నేటి పంచాంగం.. నేటి విశేషం..

🥀పంచాంగం🥀
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 20 – 01 – 2024,
వారం … స్థిరవాసరే ( శనివారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం – హేమంత ఋతువు,
పుష్య మాసం – శుక్ల పక్షం,

తిథి : దశమి రా10.13 వరకు,
నక్షత్రం : కృత్తిక తె5.50 వరకు,
యోగం : శుభం మ2.27 వరకు,
కరణం : తైతుల ఉ10.53 వరకు,
తదుపరి గరజి రా10.13 వరకు,

వర్జ్యం : సా6.06 – 7.40,
దుర్ముహూర్తము : ఉ6.39 – 8.07,
అమృతకాలం : తె3.29 – 5.02,
రాహుకాలం : ఉ9.00 – 10.30,
యమగండo : మ1.30 – 3.00,
సూర్యరాశి : మకరం,
చంద్రరాశి : మేషం,
సూర్యోదయం : 6.39,
సూర్యాస్తమయం: 5.44,

*_నేటి మాట_*

ఈరోజు మన భక్తి ప్రపత్తులు ఎలా ఉన్నాయంటే, భగవంతుడు కావాలని కొరుతాము, కానీ ఆయనను ఎలా పొందాలో తెలుసుకోలేము, ఒకవేళ ఎవరైనా చెబితే , దానికి ఎదురు ప్రశ్నలు వేసి, మాయలో పడతాము…
ఈ రోజు మనం సృష్టికర్త కోసం వెతికి వెతికి తుదకు మనతో కాదు అని నిరాశ నిస్పృహలకు లోను అవుతున్నాము…

సృష్ఠి కర్త కోసం వెతకడం కాదు, ఆకలితో పస్తులుండే వారికోసం వెతకాలి…
సంవత్సరంలో నీకు వచ్చిన ఆదాయంలో ఒకరోజు ఆదాయంతోనైనా వారి ఆకలిని తీర్చాలి…
కోట్లాది రూపాయలు హుండీలో వేసిన కూడా, వేయి సంవత్సరములు తలకిందులుగా తపస్సు చేసినా కూడా రాని పుణ్య ఫలితం వస్తుంది…

దరిద్ర నారాయణుని సేవయే అసలైన దైవసేవగా భావించి సేవించాలి, అప్పుడు మన జన్మ ధన్యం అయినట్లే!…

🥀శుభమస్తు🥀_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏