నేటి పంచాంగం… నేటి విశేషం..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌷పంచాంగం🌷
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 07 – 11 – 2023,
వారం … భౌమ వాసరే ( మంగళవారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయనం – శరదృతువు,
ఆశ్వయుజ మాసం – బహళ పక్షం,

తిథి : దశమి పూర్తి,
నక్షత్రం : మఖ సా4.44 వరకు,
యోగం : బ్రహ్మం సా4.35 వరకు,
కరణం : వణిజ సా6.23 వరకు,

వర్జ్యం : రా1.36 – 3.22,
దుర్ముహూర్తము : ఉ8.19 – 9.05 &
రా10.28 – 11.18,
అమృతకాలం : మ2.04 – 3.51,
రాహుకాలం : మ3.00 – 4.30,
యమగండo : ఉ9.00 – 10.30,
సూర్యరాశి : తుల,
చంద్రరాశి : కర్కాటకం,
సూర్యోదయం : 6.04,
సూర్యాస్తమయం: 5.24,

*_నేటి మాట_*

*దేవుడు అంటే ఎవరు ??? – ఆయన ఎలా వుంటాడు? – ఆయన ఏమి చేస్తాడు???*

సృష్టి ఎంత గొప్పది కదా?, అలానే దీనికి ఒక కర్త కూడా వుండాలి కదా, మరి ఆయన ఎవరు, ఏమి చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అని ఆలోచిస్తే మనకు అర్థం అవుతుంది…

1) ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి …
2) అందులో మనిషి ఒక ప్రాణి – ఎన్ని కోట్ల మంది మనుషులు ఉన్నారో ?
3) జీవరాశులు మొత్తం కలిపితే ఎన్ని లక్షల కోట్లు ప్రాణులు ఉన్నాయో ?

4) ఎన్ని లోకాలు ఉన్నాయో?
5) ఏ లోకంలో ఎవరు ఉండాలి?
6) ఎవరు ఎలా పుట్టాలి?
7) ఎవరు ఎన్ని జన్మలు ఎత్తాలి?
8) ఎవరు ఏ మొహంతో పుట్టాలి?
9) ఎవరు ఎవరికి కుటుంబ సభ్యులు అవ్వాలి?
10) ఎవరికి/ఎప్పుడు మోక్షం ఇవ్వాలి?

11) ఇన్ని ప్రాణుల జన్మలు / వారి కర్మలు /వారి పాప పుణ్యాలు – దేవుడు ఎలా లెక్క పెడుతున్నాడు?

12) ఎలా ఈ సృష్టి నడుస్తుంది?
13) ఎవరు ఏం చేసినా ఎలా తెలుసుకుంటున్నాడు?

14) అసలు దేవుడి శక్తి ఏమిటి?
15) అసలు ఇంత సృష్టి కార్యాన్ని దేవుడు ఎలా చేస్తున్నాడు?
ఇవన్నిoటికీ సమాధానం చెబితే , ( ఆలోచిస్తే ) దేవుడి గూర్చి కొంతైనా అవగాహన వస్తుంది … మూడు పూటలా తిని , అందరినీ విమర్శిస్తూ కూర్చుని మాట్లాడే వారికి దేవుడి గూర్చి ఏమి అర్ధం అవుతుంది …
చెవిటి వాడి ముందు శంఖం వూది నట్లు వుంటుంది…

*_🌷శుభమస్తు🌷_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏