నేటి పంచాంగం.. నేటి విశేషం..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🍁పంచాంగం🍁
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 28 – 12 – 2023,
వారం … బృహస్పతి వాసరే ( గురువారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయనం – హేమంత ఋతువు,
మార్గశిర మాసం – బహళ పక్షం,

తిథి : విదియ పూర్తి,
నక్షత్రం : పునర్వసు రా12.39 వరకు,
యోగం : ఐంద్రం రా2.32 వరకు,
కరణం : తైతుల సా6.15 వరకు,

వర్జ్యం : ఉ11.56 – 1.37,
దుర్ముహూర్తము : ఉ10.11 – 10.55 &
మ2.34 – 3.18,
అమృతకాలం : రా10.06 – 11.48,
రాహుకాలం : మ1.30 – 3.00,
యమగండo : ఉ6.00 – 7.30,
సూర్యరాశి : ధనుస్సు,
చంద్రరాశి : మిథునం,
సూర్యోదయం : 6.33,
సూర్యాస్తమయం: 5.30,

*_నేటి మాట_*

*లోకులు పలు కాకులు*
ఈరోజు చాలా మంది, భక్తులుగా వున్నా ఏదో తెలియని అసంతృప్తి,
మనతో తిరిగే వారో లేక మనల్ని గమనించే వారు, ఏదో అన్నారని, వారు సంతృప్తి చెందలేదని, గుబులు చెందుతుంటారు, కానీ భగవంతుని అనుగ్రహము కోసం ఈ వ్రతం నోమాము, ఆయన దయ వుంటే చాలు అనుకునే వారు చాలా అరుదు…
ఆడంబర భక్తి మితిమీరి పోతున్న రోజులు ఇవి…
మరి మన పూజలు ,వ్రతాలు, నోములు ఎవరికి నచ్చాలి ???

ఒకచిన్న సంఘటన ద్వారా పరీక్షిద్దాం!!!…

ఒకసారి ఒక వ్యక్తి రావిచెట్టు కింద ఒక వ్యక్తి పడుకొని ఉన్నాడు!!…

*ఒక తాగుబోతు వాడు అటు వచ్చాడు – ఇతనెవడో బాగా తాగి ఇలా పడుకున్నాడు అని అన్నాడు.*

*ఒక కూలి వచ్చాడు – ఎంత కష్టపడ్డాడో ఇక్కడ ఇలా సేద తీరుతున్నాడు అని అన్నాడు.*

*ఒక రోగి వచ్చాడు – ఎంతటి అనారోగ్యమో ఏంటో ఇలా పడుకున్నాడు అని జాలి చూపాడు.*

వారు ఎటువంటి వారో అలాగే వారి అలోచన ఉంటుంది, వారి మాటలు ముఖ్యం కాదు కాబట్టి నువ్వు ఎప్పుడూ నీలా ఉండు చాలు… లోకులు పలు కాకులు… వారిని అనుసరిస్తే భగవంతుణ్ణి చేరడం కష్టం…
*నువ్వు జనాలకు నచ్చడం కాదు – జనార్దనుడికి నచ్చాలి … అదే జీవిత పరమార్థం…*

*_🍁శుభమస్తు🍁_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏