నేటి పంచాంగం.. నేటి విశేషం…

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌹పంచాంగం🌹
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 29 – 12 – 2023,
వారం … భృగువాసరే ( శుక్రవారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయనం – హేమంత ఋతువు,
మార్గశిర మాసం – బహళ పక్షం,

తిథి : విదియ ఉ6.45 వరకు,
నక్షత్రం : పుష్యమి రా2.32 వరకు,
యోగం : వైధృతి రా2.28 వరకు,
కరణం : గరజి సా6.45 వరకు,
తదుపరి వణిజ రా7.30 వరకు,

వర్జ్యం : ఉ8.53 – 10.32,
దుర్ముహూర్తము : ఉ8.45 – 9.29 &
మ12.24 – 1.08,
అమృతకాలం : రా7.37 – 9.21,
రాహుకాలం : ఉ10.30 – 12.00,
యమగండo : మ3.00 – 4.30,
సూర్యరాశి : ధనుస్సు,
చంద్రరాశి : కర్కాటకం,
సూర్యోదయం : 6.34,
సూర్యాస్తమయం: 5.31,

*_నేటి మాట_*

*సత్పురుషుల సహవాసం – ఆది శంకరుల బోధ🙏*

నువ్వు ఎల్లప్పుడూ కూడా సత్పురుషుల సహవాసంలో ఉండు అన్నారు భగవత్పాదులు.
ఎవరైతే ఎదుటివారి మంచిని కోరతారో, స్వప్నంలో కూడా ఎదుటి వారికి చెడు తలపెట్టరో, ఎదుటి వానిలో మంచిని మాత్రమె చూస్తారో వారే సత్పురుషులు…

“నేయం సజ్జన సంగే చిత్తం” అన్నారు భగవత్పాదులు.
“గేయం గీతా నామ సహస్రం” భగవంతుని నామాన్ని జపించు.
ఆయన ముఖారవిందం నుంచి వెలువడిన భగవద్గీతను పారాయణ చేయి.
మన జీవితంలో సమయం అమూల్యమైనది, సమయం పొతే తిరిగిరాదు.
సమయాన్ని వ్యర్ధం చేయకు, మానవ జన్మ అపురూపమైనది, ధర్మానుష్టానానికి అనువైన జన్మ.
దీనిని వ్యర్ధ పరచుకోకు అన్నారు భగవత్పాదులు…

వాక్కు భగవన్నామోచ్చారణకు ఉపయోగించు, నీకున్న సకల ఇంద్రియములను భగవత్సేవలో వినియోగించు, ఇహంలోనూ పరంలోనూ సుఖపడతావు.

“ఆత్మైవహ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః” నీ మిత్రుడవైనా శత్రువువైనా నీవే. సన్మార్గములో వెళ్లావు అంటే నీకు నీవు మిత్రుడివి…
తప్పుదారిలో వెళ్ళావంటే నీకు నీవు శత్రువువి.
కాబట్టి ఎప్పుడూ నీకు నీవు శత్రువువి కావద్దు.
నీకు నీవు మిత్రుడివికా!!, సరియైన దారిలో వెళ్ళావంటే ఎన్నటికీ చ్యుతి అనేది రాదు.
ఇహంలోనూ పరంలోనూ సుఖం లభిస్తుంది.
ఎప్పుడు తప్పటడుగులు వేశామో సకల అనర్ధాలు కలుగుతాయి.
తప్పుదారి అంటే అధర్మాన్ని ఆచరించడం.
ఇటువంటి ఉపదేశములను ఆదిశంకరుల వారు మనకు విశేషంగా చేశారు.
వాటిని మనం మననం చేయాలి, అదేవిధంగా ఆచరణ చేయాలి, ఈవిధమైన మహోపదేశాన్ని చేసి లోకానికి మహోపకారం చేసిన ఆదిశంకరులు సదా స్మరణీయులు, వందనీయులు, పరమ ఆరాధనీయులు.

ఈ ధర్మప్రభోధం ఎల్లప్పుడూ జరగాలి అనే ఉద్దేశ్యంతో నాలుగు పీఠాలు స్థాపించారు…

ఇక్కడ ఉండే పీఠాధిపతులు దేశసంచారం చేస్తూ, లోకానికి ధర్మ ప్రబోధం చేస్తూ, అందరికీ ఆశీర్వాదం చేస్తూ శారదా చంద్ర మౌళీశ్వరులను ఆరాధించి తద్వారా లోకక్షేమాన్ని కోరుతూ ఉండాలి అని ఆజ్ఞాపించారు…

*_🌹శుభమస్తు🌹_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏