నేటి పంచాంగం.. నేటి విశేషం…

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
💐పంచాంగం💐
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 01 – 01 – 2024,
వారం … ఇందువాసరే ( సోమవారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయనం – హేమంత ఋతువు,
మార్గశిర మాసం – బహళ పక్షం,

తిథి : పంచమి మ12.17 వరకు,
నక్షత్రం : మఖ ఉ7.17 వరకు
తదుపరి పుబ్బ,
యోగం : ఆయుష్మాన్ తె3.36 వరకు,
కరణం : తైతుల మ12.17 వరకు,
తదుపరి గరజి రా1.24 వరకు,

వర్జ్యం : సా4 09 – 5.55,
దుర్ముహూర్తము : మ12.24 – 1.08 &
మ2.36 – 3.20,
అమృతకాలం : రా2.48 – 4.34,
రాహుకాలం : ఉ7.30 – 9.00,
యమగండo : ఉ10.30 – 12.00,
సూర్యరాశి : ధనుస్సు,
చంద్రరాశి : సింహం,
సూర్యోదయం : 6.34,
సూర్యాస్తమయం: 5.32,

*_నేటి విశేషం_*

*ఆంగ్ల నూతన సంవత్సరాది*
ఈనాడు మనము ఒక సంవత్సరమునకు ( తేదీల ప్రకారంగా ) వీడ్కోలు పలికి, మరొక సంవత్సరమునకు స్వాగతము చెబుతున్నాము!!…
దీనినే న్యూ ఇయర్ వేడుకలు అని చెప్పుకుంటున్నాము …

నిజానికి మనము గ్రహించ వలసినది ఏమిటంటే, మన జీవితంలో ఒక సంవత్సరము కోల్పోయాము అని, ముఖ్యముగా గమనించాలి,

గడిచిన సంవత్సరములో ఏమి చేసాము?, ఏమి సాధించామని లెక్కచూసుకోవాలి…

భగవంతుడు ప్రసాదించిన ఈ విలువైన కాలంలో , ఎంత మందికి నిస్వార్థంగా సేవలు చేశాను,
నావారు, నా సంసారం, నా బంధువులు అని చూడకుండా … ఎంతమందికి ఏమి చేశామని ఆలోచించుకోవాలి,

గడిచిన రోజులలో భగవంతుడు నాకిచ్చిన శక్తిలో, నేను ఎంతమంది నిర్భాగ్యుల కడుపులు నింపాను, ఎన్ని దాన ధర్మాలు చేశాను అని ఆలోచించుకోవాలి…

*మరి మనం ఏ అర్హత సాధించాలి??*
మనం ఈరోజు చేస్తున్నది అంతా కేవలం ప్రపంచ వ్యామోహము కానీ , వేరే ఏమీ లేదు, మనం చేయవలసినది భగవంతుని సామ్రాజ్యం లోనికి ప్రవేశించడానికి, తగిన అర్హత పొందాలి…

సంవత్సరం, రావడం పోవడం అనేది, ప్రాకృత మునకు సంబంధించినది…

ఇది సిధ్ధాంతుల ప్రకారం ఈ సంవత్సరం దాటింది, క్రొత్తది వచ్చింది అనే భావన, మనం అనుసరిస్తున్నాము.
ఇది సత్యం, శాశ్వతం కాదు,
సూర్య చంద్రులు ఎక్కడికీ పోవటం లేదు గనుక, “రాత్రి పగలు” అనేవేలేవు లేవు…
తూర్పు లేదు, పశ్చిమo లేదు, ఇంక సంవత్సరం రావడం పోవడం ఎట్లు జరుగు తుంది, చెప్పండి…
ఇవన్నీ మానవ స్థాయిలో భ్రమించే భ్రమలు మాత్రమే!!…

మనమంతా, ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయి కి ఎదగాలి!!…
భగవంతునికి రాక పోకలు లేవు, రాక పోకలు లేని చక్రవర్తియే భగవంతుడు…

మానవుడు ఆ అర్హత పొందడానికి తగిన కృషి చేయాలి.
మనిషి కర్మ చేత బంధింప బడినవాడు కనుక,
సత్కర్మలు చేయాలి,
పవిత్రమైన పలుకులు పలుకాలి, ప్రేమను పంచాలి, పవిత్రమైన విషయాలు అభివృద్ధి పరచుకోవాలి,
దాని ద్వారా పవిత్రమైన హృదయమును పొందుతాము, అపుడే మనలో పవిత్రత ఏర్పడుతుంది!!…

ఈరోజు మనం చేస్తున్నది అంతా క్షణికం మాత్రమే, ఈరోజు తిన్నది రేపటికి గుర్తు వుండదు,
అదే ఆకలి గొన్న వారికి కొంతమందికి పెట్టి చూడు, జీవితం వున్నంత వరకు గుర్తు పెట్టుకొని వుంటారు…
భగవంతుడు కూడా తృప్తి చెందుతారు … అలాంటి రోజే నిజమైన పండుగ, మన జన్మలో నూతన దినంగా ఆనంద పడాలి…

*_💐శుభమస్తు💐_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏