నేటి పంచాంగం.. నేటి విశేషం..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌺పంచాంగం🌺
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 03 – 01 – 2024,
వారం … సౌమ్యవాసరే ( బుధవారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయనం – హేమంత ఋతువు,
మార్గశిర మాసం – బహళ పక్షం,

తిథి : సప్తమి సా4.35 వరకు,
నక్షత్రం : ఉత్తర ఉ12.29 వరకు,
యోగం : శోభన తె4.28 వరకు,
కరణం : బవ సా4.35 వరకు,
తదుపరి బాలువ తె5.29 వరకు,

వర్జ్యం : రా9.42 – 11.27,
దుర్ముహూర్తము : ఉ11.43 – 12.26,
అమృతకాలం : తె4.30 – 6.17,
రాహుకాలం : మ12.00 – 1.30,
యమగండo : ఉ7.30 – 9.00,
సూర్యరాశి : ధనుస్సు,
చంద్రరాశి : కన్య,
సూర్యోదయం : 6.36,
సూర్యాస్తమయం: 5.34,

*_నేటి మాట_*

*భక్తుడైన వాడు – సాధనలో ఎలా వుండాలి??*

ఈరోజుల్లో మన సాధన ఎలా వుండి అంటే , కోరిన కోరికలు తీరితే దైవము, లేకపోతే దయ్యము!!…
చాలా మంది నోట వింటుంటాము ఆ దేవుని దగ్గరకు వెల్లు, ఈ దేవుని నమ్ముకో, ఆ దేవుణ్ణి పట్టుకో చాలా పనులు అవుతాయి, డబ్బులు వస్తాయి, పనులు అవుతాయి అని!!…

ఒక్కటి గుర్తుంచుకోవాలి !!…
నదులు ఎప్పుడూ వెనుకకు ప్రవహించవు, మద్యలో ఏదైనా అవరోధం వచ్చినా దానిని నెట్టివేయడమో లేదా పక్కకు జరిగి ముందుకు పోవడమో జరుగుతుంది తప్ప, వెనుకకు వెళ్ళే ప్రసక్తి వుండదు! …

అలానే భక్తుడనువాడు ఎల్లపుడూ తన సాధనను ముందుకు సాగిపోయెలా చూసుకోవాలి…

మద్యలో అనేకములైన చింతలు, కష్టములు, నష్టములు కలుగవచ్చును,
కానీ వాటన్నింటినీ పక్కకి నెడుతూ ముందుకు సాగిపోవాలి…
వెనుకడుగు వేయాలన్న ఆలోచనే చేయకూడదు, ఏ ఉద్దేశ్యముతో అయితే సాధన ప్రారంభించామో అది విజయవంతముగా పూర్తయ్యేవరకూ విశ్రమించకూడదు…

అన్నింటి కన్నా ముఖ్యం, భగవంతునిపై గట్టి విశ్వాసంతో ఉండాలి.
అడ్డంకులు, అవరోధములకు భయపడవద్దు, మన సాధనలో ఎదురయ్యే ప్రతీ అవరోధమును ఆయనే ఏదో విధముగా తొలగిస్తాడు.

కొంచం కష్టమైనా సరే వెనుకడుగు మాత్రం వేయవద్దు, భగవంతునిపై విశ్వాసం కోల్పోవద్దు, ముందుకు సాగడానికే సిద్ధపడి ఉండాలి…

*_🌺శుభమస్తు🌺_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏