నేటి పంచాంగం… నేటి విశేషం..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🪻పంచాంగం🪻
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 06 – 11 – 2023,
వారం … ఇందువాసరే ( సోమవారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయనం – శరదృతువు,
ఆశ్వయుజ మాసం – బహళ పక్షం,

తిథి : నవమి తె5.18 వరకు,
నక్షత్రం : ఆశ్లేష మ2.09 వరకు,
యోగం : శుక్లం సా4.03 వరకు,
కరణం : తైతుల సా4.18 వరకు,
తదుపరి గరజి తె5.18 వరకు,

వర్జ్యం : తె3.27 – 5.13,
దుర్ముహూర్తము : మ12.06 – 12.51 &
మ2.22 – 3.07,
అమృతకాలం : మ12.23 – 2.09,
రాహుకాలం : ఉ7.30 – 9.00,
యమగండo : ఉ10.3012.00,
సూర్యరాశి : తుల,
చంద్రరాశి : కర్కాటకం,
సూర్యోదయం : 6.04,
సూర్యాస్తమయం: 5.24,

*_నేటి మాట_*

*విస్తరాకు…..మనిషి జీవితం*
*”విస్తరాకును”* ఎంతో శుభ్రంగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకుని *’భోజనానికి’* కూర్చుంటాము.

భోజనము తినేవరకు *”ఆకుకు మట్టి”* అంటకుండా జాగ్రత్త వహిస్తాము.

తిన్న మరుక్షణం *’ఆకును’ (విస్తరిని)* మడిచి *’దూరంగా’* పడేస్తాం…
*”మనిషి జీవితం”* కూడా అంతే ఊపిరి పోగానే *”ఊరి బయట”* పారేసి వస్తాము…

*’విస్తరాకు’* పారేసినప్పుడు సంతోషపడుతుంది.
ఎందుకంటే *’పొయేముందు ఒకరి ఆకలిని’* తీర్చటానికి తను ఉపయోగపడ్డానులే అన్న *’తృప్తి’* ఆకుకు ఉంటుంది.
*’సేవ’* చేసే అవకాశము వచ్చినపుడు మీరు అందరూ *’సేవ’* చేయండి.
మళ్లీ ఎప్పుడైనా చేయవచ్చులే అనుకొని *”వాయిదా”* వేయకండి.
ఆ అవకాశము మళ్లీ వస్తుందని అనుకుంటే *’కుండ’* ఎప్పుడైనా పగిలిపోవచ్చు. అప్పుడు *’విస్తరాకుకు’* ఉన్న *’తృప్తి’* కూడా మనకి ఉండదు..
ఎంత *’సంపాదించి’* ఏమి లాభం? *’ఒక్కపైసా’* కూడా తీసుకుపోగలమా? కనీసం *’మన ఒంటిమీద బట్ట’* కూడా మిగలనివ్వరు..
అందుకే *’ఊపిరి’* ఉన్నంత వరకు *”నలుగురికి”* ఉపయోగపడే విధంగా *’జీవించండి’*… *ఇదే జీవిత పరమార్ధం*

*_🪻శుభమస్తు🪻_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏