నేటి పంచాంగం…_నేటి విశేషం_..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🥀పంచాంగం🥀
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 28 – 10 – 2023,
వారం … స్థిరవాసరే ( శనివారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయనం – శరదృతువు,
ఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం,

తిథి : పౌర్ణమి రా1.58 వరకు,
నక్షత్రం : రేవతి ఉ7.57 వరకు,
యోగం : వజ్రం రా12.35 వరకు,
కరణం : విష్ఠి మ2.51 వరకు
తదుపరి బవ రా1.58 వరకు,

వర్జ్యం : తె3.03 – 4.35,
దుర్ముహూర్తము : ఉ6.00 – 7.31,
అమృతకాలం : రా12.00 – 1.32,
రాహుకాలం : ఉ9.00 – 10.30,
యమగండo : మ1.30 – 3.00,
సూర్యరాశి : తుల,
చంద్రరాశి : మీనం,
సూర్యోదయం : 6.00,
సూర్యాస్తమయం: 5.28,

*_నేటి విశేషం_*

*మహాశ్విని*,
*శ్రీ వాల్మీకి జయంతి*,
*కౌముదీ పూర్ణిమ*,
*అక్ష క్రీడ*,
*కోజాగౌరి వ్రతము*,
*ఈరోజు రాత్రి కి – రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం*

*పాక్షిక చంద్రగ్రహణం*

_పాక్షిక చంద్రగ్రహణం సమయం_
స్వస్తిశ్రీ శోభకృత్ నామ సంవత్సరము ఆశ్వయుజ శుక్ల పూర్ణిమ శనివారం తేది 28-10-2023వ తేదీ రాత్రి, అంటే 29వ తేదీ ప్రారంభ సమయంలో రాహుగ్రస్త ఖండగ్రాస సోమోపరాగము అనగా *పాక్షిక చంద్రగ్రహణం* ఏర్పడుతుంది.

అక్టోబర్ 28వ తేదీన అర్ధరాత్రి 1.06 గంటలకు ప్రారంభమై 2.22 నిల వరకు ఉంటుంది.
1 గంట 16 నిమిషాలు గ్రహణ సమయం.

ఈ గ్రహణము అశ్వినీ నక్షత్రం, మేషరాశిలో ఏర్పడుతుంది…
*అశ్వనీ భరణీ, కృత్తికా 1వపాదం మేషరాశివారు చూడరాదు.*
కుంభం, వృశ్చికం, కర్కాటకం, మిథునం రాశుల వారికి శుభం. తుల, ధనస్సు, సింహం, మీన రాశుల వారికి మధ్యమం…
మేషం, వృషభం, కన్య, మకరం రాశుల వారికి అరిష్టము.

గ్రహణ దోషమున్నవారు, పై నక్షత్రములవారు 29-10-2023 ఆదివారం
మినుములు 1.1/4 కేజి,
బియ్యం 1.1/4 కేజీ,
వెండినాగ పడగను,
వెండి చంద్రబింబమును,
పాలు,
తెల్లనివస్త్రం దానం ఇచ్చి గ్రహణ పరిహారం చేసుకోగలరని శాస్త్రవచనము.

రాత్రి 7 గంటలలోపు భోజనములు చేయవలెను, గ్రహణసమయంలో ఏమి తినరాదు.
గర్భవతులు రాత్రి 11.00 నుండి 4.00 వరకు కదలకుండా పడుకోవడం మంచిదని పండితులు చెబుతున్నారు …

శరత్కాల పూర్ణిమనాడు అమ్మవారిని పూజించడం చాలా విశేషం.
నవరాత్రులే కాక, పాడ్యమి నుండి పూర్ణిమ వరకు అమ్మవారి ఆరాధన వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది.
ఈ పూర్ణిమే శ్రీవిద్యా సంప్రదాయంలో ‘ముఖ్యరాకా’గా చెప్పబడింది.

ఆదికవియైన వాల్మీకిజయంతి కూడా అయినందువల్ల వాల్మీకి రామాయణ గ్రంథాన్ని పూజించడం, చదవడం
వల్ల ఋషిఋణం కొంతైనా తీర్చుకున్నట్లవుతుంది.

ఆశ్వయుజ పూర్ణిమ మహాశ్వినిగా శాస్త్రమందు చెప్పబడింది…

ఈ రోజున చేసే స్నాన, దాన, అర్చన, జపాదులన్నీ అనంతఫలితాలను కలిగిస్తాయి…

శ్రీమహాలక్ష్మి అనుగ్రహం కోసం కోజ గౌరీ వ్రతాన్ని ఆచరించాలన్న ” శ్రీ వాలిఖిల్వ మహర్షి ” తోటి మునులకు తెలియచేసినట్లు పురాణ కథనము.
ఉభయ సంధ్యాకాలములో
శ్రీ లక్ష్మీ దేవి ని పూజించి , క్షీరాన్నమును నైవేద్యంగా సమర్పించాలి.
రాత్రి జాగరణ చేస్తూ ఆ సమయంలో పాచికలు లేదా గవ్వలు ను ఆడుతూ గడపాలి…
మరునాడు పునః పూజ చేసి వ్రతాన్ని ముగించాలి, ఈ వ్రతము చేయడం వల్ల శ్రీ లక్ష్మీ దేవి అనుగ్రహానికి పాత్రులవుతారు.

*శ్రీ కోజగౌరీ లక్ష్మీ పూజ …!!*

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దుర్గాపూజ జరిగిన కొన్ని రోజుల తర్వాత లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేకంగా మరో పూజను చేస్తారు…

వివిధ మంత్రాలతో లక్ష్మీదేవికి పుష్పాంజలి ఘటిస్తూ,
కుటుంబ సమేతంగా
ఈ పూజను జనులందరూ జరుపుకొంటారు…

*_🥀శుభమస్తు🥀_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏