నేటి పంచాంగం.. నేటి విశేషం..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌸పంచాంగం🌸
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 06 – 01 – 2024,
వారం … స్థిరవాసరే ( శనివారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయనం – హేమంత ఋతువు,
మార్గశిర మాసం – బహళ పక్షం,

తిథి : దశమి రా8.47 వరకు,
నక్షత్రం : స్వాతి సా6.17 వరకు,
యోగం : ధృతి తె3.49 వరకు,
కరణం : వణిజ ఉ8.18 వరకు
తదుపరి విష్ఠి రా8.47 వరకు,

వర్జ్యం : రా12.08 – 1.48,
దుర్ముహూర్తము : ఉ6.35 – 8.03,
అమృతకాలం : ఉ8.55 – 10.37,
రాహుకాలం : ఉ9.00 – 10.30,
యమగండo : మ1.30 – 3.00,
సూర్యరాశి : ధనుస్సు,
చంద్రరాశి : తుల,
సూర్యోదయం : 6.36,
సూర్యాస్తమయం: 5.36,

*_నేటి మాట_*

*మనసు… శిక్షణ…!!*
మనసుకు ఏమి శిక్షణ అని అనుకుంటాము కదా!!
భగవంతుణ్ణి చేరాలి అంటే, మనకు త్రోవ చూపించేది మన మనసే …
భగవంతుడు మనకు తెలియాలంటే ముందు మన మనసు అర్ధం కావాలి!!…
మనసుకున్న అవలక్షణాలను వదిలించి మంచి విషయాల్లో శిక్షణివ్వాలి.
భక్తి, భజన, యోగం ఏదైనా మనసుకు మంచి శిక్షణ కోసమే!!…
భక్తిలో, పూజలో మనం ఈ విషయం మర్చిపోకూడదు!!..
మనసుకు శాంతినిచ్చే ఏకాంతాన్ని ఇప్పటి నుండే అలవాటు చేసుకోవాలి.
లేకుంటే అది వృద్ధాప్యంలో శాపంగా పరిణమిస్తుంది.
దానిని జాగ్రత్త పడాలి అంటే, ముందు మనకు ఇష్టమైన విషయాల నుండి మనసును ఈశ్వరుడు వైపు మళ్ళించాలి!!…

ఆ తర్వాత ఆ రూపాన్ని కూడా వదిలి తనలో తాను ఉండటం మనసుకు అలవాటు చేయాలి.

పిల్లల్ని పెంచినంత శ్రద్ధగా మనసును చూసుకోవాలి, మిలట్రీలో చేరిన వారితో రోజూ శారీరక వ్యాయామం చేయిస్తారు.
ఎందుకంటే ఏ సమయంలోనైనా శత్రువుల దాడిని ఎదుర్కొనేందుకు అది శిక్షణ.
మనసు కూడా అంతే, మనం ఎలా శిక్షణిస్తే మనసు అలాగే ఉంటుంది…

*_🌸శుభమస్తు🌸_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏