జయాపజయాలను నిర్ణయిస్తుంది.
అందువల్ల జీవితంలో మనకు ఎదురయ్యే అడ్డంకులను అధిరోహించడానికి సరైన దృక్పధాన్ని అలవర్చుకోవడమే నిజమైన ప్రతిభ.
🌹నేటిమంచిమాట🌹
సమయము, శక్తి, ధనము ఇవన్నీ ఎప్పుడైనా, మనకు సహకరించకపోవచ్చు.కాని
మంచి ప్రవృత్తి, మంచిగా అర్ధము చేసుకొనే మనస్తత్వం, మంచి నడవడిక మరియు నిజమైన మనస్సు
ఎప్పుడూ మన జీవితం లో సహకరిస్తాయి.
🌷🌾🌷🌾🌷🌾🌷🌾🌷🌾🌷
*దసరా – ఖగోళవిశేషం*
*”తూర్పున సింహరాశి ఉదయించే రోజుల్లో మహిషతారలు ఆకాశ మధ్యమంలో రెండు కొమ్ముల్ని తూర్పు దిక్కుకు చాచుకొని ఉన్నట్లుగా దర్పంగా ఉంటాయి. అదే మహిషాసురుడి యుద్ధ సన్నద్ధత. క్రమేపి రోజు రోజుకూ సింహం… కన్య ఆకాశంలోకి ఎగబ్రాకుతుంటే మహిషతారలు పశ్చిమానికి వాలిపోవడం ఆరంభిస్తాయి. పది రోజులకు సింహ, కన్యారాశులు బాగా పైకి వస్తాయి. సూర్యుడు సింహం నుండి కన్యలో చేరుతాడు. మహిషతారలు వాలిపోతాయి. అదే జగన్మాత మహిషాసురుల యుద్ధం. మహిషుడి మరణం దుర్గామాత విజయం…. దసరా రోజుల సంకేతం!*
*ఇది ఖగోళంలో జరిగిన నక్షత్ర సముదాయాల గతులను గుర్తు పెట్టుకోవడం కూడా తెలియజేస్తుంది. ఖగోళంలో జరిగే ఇలాంటి ‘గ్రహగతుల విజ్ఞానం’ మన పండుగలకు అనుసంధానం చేసి ఆ సంఘటన గుర్తుపెట్టుకొనేటట్లు మన పూర్వీకులు చేశారు.*
*ఆకాశంలో రోహిణి నక్షత్రాలను మరో రెండు నక్షత్రాలతో కలిపి వృషభ శిరస్సుగా చిత్రిస్తారు మన జ్యోతిషకర్తలు. ఇదే వృషభ శిరస్సును మహిషుని శిరస్సుగా వర్ణించారు కొందరు ఋషులు. వృషభం అనగా యెద్దు. మహిషం అనగా దున్నపోతు. మహిషాసురుడే ఆ దున్నపోతు. ఆకాశంలో సింహరాశి, కన్యారాశి అనే నక్షత్రాల గుంపులున్నాయని మనకు తెలుసు. ఆ సింహరాశియే అమ్మవారి సింహం. ఆ తదుపరి ఉదయించే కన్యారాశియే శ్రీ దుర్గామాత.
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
🌺శుభమస్తు🌺
🙏సమస్తలోకా సుఖినోభవంతు🙏