నేటి పంచాంగం…

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌾పంచాంగం🌾
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 15 – 01 – 2024,
వారం … ఇందువాసరే ( సోమవారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయనం – హేమంత ఋతువు,
పుష్య మాసం – శుక్ల పక్షం,

తిథి : చవితి ఉ9.58 వరకు,
నక్షత్రం : శతభిషం మ1.12 వరకు,
యోగం : వ్యతీపాతం ఉ7.41 వరకు,
తదుపరి వరీయాన్ తె4.28వరకు,
కరణం : భద్ర ఉ9.58 వరకు,
తదుపరి బవ రా8.44 వరకు,

వర్జ్యం : రా7.08 – 8.37,
దుర్ముహూర్తము : మ12.31 – 1.15,
మరల *మ2.44 – 3.28,
అమృతకాలం : ఉ7.59వరకు,
మరల తె4.03 – 5.32,
రాహుకాలం : ఉ7.30 – 9.00,
యమగండo : ఉ10.30 – 12.00,
సూర్యరాశి : ధనుస్సు,
చంద్రరాశి : కుంభం,
సూర్యోదయం : 6.38,
సూర్యాస్తమయం: 5.40,

*_నేటి విశేషం_*

*మకరసంక్రాంతి*
*మకర సంక్రమణం మరియు ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభం ఉ8.25నుండి*

*సంక్రాంతి పండుగ*

భోగి మకర సంక్రాంతి, కనుమ ముచ్చటైన మూడు పండగల సమాహారసమ్మేళనమే ఈ మహూన్నత భాగ్య సిరులసంక్రాంతి పెద్ద పండుగ.

అన్ని పండుగలను మనం చాంద్రకాలమానం ప్రకారం జరుపుకొగా….ఈ సంక్రాంతి పండుగను సూర్య కాలమానం ప్రకారం జరుపుకుంటాము. అందుకే ఈ పండగ ఎప్పుడూ జనవరి నెలలోనే వస్తుంది.

ఇది మన సంస్కృతి సాంప్రదాయాల ఆలవాలం మన తెలుగు లోగిళ్ళు ధాన్యపురాశులతోపాడి పంటలతో కళకళ లాడే దివ్య కాలం బంధు మిత్రుల సపరివారంతో లోగిళ్ళన్నీ ఆనంద పరవశంతో వెలుగొందే శుభతరుణం.

పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ కొత్త బట్టలు ధరించి చూడముచ్చటగా ఉంటారు బంధుమిత్రులు అందరూ ఇల్లు చేరగా సంతోషాలను పంచుకుంటూ చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటారు ప్రతి లోగిలి ఎంతో ఆహ్లాదం నిండి ఉంటుంది.

గుమ్మం ముంగిట వాకిలిలో అందమైన రంగవల్లులు పెట్టి సంక్రాంతి పండుగకు సుస్వాగతం పలుకుతూ వాకిలి ని ఎంతో అందంగా తీర్చిదిద్దుతారు ప్రతి ఇంటికి ఆడపడుచులు వారి పిల్లలతో వచ్చి వైభోగం తీసుకుని వస్తారు.

సంక్రాంతి పండుగ అంటే ఎన్నో సాంప్రదాయమైన జానపద కళలు ప్రదర్శితమవుతాయి గ్రామగ్రామాన అనేక మంది కళాకారులు చేరి నెల రోజుల ముందు నుండే ఎన్నో కళ లను ప్రదర్శింప చేసి సంక్రాంతి కళను తీసుకుని వస్తారుఎంతో ఆనంద పరవశం కలిగిస్తారు.

గంగిరెద్దుల ఊరేగింపులు హరిదాసుల గానామృత పాటలు బుడబుక్కల వారి వాయిద్యములు జంగమయ్య ల దీవెనలు పగటివేషధారుల ఎన్నో రకాల వేషాలు మల్లి కాసుల వాళ్ళ ప్రదర్శనలు దొమ్మరుల ప్రదర్శనలుకొమ్మ దాసుల వాళ్ళ కుప్పిగంతులుకోలాటం కర్ర భజనలు… నృత్యాలు అలా ఇంకా ఎన్నో ఎన్నో జానపద కళలు గ్రామగ్రామాన ప్రదర్శనం అవుతాయి సంక్రాంతి పండుగకు ఎంతో శోభను తెస్తాయి.

సంక్రాంతి పండుగ అంటే పూర్వపు రోజుల్లో ఐదు రోజులు చేసుకొని ఆనందించేవారు ఇప్పుడున్న బిజీ కాలంలో ఆ పండుగ మూడు రోజులకు పరిమితమయింది నాలుగో రోజున చేసే బొమ్మల కొలువులు ఎక్కడ కానరావటం లేదుచివరి రోజున ప్రబల తీర్థములు జరుగుతాయి పల్లె సీమలలో ప్రభల ఊరేగింపులు ఎంతో వైభవంగా జరుగుతాయి ఈ తీర్థములకు గత రోజులలో ఎడ్లబండి మీద వచ్చే వారు ఇప్పుడు బళ్ళు ఎక్కడో కానీ కానరావటం లేదు ఇప్పుడు అన్ని కార్లు మాత్రమే కనిపిస్తున్నాయి .

ఈ ప్రభలతీర్థాలు ఎంతో గొప్పగా వైభవంగా జరుగుతాయి ఆత్మీయులు బంధువులు స్నేహితులు అందరూ కలుసుకుని ఎంతో ఆనందంగా గడుపుతారు ఈ సంక్రాంతి పండుగ ఎన్నో మధుర స్మృతులను మదిలో నింపుతుంది.

ఈ సంక్రాంతి మీకు మీ కుటుంబానికి సౌభాగ్య వంత మైన కొత్త కాంతులు కళలు తీసుకు రావాలనిఆయురారోగ్య సుఖ సంతోషాలను సిరి సంపద సౌభాగ్యములను సుఖ శాంతి సౌఖ్యములను సమత, మమతానురాగాలను శుభ,విజయ,భోగ ,భాగ్యములను ధన,ధాన్య,కనక, వస్తు,వాహనములను సత్య,దాన,ధర్మ,భక్తి సుగుణాలను పేరు ప్రఖ్యాతి,కీర్తి ప్రతిష్ట ను కలగచేసి నిత్యం కళకళలాడుతూ సౌభాగ్యాలతో విలసిల్లేలా చేయాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ …

*_🌾శుభమస్తు🌾_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏