నేటి పంచాంగం… నేటి విశేషం..

ఓం శ్రీ గురుభ్యోనమః
🍃పంచాంగం🍃
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 11 – 11 – 2023,
వారం … స్థిరవాసరే ( శనివారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయనం – శరదృతువు,
ఆశ్వయుజ మాసం – బహళ పక్షం,

తిథి : త్రయోదశి మ12.48 వరకు,
నక్షత్రం : చిత్ర రా1.42 వరకు
యోగం : ప్రీతి సా5.43 వరకు
కరణం : వణిజ మ12.48 వరకు,
తదుపరి భద్ర రా1.18వరకు,

వర్జ్యం : ఉ8.31 – 10.14,
దుర్ముహూర్తము : ఉ6.05 – 7.36,
అమృతకాలం : సా6.49 – 8.32,
రాహుకాలం : ఉ9.00 – 10.30,
యమగండo : మ1.30 – 3.00,
సూర్యరాశి : తుల,
చంద్రరాశి : కన్య,
సూర్యోదయం : 6.06,
సూర్యాస్తమయం: 5.22,

*_నేటి విశేషం_*

*ధన త్రయోదశి*
*మాస శివరాత్రి*
*శ్రీధన్వంతరి జయంతి*

దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలుకుతున్న సమయంలో ఆ పాలసముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మి జన్మించింది…
అంతే కాదు సంపదలను ప్రసాదించే కల్పవృక్షం, కామధేనువు, దేవవైద్యుడు ధన్వంతరి కూడా శ్రీ మహాలక్ష్మితో పాటే జన్మించారు.
ఆ రోజు ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి.
ఎంత చదువు చదివినా.,, ఎన్ని తెలివితేటలు ఉన్నా., శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లేకపోతే జీవితం శూన్యం.
అందుకే.. సర్వ సంపద ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం సర్వ మానవాళి ఈ రోజున శ్రీమహాలక్ష్మిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి, ఆమె ఆశీసులు అందుకుంటారు…

శ్రీమహాలక్ష్మి .., ధనానికి ప్రతిరూపం.
అందుకే., ఆమె జన్మదినమైన ఈ ఆశ్వయుజ కృష్ణ త్రయోదశిని..‘ధన త్రయోదశి’ అన్నారు.
ధనానికి అధిదేవత ‘శ్రీమహాలక్ష్మి, ధనానికి అధినాయకుడు ఉత్తర దిక్పాలకుడైన ‘కుబేరుడు’, అందుకే., ఈ ధనత్రయోదశి నాడు శ్రీమహాలక్ష్మితో పాటు కుబేరుని కూడా ఆరాధిస్తారు…

సాధారణంగా., ఈ లక్ష్మీ పూజను., సాయం సమయంలో ప్రదోష వేళలో వృషభ లగ్నంలో చేస్తారు, సూర్యాస్తమయం అయిన తర్వాత సుమారు 90 నిముషాలు ఈ ప్రదోషకాలం ఉంటుంది.
ఆశ్వయుజ మాసంలో వృషభలగ్నం రాత్రి సుమారు 7 గంటల నుంచి 9 గంటల వరకూ ఉంటుంది.

కనుక ఈ సమయంలో శ్రీమహాలక్ష్మి పూజను చేసుకుంటే చాలా మంచిదని , కొన్ని ప్రాంతాలలో శ్రీమహాలక్ష్మి, కుబేరులతో పాటు ధన్వంతరిని కూడా పూజిస్తారు.

*లక్ష్మీ కుబేర వ్రతం*

ధన త్రయోదశి సందర్భంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు , వ్యాపార అభివృద్ధి అదే విధంగా నూతన వ్యాపారం ప్రారంభించబోయే వారు , ఉద్యోగ అభివృద్ధి కోరుకుంటున్నారు మరియు అప్పుల బాధలు ఉన్నవారు తప్పకుండా చేయవలసిన లక్ష్మీ కుబేర వ్రత విధానం.
ఈ వ్రతమును అక్షయ తృతీయ రోజు , ధన త్రయోదశి రోజు , కార్తీక శుక్ల పంచమి రోజు లేదా తొమ్మిది గురువారాలు లేక శుక్రవారాలు చేసుకోవచ్చు.

*_🍃శుభమస్తు🍃_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏