నేటి పంచాంగం.. నేటి విశేషం..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః ..
🌻పంచాంగం🌻
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 21 – 01 – 2024
వారం … భానువాసరే ( ఆదివారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం – హేమంత ఋతువు,
పుష్య మాసం – శుక్ల పక్షం,

తిథి : ఏకాదశి రా9.20 వరకు,
నక్షత్రం : రోహిణి తె5.41 వరకు,
యోగం : శుక్లం మ12.22 వరకు,
కరణం : వణిజ ఉ9.46 వరకు,
తదుపరి భద్ర రా9.20 వరకు,

వర్జ్యం : రా9.44 – 11.19,
దుర్ముహూర్తము : సా4.16 – 5.00,
అమృతకాలం : రా2.30 – 4.05,
రాహుకాలం : సా4.30 – 6.00,
యమగండo : మ12.00 – 1.30,
సూర్యరాశి : మకరం,
చంద్రరాశి : వృషభం,
సూర్యోదయం : 6.39,
సూర్యాస్తమయం: 5.44,

*_నేటి విశేషం_*

_*పుత్రదా ఏకాదశి*_
పుష్యమాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది.
ఈ పవిత్రమైన రోజున ఎన్నో ధర్మ కార్యాలు నిర్వహిస్తారు…

ఈ *పుష్య పుత్రదా ఏకాదశి* ని *పవిత్ర / శుద్ద ఏకాదశి* అని కూడా అంటారు.

ఈ రోజున విష్ణు మూర్తిని ఎలా ఆరాధిస్తారు…
పుత్రదా ఏకాదశి రోజున ఎలాంటి పనులు అస్సలు చేయకూడదు..
ఈ పవిత్రమైన రోజున పాటించాల్సిన పద్ధతులు ఏంటి అనే విషయాలను ఒకసారి పరిశీలిద్దాము…

*పుత్రదా ఏకాదశి రోజున*

ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే లేచి స్నానం చేయాలి.
ఆ తర్వాత విష్ణుమూర్తిని పూజించాలి.
ఈ సమయంలో లక్ష్మీ దేవి ముందు, ఒక ప్రమిదను తీసుకుని అందులో స్వచ్ఛమైన నెయ్యి వేసి ఒక దీపం వెలిగించాలి.
పూజ తర్వాత గంగా(నీటిని) జలం తీసుకుని మన ఆత్మను శుద్ధి చేయండి.
ఇక ఆ రోజంతా నామ స్మరణ చేయాలి, వీలైతే రాత్రంతా మేల్కొని విష్ణువును కీర్తించాలని మన పురాణాలు చెబుతున్నాయి…

*‘ఓం గోవింద , మాధవయ నారాయాణయ నమః’* అనే మంత్రాన్ని జపించాలి.
ఏదైనా దైవ మంత్రాన్ని ఉదయం , సాయంత్రం 108 సార్లు జపించాలని , ఇంకా రోజంతా జపిస్తే ఇంకా మంచిదని, మన పురాణాల ద్వారా అవగతమవుతోంది,

మన పూజ ముగిసిన తర్వాత అందరికీ ప్రసాదం పంచిపెట్టాలి, తెల్లవారి వీలైతే అన్న సమారాధన ( ఎంత మందికి వీలైతే అంత )జరిపితే మంచిది,

*ఈరోజు బియ్యం వినియోగించకూడదు*
ఈ పుష్య ఏకాదశి రోజున బియ్యం వినియోగించకూడదంట.
దీని వెనుక ఒక పెద్ద కారణం ఉందట.
ఈ పవిత్రమైన రోజున బియ్యం తినడం ద్వారా , మనకు కొన్ని దోషాలు వస్తాయని కూడా విష్ణు పురాణం లో వుంది,

*వీలైతే కోపాన్ని నివారించాలి*

ఈ పవిత్రమైన రోజున విష్ణువును ఆరాధించడం ఎంత ముఖ్యమో.. అదే విధంగా ఈరోజున కోపం రాకుండా ఉండడం కూడా అంతే ముఖ్యం, ఈరోజే కాదు, ఎంత ఆచరిస్తే అంత సాధన లో ముందుంటాము,
ముఖ్యంగా ఎవరితోనూ వాదనకు దిగకూడదు, అలాగే అనవసరమైన చర్చలకు దూరంగా ఉండాలి.
ఏకాదశిన మనస్ఫూర్తిగా విష్ణుదేవుడిని ఆరాధించడం వల్ల ప్రత్యేక ఫలితాలు వస్తాయని పెద్దలు చెబుతారు…

ఈ పవిత్రమైన రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం , మద్యపానం , పొగతాగడం చేయకూడదని , సాత్విక ఆహారాన్నే తీసుకోవాలి…

ఏకాదశి రోజున ఎలాంటి సందర్భాల్లోనైనా ఎదుటి వారిని అవమానించడం మరియు అగౌరపరచడం వంటివి అస్సలు చేయకూడదు,
అలా చేస్తే మనము ఎన్ని పూజలు, వ్రతాలు నోములు ఆచరించినా ఎలాంటి లాభం వుండదని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి…

*_🌻శుభమస్తు🌻_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏