నేటి పంచాంగం.. నేటి విశేషం..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌹పంచాంగం🌹
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 05 – 01 – 2024,
వారం … భృగువాసరే ( శుక్రవారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయనం – హేమంత ఋతువు,
మార్గశిర మాసం – బహళ పక్షం,

తిథి : నవమి రా7.49 వరకు,
నక్షత్రం : చిత్ర సా4.45 వరకు,
యోగం : సుకర్మ తె4.23 వరకు,
కరణం : తైతుల ఉ6.43 వరకు,
తదుపరి గరజి రా7.49 వరకు,

వర్జ్యం : రా10.43 – 12.25,
దుర్ముహూర్తము : ఉ8.47 – 9.31 &
మ12.27 – 1.11,
అమృతకాలం : ఉ9.49 – 11.33,
రాహుకాలం : ఉ10.30 – 12.00,
యమగండo : మ3.00 – 4.30,
సూర్యరాశి : ధనుస్సు,
చంద్రరాశి : తుల,
సూర్యోదయం : 6.36,
సూర్యాస్తమయం: 5.35,

*_నేటి మాట_*

*జీవిత గమ్యానికి – రాచబాట ఏది???*
ఈరోజుల్లో ఆధ్యాత్మికత అంటే, కొందరికి నవ్వు, మరికొందరికి ఎటకారం ఇలా చాలా రకాలుగా భావిస్తారు,
అలాంటి వారిని లెక్క చేయరాదు, నరున్ని నమ్ముకున్నాడు బాగుపడ్డ వాడు అవనిలో ఎవడూ లేడు,
నారాయణుని నమ్ముకుని చేడిపోయినవాడు అవణిలో ఎవడు లేడు, వుండడు కూడా!!…

“మనము చేసే భజనలు, సేవలు మరియు ఇతర దైవారాధనలను చూసి నవ్వుతూ విలువైన సమయం వృధాగా గడుపుతున్నారని భావించే అజ్ఞానులు మీకు తారస పడవచ్చును”…
అయితే అలాంటి వారిని మీరు ఎంతమాత్రం పట్టించుకోనవసరం లేదు…

మురికిగా ఉన్న పొలంలో వరి విత్తనాల సంచులను చూసి ఆ వ్యక్తులు నవ్వవచ్చు,
విలువైన ఆహార పదార్థాలను వ్యర్థంగా పారబోస్తున్నారని మీ చర్యలను ఖండించవచ్చు…

కానీ మనకు తెలుసు, వరి విత్తనం యొక్క ప్రతి సంచికి, కొన్ని వారాలలో భూమి పది రెట్లు లేదా ఇరవై రెట్లు లేదా వంద రెట్లు ధాన్యాన్ని తిరిగి ఇస్తుంది అని…

అలానే దేవుని గురించి ఆలోచించడం, లేదా దైవారాధనలో గడిపిన సమయం నిజంగా విలువైనది, సార్థకమైనది.
ఎందుకంటే ఇది మీకు మానసిక ప్రశాంతతను, ధైర్యాన్ని , సుఖ జీవనంను సమకూర్చుతుంది!!…
కనుక మూర్ఖుల సాంగత్యానికి దూరంగా ఉండాలి, మన లోపల ఉండిన మనశ్శాంతికి భంగం కలిగించే ఏ వస్తువైనా, విషయమైనా, వ్యక్తినైనా మన దరిదాపులకు రానివ్వక పోవడం మంచిది…
“ఆధ్యాత్మికతయే మన గమ్యానికి రాచభాట అని తెలుసుకోవాలి…”

*_🌹శుభమస్తు🌹_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏