నేటి పంచాంగం… నేటి విశేషం…

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
☘️పంచాంగం☘️
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 13 – 11 – 2023,
వారం … ఇందువాసరే ( సోమవారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయనం – శరదృతువు,
ఆశ్వయుజ మాసం – బహళ పక్షం,

తిథి : అమావాస్య మ2.19 వరకు,
నక్షత్రం : విశాఖ తె3.49 వరకు,
యోగం : సౌభాగ్యం సా4.30 వరకు,
కరణం : నాగవం మ2.19 వరకు,
తదుపరి కింస్తుఘ్నం రా2.16 వరకు,

వర్జ్యం : ఉ8.48 – 10.27,
దుర్ముహూర్తము : మ12.06 – 12.51 &
మ2.21 – 3.06,
అమృతకాలం : సా6.43 – 8.22,
రాహుకాలం : ఉ7.30 – 9.00,
యమగండo : ఉ10.30 – 12.00,
సూర్యరాశి : తుల,
చంద్రరాశి : తుల,
సూర్యోదయం : 6.07,
సూర్యాస్తమయం: 5.21,

*_నేటి విశేషం_*

*కేదారగౌరీ వ్రతము*
*ఆకాశదీప ప్రారంభము*
కేదారీశ్వర వ్రతం

వ్రతకల్పం

శ్రీ కేదారేశ్వర పూజ ప్రారంభం

ఆచమనం: ఓం కేశవాయ స్వాహాః, నారాయణాయ స్వాహాః, మాధవాయ స్వాహాః (అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని త్రాగవలెను)

గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్దాయ నమః
పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, ,నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీ కృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే

ఓం అపవిత్రః పవిత్రోవా సర్వా వస్థాం గతోపివా
యస్స్మరేత్పుండరీ కాక్షం సబాహ్యాభ్యంతరం శుచిః
శ్రీ గోవింద గోవింద

ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓంభూః ఓం భువః ఓగుం సువః, ఓం మహః ఓంజనః ఓంతపః ఓగుం సత్యం ఓంతత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఓమాపోజ్యో తీరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. ప్రాణాయామము చేసి దేశకాలములను స్మరించి సంకల్పం చేయవలెను. మమోపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర వుద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరత వర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన సంవత్సరము పేరు ………. సంవత్సరే, …….ఆయనే, ……. మాసే, …….పక్షే ,……తిది, ,,,,,,,,వాసరే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ, విశిష్టాయాం, శుభతిథౌ శ్రీమాన్ … గోత్రః …నామధేయః (ధర్మ పత్నీ సమేతః) మమ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం, సర్వాభీష్ట సిద్ధ్యర్థం, సిద్ది విణాయక ప్రీత్యర్థం ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే, తదంగ కలశారాధనం కరిష్యే.

కలసస్య ముఖే విష్ణుః కంటే రుద్రసమాశ్రితః, మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాత్రు గణాస్మృతః కుక్షౌత్సాగరాసర్వేసప్త ద్వీపా వసుంధర, ఋగ్వేదోద యజుర్వేద సామవేదో అధర్వనః అన్గైస్చ సాహితాసర్వే కలశాంబు సమాశ్రితః.

ఆకలశే
శ్లో: గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సొందు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు||
కావేరి తున్గాభాద్రాచ క్రుష్ణవేన్యాచ గౌతమీ|
భాగీరదీచ ప్రఖ్యాతాః పంచాగంగాః ప్రకీర్తితితః
ఆయాంటూ దేవపూజార్ధం మమ (యజమానస్య) దురితక్షయకారకాః కలశోధకేన పూజా ద్రవ్యాని సంప్రోక్షయః. (కలశాములోని నీళ్ళను పూజా ద్రవ్యములపైన, దేవునిపైన, తమ శిరస్సుపైన కొద్దిగా చల్లుకోవాలి)
అసునీతే
ద్యాయేద్గజాననం దేవం తప్తకాంచనసన్నిభం, చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం॥
శ్రీ మహా గణాధిపతయే నమః ధ్యాయామి
అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్బవ
శ్రీ మహా గణాధిపతయే నమః ఆవాహయామి
మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతి గృహ్యాతాం॥
శ్రీ మహా గణాధిపతయే నమః ఆసనం సమర్పయామి
గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుతం ॥
శ్రీ మహా గణాధిపతయే నమః ఆర్ఘ్యం సమర్పయామి
గజవక్త్ర నమస్తే~స్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన॥
శ్రీ మహా గణాధిపతయే నమః పాద్యం సమర్పయామి
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాణాచమనం దేవ, తుభ్యం దత్తంమయా ప్రభో ॥
ఆచమనీయం సమర్పయామి.
దధిక్షీర సమాయుక్తం థామద్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్రం నమోస్తుతే ॥
మధుపర్కం సమర్పయామి.
స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత ॥
పంచామృత స్నానం సమర్పయామి.
గంగాదిసర్వతీర్థేభ్యః ఆహృతైరమలిర్ణలైః స్నానం కురుష్వభగవానుమాపుత్ర నమోస్తుతే॥
శుద్దోదక స్నానం సమర్పయామి.
రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ ॥

వస్త్రయుగ్మం సమర్పయామి.
రాజితం బహ్మసూత్రం చ కాంచనం చో త్తరీయకం గృహాణ సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక॥
ఉపవీతం సమర్పయామి.
చంద నాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం॥
గంధాన్ సమర్పయామి.
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్, గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే॥
అక్షతాన్ సమర్పయామి.
సుగంధాని సుపుష్పాణి జాజీకుంద ముఖానిచ ఏక వింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే॥
పుష్పాణి పూజయామి.

*శ్రీ వినాయక అష్టోత్తర శత నామ పూజా*

ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః

ఓం వినాయకాయ నమః
ఓం ద్వైమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీప్తాయ నమః
ఓం సుఖనిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబజఠరాయ నమః
ఓం హయగ్రీవాయ నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః
ఓం విశ్వనేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం వాక్పతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం ఆశ్రితవత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బల్వాన్వితాయ నమః
ఓం బలోద్దతాయ నమః
ఓం భక్తనిధయే నమః
ఓం భావగమ్యాయ నమః
ఓం భావాత్మజాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకర ప్రభాయ నమః
ఓం సర్వాయ నమః
ఓం సర్వోపాస్యాయ నమః
ఓం సర్వకర్త్రే నమః
ఓం సర్వ నేత్రే నమః
ఓం నర్వసిద్దిప్రదాయ నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః
ఓం కుంజరాసురభంజనాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థఫలప్రియాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః
ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళసుస్వరాయ నమః
ఓం ప్రమదాయ నమః
ఓం జ్యాయసే నమః
ఓం యక్షికిన్నరసేవితాయ నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం గణాధీశాయ నమః
ఓం గంభీరనినదాయ నమః
ఓం వటవే నమః
ఓం జ్యోతిషే నమః
ఓం అక్రాంతపదచిత్ప్రభవే నమః
ఓం అభీష్టవరదాయ నమః
ఓం మంగళప్రదాయ నమః
ఓం అవ్యక్త రూపాయ నమః
ఓం పురాణపురుషాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం పుష్కరోత్ క్షిప్తహరణాయ నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అపాకృతపరాక్రమాయ నమః
ఓం సత్యధర్మిణే నమః
ఓం సఖ్యై నమః
ఓం సారాయ నమః
ఓం సరసాంబునిధయే నమః
ఓం మహేశాయ నమః
ఓం విశదాంగాయ నమః
ఓం మణికింకిణీ మేఖలాయ నమః
ఓం సమస్తదేవతామూర్తయే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
ఓం విష్ణువే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం భక్తజీవితాయ నమః
ఓం ఐశ్వర్యకారణాయ నమః
ఓం సతతోత్థితాయ నమః
ఓం విష్వగ్దృశేనమః
ఓం విశ్వరక్షావిధానకృతే నమః
ఓం కళ్యాణగురవే నమః
ఓం ఉన్మత్తవేషాయ నమః
ఓం పరజయినే నమః
ఓం సమస్త జగదాధారాయ నమః
ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః
దశాంగం గుగ్గలోపేతం సుగంధం, సుమనోహరం, ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ॥
ధూపమాఘ్రాపయామి॥
సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినాద్యోజితం మయా, గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే

దీపందర్శయామి।
సుగంధాసుకృతాంశ్చైవమోదకాన్ ఘృతపాచితాన్, నైవేద్యం గృహ్యతాంచణముద్దేః ప్రకల్పితాన్,

భక్ష్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ, ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక,

నైవేద్యం సమర్పయామి।
సచ్చిదానంద విఘ్నేశ పుష్కరానిధనానిచ, భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక సువర్ణపుష్పం సమర్పయామి.
పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం, కర్పూర చూర్ణసంయుక్తం తాబూలం ప్రతిగృహ్యతాం
తాంబూలం సమర్పయామి।
ఘృతవర్తి సహస్రైశ్చ శకలైస్థితం నీరాజనం మయాదత్తం గృహాణవరదోభవ

నీరాజనం సమర్పయామి।

*శ్రీకేదారేశ్వర పూజ:*

శూలం ఢమరుకంచైవ – దదానం హస్త యుగ్మకే
కేదారదేవ మీశానం ధ్యాయేత్ త్రిపుర ఘాతినమ్,, శ్రీ కేదారేశ్వరాయనమః ధ్యానం సమర్పయామి

కైలాస శిఖరే రమ్యే పార్వత్యా స్సహితప్రభో
ఆగచ్చ దేవదేవేశ మద్భక్త్యా చంద్రశేఖర శ్రీ కేదారేశ్వరాయనమః ఆవాహయామి

సురాసుర శిరోరత్న – ప్రదీపిత పదాంబుజ
కేదారదేవ మద్దత్త మాసనం ప్రతిగుహ్యతామ్ శ్రీ కేదారేశ్వరాయనమః ఆసనం సమర్పయామి

గంగాధర నమస్తేస్తు – త్రిలోచన వృషభద్వజ
మౌక్తికాసన సంస్థాయ – కేదారాయ నమోనమః శ్రీ కేదారేశ్వరాయనమః పాద్యం సమర్పయామి

అర్ఘ్యం గృహాణ భగవన్ – భక్త్యాదత్తం మహేశ్వర
ప్రయచ్ఛమే మనస్తుభ్యం – భక్తానా మిష్టదాయకం శ్రీ కేదారేశ్వరాయనమః ఆర్ఘ్యం సమర్పయామి

మునిభిర్నా రదప్రఖ్యైర్నిత్య మాఖ్యాత వైభవః
కేదారదేవ భగవాన్ గృహాణా చమనం విభో శ్రీ కేదారేశ్వరాయనమః ఆచమనీయం సమర్పయామి

స్నానం పంచామృతైర్ధేవ శుద్ధ శుద్ధోద కైరపి
గృహాణగౌరీరమణత్వద్బక్తేన మయార్పితం శ్రీ కేదారేశ్వరాయనమః పంచామృతస్నానం సమర్పయామి

నదీజల సమాయుక్తం మయాదత్త మనుత్తమం
స్నానం స్వీకురుదేవేశ – సదాశివ నమోస్తుతే శ్రీ కేదారేశ్వరాయనమః స్నానం సమర్పయామి

వస్త్ర యుగ్మం సదాశుభ్రం – మనోహర మిదం శుభం
దదామి దేవదేవేశ భక్త్యేదం ప్రతిగృహ్యాతాం శ్రీ కేదారేశ్వరాయనమః వస్త్రయుగ్మం సమర్పయామి

స్వర్ణ యజ్ఞోపవీతం కాంచనం చోత్తరీయకం
రుద్రాక్షమాలయా యుక్తం – దదామి స్వీకురు ప్రభో శ్రీ కేదారేశ్వరాయనమః యఙ్ఞోపవీతం సమర్పయామి

సమస్త గ్రంధద్రవ్యాణాం – దేవత్వమసి జన్మభూః
భక్త్యాసమర్పితం ప్రీత్యా – మయాగంధాది గృహ్యతామ్ శ్రీ కేదారేశ్వరాయనమః గంధాన్ ధారయామి

అక్షతో సి స్వభావేన – భక్తానామక్షయం పదం
దదాసినాథ మద్దతైరక్షతైః స్స్వీయతాం భవాన్ శ్రీ కేదారేశ్వరాయ అక్షతాన్ సమర్పయామి

కల్పవృక్ష ప్రసూవైస్వం పూర్వై రభ్యర్చిత సురైః కుంకుమైః పార్దివై రేభిరిదానీమర్చతాం మయా శ్రీ కేదారేశ్వరాయనమః పుష్పాణి పూజయామి తతః ఇంద్రాది లోకపాలక
పూజాం కుర్యాత్ శివస్య దక్షిణేభాగే{కుడివైపు} బ్రహ్మణేనమః ఉత్తరభాగే {ఎడమవైపు} విష్ణవేనమః మధ్యే కేదారేశ్వరాయ నమః

*అథాంగ పూజ:*

మహేశ్వరాయనమః పాదౌ పూజయామి,
ఈశ్వరాయనమః జంఘేపూజయామి,
కామరూపాయనమః జానునీ పూజయామి,
హరాయనమః ఊరూ పూజయామి,
త్రిపురాంతకాయనమః గూహ్యం పూజయామి,
భవాయనమః కటిం పూజయామి,
గంగాధరయనమః నాభిం పూజయామి,
మహాదేవాయనమః ఉదరం పూజయామి,
ప్శుపతయేనమః హృదయం పూజయామి,
పినాకినేనమః హస్తాన్ పూజయామి,
శివాయనమః భుజౌ పూజయమి,
శితికంఠాయనమః కంఠం పూజయామి,
విరూపాక్షాయనమః ముఖం పూజయామి,
త్రినేత్రాయనమః నేత్రాణి పూజయామి,
రుద్రాయనమః లలాటం పూజయామి,
శర్వాయనమః శిరః పూజయామి,
చంద్రమౌళయేనమః మౌళిం పూజయామి,
పశుపతయేనమః సర్వాణ్యాంగాని పూజయామి

*కేదారేశ్వర అష్టోత్తర శతనామ పూజ*

1.ఓంశివాయనమః 55.ఓంవీరభద్రాయనమః
2.ఓంమహేశ్వరాయనమః 56.ఓంగణనాథాయనమః
3.ఓంశంభవేనమః 57.ఓంప్రజాపతయేనమః
4.ఓంపినాకినేనమః 58.ఓంహిరణ్యరేతసేనమః
5.ఓంశశిశేఖరాయనమః 59.ఓందుర్ధర్షాయనమః
6.ఓంవామదేవాయనమః 60.ఓంగిరీశాయనమః
7.ఓంవిరూపాక్షాయనమః 61.ఓంగిరిశాయనమః
8.ఓంకపర్దినేనమః 62.ఓంఅనఘాయనమః
9.ఓంనీలలోహితాయనమః 63.ఓంభుజంగభూషణాయనమః
10.ఓంశంకరాయనమః 64.ఓంభర్గాయనమః
11.ఓంశూలపాణయేనమః 65.ఓంగిరిధన్వినేనమః
12.ఓంఖట్వాంగినేనమః 66.ఓంగిరిప్రియాయనమః
13.ఓంవిష్ణువల్లభాయనమః 67.ఓంకృత్తివాసనేనమః
14.ఓంశిపివిష్టాయనమః 68.ఓంపురారాతయేనమః
15.ఓంఅంబికానాథాయనమః 69.ఓంభగవతేనమః
16.ఓంశ్రీకంఠాయనమః 70.ఓంప్రమధాధిపాయనమః
17.ఓంభక్తవత్సలాయనమః 71.ఓంమృత్యుంజయాయనమః
18.ఓంభవాయనమః 72.ఓంసూక్ష్మతనవేనమః
19.ఓంశర్వాయనమః 73.ఓంజగద్వ్యాపినేనమః
20.ఓంత్రిలోకేశాయనమః 74.ఓంజగద్గురవేనమః
21.ఓంశితికంఠాయనమః 75.ఓంవ్యోమకేశాయనమః
22.ఓంశివాప్రియాయనమః 76.ఓంమహాసేనజనకాయనమః
23.ఓంఉగ్రాయనమః 77.ఓంచారువిక్రమాయనమః
24.ఓంకపాలినేనమః 78.ఓంరుద్రాయనమః
25.ఓంకామారయేనమః 79.ఓంభూతపతయేనమః
26.ఓంఅంధకాసురసూదనాయనమః 80.ఓంస్థాణవేనమః
27.ఓంగంగాధరాయనమః 81.ఓంఅహిర్బుధ్న్యాయనమః
28.ఓంలలాటాక్షాయనమః
82.ఓందిగంబరాయనమః
29.ఓంకాలకాలాయనమః 83.ఓంఅష్టమూర్తయేనమః
30.ఓంకృపానిధయేనమః 84.ఓంఅనేకాత్మానే నమః
31.ఓంభీమాయనమః 85.ఓంసాత్త్వికాయనమః
32.ఓంపరశుహస్తాయనమః 86.ఓంశుద్ధవిగ్రహాయనమః
33.ఓంమృగపాణయేనమః 87.ఓంశాశ్వతాయనమః
34.ఓంజటాధరాయనమః 88.ఓంఖండపరశవేనమః
35.ఓంకైలాసవాసినేనమః 89.ఓంఅజాయనమః
36.ఓంకవచినేనమః 90.ఓంపాశవిమోచకాయనమః
37.ఓంకఠోరాయనమః 91.ఓంమృడాయనమః
38.ఓంత్రిపురాంతకాయనమః 92.ఓంపశుపతయేనమః
39.ఓంవృషాంకాయనమః 93.ఓందేవాయనమః
40.ఓంవృషభారూఢాయనమః 94.ఓంమహాదేవాయనమః
41.ఓంభస్మోద్ధూళితవిగ్రహాయనమః 95.ఓంఅవ్యయాయనమః
42.ఓంసామప్రియాయనమః 96.ఓంహరయేనమః
43.ఓంసర్వమయాయనమః 97.ఓంపూషదంతభిదేనమః
44.ఓంత్రయీమూర్తయేనమః 98.ఓంఅవ్యగ్రాయనమః
45.ఓంఅనీశ్వరాయనమః 99.ఓందక్షాధ్వరహరాయనమః
46.ఓంసర్వజ్ఞాయనమః 100.ఓంహరాయనమః
47.ఓంపరమాత్మనేనమః 101.ఓంభగనేత్రభిదేనమః
48.ఓంసోమసూర్యాగ్నిలోచనాయనమః 102.ఓంఅవ్యక్తాయనమః
49.ఓంహవిషేనమః 103.ఓంసహస్రాక్షాయనమః
50.ఓంయజ్ఞమయాయనమః 104.ఓంసహస్రపాదేనమః
51.ఓంసోమాయనమః 105.ఓంఅపవర్గప్రదాయనమః
52.ఓంపంచవక్త్రాయనమః 106.ఓంఅనంతాయనమః
53.ఓంసదాశివాయనమః 108.ఓంపరమేశ్వరాయనమః
శ్రీ కేదారేశ్వర స్వామినేనమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాం సమర్పయామి

అధసూత్రపూజ:
ఓం శివాయనమః ప్రధమగ్రంధిం పూజయామి
ఓం శాంతాయనమః ద్వితీయగ్రంధిం పూజయామి
ఓం మహాదేవాయనమః తృతీయగ్రంధిం పూజయామి
ఓం వృషభద్వజాయనమః చతుర్ధగ్రంధిం పూజయామి
ఓం గౌరీశాయనమః పంచమగ్రంధిం పూజయామి
ఓం రుద్రాయనమః షష్ఠగ్రంధిం పూజయామి
ఓం పశుపతయేనమః సప్తమగ్రంధిం పూజయామి
ఓం భీమాయనమః అష్టమగ్రంధిం పూజయామి
ఓం త్రయంబకాయనమః నవమగ్రంధిం పూజయామి
ఓం నీలలోహితాయనమః దశమగ్రంధిం పూజయామి
ఓం హరాయనమః ఏకాదశగ్రంధిం పూజయామి
ఓం స్మరహరాయనమః ద్వాదశగ్రంధిం పూజయామి
ఓం భర్గాయనమః త్రయోదశగ్రంధిం పూజయామి
ఓం శంభవేనమః చతుర్ధశగ్రంధిం పూజయామి
ఓం శర్వాయనమః పంచదశగ్రంధిం పూజయామి
ఓం సదాశివాయనమః షోఢశగ్రంధిం పూజయామి
ఓం ఈశ్వరాయనమః సప్తదశగ్రంధిం పూజయామి
ఓం ఉగ్రాయనమః అష్టాదశగ్రంధిం పూజయామి
ఓం శ్రీకంఠాయనమః ఏకోన వింశతిగ్రంధిం పూజయామి
ఓం నీలకంఠాయనమః వింశతిగ్రంధిం పూజయామి
ఓం మృత్యుంజయాయనమః ఏకవింశతి గ్రంధిం పూజయామి

దశాంగం ధూపముఖ్యంచ -హ్యంగార వినివేశితం
ధూపం సుగంధై రుత్పన్నం – త్వాంప్రీణయతుశంఖరశ్రీ కేదారేశ్వరాయనమః ధూపమాఘ్రాపయామి

యోగీనాం హృదయే ష్వేవ – ఙ్ఞానదీపాంకురోహ్యపి
బాహ్యదీపో మయాదత్తో – గృహ్యతాం భక్త గౌరవాత్ శ్రీకేదారేశ్వరాయనమః దీపం సమర్పయామి

తైలోక్యమసి నైవేద్యం – తత్తే తృప్తిస్తథాబహిః
నైవేద్యం భక్తవాత్వల్యాద్గృహ్యతాం త్ర్యంబకత్వయా శ్రీ కేదారేశ్వరాయనమః మహానైవేద్యం సమర్పయామి

నిత్యానంద స్వరూపస్త్యం – మోగిహృత్కమలేస్థితః
గౌరీశభక్త్యామద్దత్తం – తాంబూలం ప్రతిగృహ్యతామ్ శ్రీకేదారేశ్వరాయనమః తాంబూలం సమర్పయామి

అర్ఘ్యం గృహాణ్ భగవాన్ – భక్త్యాదత్త మహేశ్వర
ప్రయచ్చ మే మనస్తుభ్యం – భక్త్యాన మిష్టదాయక శ్రీకేదారేశ్వరాయనమః అర్ఘ్యం సమర్పయామి

దేవేశ చంద్ర సంకాశం – జ్యోతి సూర్యమివోదితం
భక్త్యాదాస్యామి కర్పూర నీరాజన మిదం శివః శ్రీకేదారేశ్వరాయనమః కర్పూర నీరాజన దర్సయామి

ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్
నమో హిరణ్యబాహవే హిరణ్య వర్ణాయ హిరణ్య రూపాయ హిరణ్య పతయే శ్రీ కేదారేశ్వరాయనమః వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి

భూతేన భువనాదీశ – సర్వదేవాది పూజిత
ప్రదక్షిణం కరోమిత్యాం – వ్రతం మే సఫలం కురు శ్రీ కేదారేశ్వరాయనమః ప్రదక్షిణం సమర్పయామి

హరశంభో మహాదేవ – విశ్వేశామరవల్లభ
శివశంకర సర్వాత్మా – నీలకంఠ నమోస్తుతే శ్రీకేదారేశ్వరాయనమః నమస్కారాన్ సమర్పయామి

ఛత్రమాచ్ఛాదయామి, చామరేణ విజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆందోళికం నారోహయామి,
సమస్తరాజోపచార,దేవోపచార,శక్త్యుపచార,భక్త్యుపచార,పూజాం సమర్పయామి

అభీష్టసిద్దిం కురమే శివావ్యయ మహేశ్వర ! భక్తానాం మిష్టదానార్ధం మూర్తీకృతకళేభరః
(పూజా తోరము తీసుకొనునపుడు పఠించు మంత్రం)

కేదారదేవదేవేశ భగవన్నంభికా పతే! ఏకవింశద్దినే తస్మిన్ సూత్రం గృహ్లామ్యహం ప్రభో!!
(తొరము కట్టుకొనుటకు పఠించు మంత్రం)
ఆయుశ్చ విద్యాం చ తథా సిఖంచ సౌభాగ్యవృద్దిం కుర దేవ దేవ
సంసార ఘోరంబు నిధౌ నిమగ్నం మాంరక్ష కేదార నమో నమస్తే
(వాయనమిచ్చునపుడు పఠించునది)

కేదారం ప్రతి గృహ్ణాతు కేదారో వైదరాతి చ కేదారస్తారకో భాభ్యాం కేదారాయ నమో నమః
ప్రతిమాదాన మంత్రం

కేదార ప్రతిమాం యస్మాద్రాజ్యం సౌభాగ్యవర్ధినీ తస్మాదస్యాః ప్రదనేన మమాస్తు శ్రీ రచంచలా!!
శ్రీ కేదారేశ్వర స్వామినే నమః సిప్రీతః సుప్రసన్నోవరదోభవతు మమ ఇష్టకామ్యార్ధ సిద్దిరస్తు

*పూజా విధానము సంపూర్ణము*

*శ్రీ కేదారేశ్వర వ్రత కథ*

పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందు నిమిత్తము చేసిన వ్రతమగు కేదారేశ్వరుని వ్రతముని గూర్చి చెబుతాను. శ్రద్ధతో వినవలసిందని సూతుడు
శౌనకాదులకు చెప్పెను. శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చునియుండెను. సిద్ధ-సాధ్య- కింపురుష-యక్ష-గంధర్వులు శివుని
సేవించుచుండిరి. దేవముని గణములు శివుని స్తుతించుచుండిరి. ఋషులు-మునులు-అగ్ని-
-వాయువు-వరుణుడు-సూర్యచంద్రులు-తారలు-గ్రహాలు-ప్రమదగణాలు-కుమారస్వామి-వినాయకుడు-వీరభద్రుడు-నందీశ్వరుడు సభయందు ఉపవిష్ణులై ఉన్నారు. నారద
తుంబురాదులు శివలీలను గానం చేస్తున్నారు. రసాల-సాల-తమలా-వకుళ-నరికేళ-చందన-పనస-జంభూ వృక్షములతోను చంపక-పున్నాగ-పారిజాతాది పుష్పాదులతోను
మణిమయ మకుట కాంతులతో చెలువొందు నదీ నదపరతములతోను చతుర్ధశభువనాలు పులకిస్తున్నాయి.. అట్టి ఆనందకోలాహలములలో భృంగురిటి అనబడు శివభక్త
శ్రేష్టుడు ఆనందపులకితుడై నాట్యమాడసాగెను. అతడు వినోద సంభరితములగు నాట్యగతులతో సభాసదులను, శివుడ్ని మెప్పించుచుండెను. శివుడాతనిని అభినందించి
అంకతలమునగల పార్వతిని వీడి సింహాసనమునుండి లేచి భృంగురిటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదనునందు భృంగి మొదలగాగల వంది
మాగాదులు శివునకు ప్రదక్షిణంచేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతీ భర్తను చేరి నాథా! నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించిరి. ఆటపాటలతో
మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరు పరచి ఇట్లేల చేసితిరని ప్రశ్నించెను. అంత సదాశివుడు సతీమణి పార్వతిని సందిటకు తీసుకొని దేవీ! పరమార్ధ విదులగు
యోగులు నీవలన ప్రయోజనం కలుగచేయబడవని నిన్నిట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబిచ్చాడు. సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినైయుండి
యాదండప్రణామములకు నోచుకొని అయోగ్యురాలనని కోపగించి ఈశ్వరునితో సమానమగు యోగ్యతను ఆర్జించుకొనుటకై తపస్సునొనర్చుటకై నిశ్చయించుకొన్నది.
కైలాసమునువదలి శరభ శార్దూల గజములుగల నాగ గరుడ చకవాక పక్షసముదాయంతో నానావిధ ఫలపుష్ప తరులతాదులతో కూడుకొనిన్న సస్యశ్యామలమైనట్టి
గౌతమాశ్రమానికి వచ్చింది. ఆశ్రమవాసులామెను చూచి అతిధి మర్యాదలొనర్చి తల్లీ నీవెవ్వరవు ఎవరిదానవు ఎచటనుండి వచ్చితివి నీరాకకు గల అగత్యమేమిటని
పార్వతిని ప్రశ్నించారు.
వారి ప్రశ్నలకు పార్వాతి మిక్కిలి ఆనందించినదై యఙ్ఞయాగాది క్రతువులచే పునీతమై గౌతమముని ఆశ్రమమున నియమనిష్టాగరిష్టులై అలరారు పుణ్యపురుషులారా
పవిత్రాంగనలారా నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని. శివునిసతిగా నా నాధునితో సమానమగు యోగ్యతను పొందగోరి తపస్సొనర్చ
సంకల్పించుకొన్నాను. ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చినదానను అన్నది పార్వతి. మహర్షులారా! జగత్కళ్యాణాభిలాషులారా! నేను ఆశించిన ఫలమును పొంది
శివుని అర్ధాంగినై తరించుటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించుడని పార్వతి వారిని కోరుకున్నది. అందుకు గౌతముడు పార్వతీ ఈప్సితార్ధదాయకమగు ఉత్తమ
వ్రతమొకటున్నది. అది కేదారేశ్వర వ్రతము. నీవావ్రతమును ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసిందన్నాడు గౌతముడు.
వ్రతవిధానమును వివరించమని పార్వతి గౌతముడ్ని కోరింది. జగజ్జననీ ఈ వ్రతాన్ని భాద్రపదమాసంలో శుక్ల అష్టమియందు ఆచరించాలి. ఆరోజున శుచిగా స్నానాదులు
ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములగు ఏకవింశతి దారముతో చేతికి తోరముని ధరించి షోడశోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున
ఉపవాసముండవలెను. మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తరువాత ఆహారమును తీసుకోవలెను. ఇలా వ్రతమును ఆరంభించిన నాటినుండి అమావాస్య వరకు
పూజాక్రమముతో కేదారేశ్వరుని ఆరాధించవలెను. మరియు ధాన్యరాశినిపోసి అందు పూర్ణకుంభమునుంచి ఇరువదియొక్క పర్యాయములు సూత్రమును చుట్టి
పట్టువస్త్రముతో దానిని కప్పియుంచి నవరత్నములు గాని సువర్ణమునుగాని ఉంచి గంధ పుష్పాక్షలతో పూజించాలి.

దేవీ ఇరవై ఒక్కమంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చండబెట్టి యధావిధిగా ధూప దీప గంధ పుష్పాక్షతలతో పూజించి భక్ష్య-భోజ్య, నైవేద్యాదులు
కదళీప్జలాలు పనసలు ఆరగింపచేసి తాంబూలదక్షిణలిచ్చి వారలను తృప్తి పరచవలెను. ఈ తీరున వ్రతమాచరించినవారిని శివుడు అనుగ్రహించి మనోభీష్టసిద్ధిని
కలుగచేయునని గౌతముడు పార్వతికి వివరించాడు.

గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టాంతరంగుడై ఆమె అభీష్టానుసారం
తనమేనులో సగభాగము పార్వతికి అనుగ్రహించెను. అంత జగదాంబ సంతుష్టాంతరంగయై భర్తతో నిజనివాసము కైలాసమున కోరెను.

కొంతకాలమునకు శిభక్తపరాయుణడగు చిత్రాంగదుడను గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వరవ్రతమును దాని మహత్తును విన్నవాడై మనుష్యలోకమునకు దానిని
వెల్లడిచేయగోరి దివినుండి భువికేతించి ఉజ్జయినీ నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతునకు కేదారవ్రత విధానాన్ని వివరించాడు. వజ్రదంతు ఆ
వ్రతమును ఆచరించి శివానుగ్రహముతో సార్వభౌముడయ్యాడు.
ఆతదనంతరం ఉజ్జయినీ నగరంలో గల వైశ్యునకు పుణ్యవతి, భాగ్యవతి యను ఇరువురు కుమార్తెలు గలరు. వారు ఒకనాడు తండ్రిని చేరి జనకా మాకు కేదార వ్రతము
చేయుటకు అనుఙ్ఞనిమ్మని అడిగారు. అందుకాతడు బిడ్డలారా! నేను దరిద్రుడను. సామాగ్రులను సమకూర్చగలపాటివాడను కాను. మీరా ఆలోచనను
మానుకోండనిపలికెను. అందుకా వైశ్యపుత్రికలు నీ ఆఙ్ఞయే మాకు ధనము అనుఙ్ఞనియ్యవలసినదని కోరుకున్నారు.

వారిరువురు ఒక వటవృక్షంక్రింద కూర్చుని తోరముకట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు. మహేశ్వరుడు వారలకు పూజాసామాగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పోక్తముగా
వ్రతమాచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు, సుందర రూపములను ప్రసాదించి అంతర్హితుడయ్యాడు.

ఆ వైశ్య పుత్రికలకు యుక్తవయసు వచ్చింది. సౌందర్యసోయగం కలిగిన ఆ వైశ్య పుత్రికలో పెద్దామె పుణ్యవతిని ఉజ్జయినీ నగర మహారాజు, చిన్నామె భాగ్యవతిని
చోళభూపాలుడు వివాహం చేసుకున్నారు. వారి తండ్రియగు వైశ్యుడు ధనదాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు. మరికొంతకాలానికి
చిన్నకుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మధోన్మతురాలై కేదారవ్రతాన్ని మరచిపోయింది. అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురైంది, ఆమె భర్త
ఆమెను, కుమారుడ్ని రాజ్యము నుండి వెడలగొట్టివేసాడు. ఆమె పడరాని పాట్లు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది.

ఒకనాడు ఆమె తన కుమారుడ్ని చేరబలిచి నాయనా నీ పెద్దతల్లి ఉజ్జయినీపురం మహారాణి ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయమర్జించి తీసుకొని
రావలసిందని చెప్పిపంపించింది. అతడు ఉజ్జయినీకి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు. ఆమె కొంత ధనమిచ్చి కుమారుడ్ని సాగనంపింది. అతడు తిరిగివస్తుండగా
మార్గమధ్యమందు మహేశ్వరుడు చోరుని రూపంలో వానిని అడ్డగించి అతని వద్దగల ధనాన్ని కొల్లగొట్టాడు. అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరల పెద్దతల్లి వద్దకు
వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు. ఆమె మరలా కొంత దనాన్నిచ్చి పంపింది. ఈ పర్యాయము కూడా మార్గమధ్యమందు చోరురూపుడైన శివుడాసొమ్మును
తీసుకొనిపోయాడు. మరల అతడు పెద్దతల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు ఓయి! నీవు ఎన్నిసార్లు నీపెద్దతల్లి నడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి
కేదారవ్రతమును మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్దతల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను
తెలియచెప్పాడు.

అప్పుడామె బాగా ఆలోచించి అతని చేత కేదారవ్రతం చేయించి డబ్బిచ్చి పంపింది. తల్లితో కేదార వ్రతం చేయవలసినదిగా చెప్పమన్నది. అతడాప్రకారం తల్లి వద్దకు వెళ్ళి
పెద్దతల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి వ్రతం చేయవలసినదని పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు. గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదారవ్రతాన్ని చేసింది. ఆమె భర్త
మందీమార్భలముతో వచ్చి ఆమెను, కుమారుడ్ని రాజధానికి తీసుకొని వెళ్ళాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదారవ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో
సౌభాగ్యసంపదలతో జీవిస్తున్నది.

ఎవరు ఈ కేదారేశ్వర వ్రతమును నియమనిష్టలతో కల్పోక్తముగా చేయుదురో అట్టివారు ఎట్టి కష్టములు లేని వారై సుఖముగా జీవించి అంత్యమున శివసాన్నిధ్యము పొందుదురుగాక🙏🙏🙏

*_☘శుభమస్తు☘_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏