నేటి పంచాంగం.. నేటి విశేషం…

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌷పంచాంగం🌷
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 02 – 01 – 2024,
వారం … భౌమవాసరే ( మంగళవారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయనం – హేమంత ఋతువు,
మార్గశిర మాసం – బహళ పక్షం,

తిథి : షష్ఠి మ2.29 వరకు,
నక్షత్రం : పుబ్బ ఉ9.55 వరకు,
యోగం : సౌభాగ్యం తె4.06 వరకు,
కరణం : వణిజ మ2.29 వరకు,
తదుపరి విష్ఠి తె3.32 వరకు,

వర్జ్యం : సా5.53 – 7.39,
దుర్ముహూర్తము : ఉ8.46 – 9.30 &
రా10.45 – 11.37,
అమృతకాలం : తె4.30 – 6.17,
రాహుకాలం : మ3.00 – 4.30,
యమగండo : ఉ9.00 – 10.30,
సూర్యరాశి : ధనుస్సు,
చంద్రరాశి : సింహం,
సూర్యోదయం : 6.35,
సూర్యాస్తమయం: 5.33,

*_నేటి మాట_*

*భగ్వద్ – బోధ – భగ్వద్గీత*

భగవంతుని మాటలు మనకు అర్థం కావడం లేదో, లేక మనకు సరిగ్గా బోధపడటం లేదో, ఆయన చెప్పిన మాటల్లోని అర్థాన్ని గ్రహించి జాగ్రత్తగా ఆచరించడం అవసరం… ఆయన అనుగ్రహం కావాలంటే ఆయన చెప్పిన విధంగా నడుచుకోవాలి!!!

దేవుని దయాదాక్షిణ్యాల కోసం మనం ఎన్నెన్నో బాహ్యఆర్భాటాలు చేస్తుంటాం…
అయితే వాటికి భగవంతుడు చిక్కుతాడా లేదా అని అని ఆలోచించుకోవాలి…!!!

*ఆయన దయ కలగాలంటే ఏమి కావాలి???*

పరమాత్ముని దయకై తీవ్రమైన ఆవేదన కావలెను…అంతే!
శిశువు రోదనము చేసిన వెంటనే, తల్లి ఆ రోదనము యొక్క రాగమెటువంటిదని, ఎలా రోధిస్తుందని పరీక్షించదు, ఆ రోధన విన్నవెంటేనే ఆలస్యము చేయదు, పరుగెత్తి వచ్చి యెత్తుకొని ఆనందమిచ్చును…
అలానే భక్తులు జిజ్ఞాసులై, ఆర్తులై ప్రార్థించిన చాలు, పరుగెత్తుకు వచ్చి ఆదుకుంటాడు, భగవంతుడు…
భగవంతునిలో ఎవరియందునూ భేదభావము యేమాత్రమూ ఉండదు… ఆవేదనే పరమాత్ముని సులభముగా కదిలించి కరిగించే ఏకైక సాధన…
కనుక చేసే పూజ, ప్రార్థన, భజన ఎందులో అయినా ఆర్తి, ఆవేదన ఉండేలా చూసుకోవాలి…
పరమాత్ముడు భావప్రియుడు తప్ప బాహ్యప్రియుడు కాడు… అన్న సత్యం గ్రహించి నడచుకోవాలి…
అప్పుడే మన కష్టాలన్నింటిని కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తాడు.
నిన్ను ప్రేమతో సం రక్షిస్తాడు, ఇతనికి అందరి యందు ప్రేమ కరుణ ఉన్నాయి..
నిత్యం ఆయనను స్మరించండి. తరించండి, ఆయన కార్యంలో నిస్వార్థంగా పాల్గొనండి, హంగులు హర్భాటాలకు దూరంగా ఉండండి,
ప్రతి జీవిపై భూతదయ చూపించండి, భగవంతుని కృపకు పాత్రులుకండి…

*_🌷శుభమస్తు🌷_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏