నేటి పంచాంగం.. నేటి విశేషం .

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🚩పంచాంగం🚩
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 22 – 01 – 2024,
వారం … ఇందువాసరే ( సోమవారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం – హేమంత ఋతువు,
పుష్య మాసం – శుక్ల పక్షం,

తిథి : ద్వాదశి రా8.52 వరకు,
నక్షత్రం : మృగశిర తె6.01 వరకు,
యోగం : బ్రహ్మం ఉ10.37 వరకు,
కరణం : బవ ఉ9.06వరకు
తదుపరి బాలువ రా8.52 వరకు,

వర్జ్యం : ఉ11.22 – 12.59,
దుర్ముహూర్తము : మ12.33 – 1.18 &
మ2.47 – 3.31,
అమృతకాలం : రా9.05 – 10.43,
రాహుకాలం : ఉ7.30 – 9.00,
కేతుకాలం : ఉ10.30 – 12.00,
సూర్యరాశి : మకరం,
చంద్రరాశి : వృషభం,
సూర్యోదయం : 6.39,
సూర్యాస్తమయం: 5.44,

*_నేటి విశేషం_*

*శ్రీ రామ జన్మభూమి మందిర్, అయోధ్యలో శ్రీ బాలరాముడి(రామ్ లల్లా) ప్రాణప్రతిష్ట ఉత్సవం🙏*
*రాముడొస్తున్నాడు*

*శ్రీరాఘవం దశరాధాత్మజ మప్రమేయం*
*సీతాపతిం రఘకులాన్వయ రత్నదీపం*
*ఆజాను బాహుం అరవింద దళాయతాక్షం*
*రామం నిశాచర వినాశకరం నమామి*

పుత్రకామేష్టి దశరధుడు చేయడం ఏమో గాని, భూదేవి తన మేనిపై ధర్మపురుషోత్తముడు నడయాడాలని ధర్మం నాలుగుపాదాలు పరిఢవిల్లాలని తపన పడింది.

కృతయుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచినప్పటికి, మానవులపట్ల శిక్షవిధిని అమలుపరిచే రాజులేడు.

ఒకరికొకరు రక్షకులై వచ్చారు,
ఆ విధంగా ఉండడం వలన ధర్మం నశించడం మొదలైంది.
అపుడు బ్రహ్మదేవుడి నొసటనుండి విరూపాక్షుడు , విశాలాక్షుడు అనేపేరుతో నీతిశాస్త్రం ఆవిర్భవించింది.

దానిని అమలు చేయడానికి రాజు కావాలి.
వైనుడు అనే మహారాజు ధర్మనీతిశాస్త్రంని అమలుపరిచే దిశగా అడుగులువేసాడు.

అలా కృతయుగంలో మొదలైన పరిరక్షణ త్రేతాయుగంలో కూడా కొనసాగాలనే తపన భూదేవికి కలిగి మనోకామేష్ఠి వలన ఉదయించినవాడు మన రాముడు.
రఘువంశపు ధర్మ నిరతికి మణిమకుటాయమానం మన రాముడు, రఘుకుల దీపకుడు మన రాముడు.

*రామో విగ్రహవాన్ ధర్మః*
అన్న వాక్యం చాలు ఆయనను నిర్వచించడానికి, ధర్మసంస్థాపనకు భాగవానుడి పుట్టుక ఒక సాకు!ఒక మాయ!
పుట్టిన చంటాడు చంద్రుణ్ణి అడిగిన పసితనంరలో ఆయన మాయలో పడిన దశరధుడు…
ఆహా నా కొడుకు ! అంటూ సంబరపడిపోయాడుట,
ఎంత ఒద్దిక !ఎంత అణుకువ! ఎంత అందం,! ఎంత శౌర్యం! ఎంత మధురపలుకు! అని మురిసిపోయాడుట.

నాన్న ! అనే మొదటి పలుకు విన్న ఏ తండ్రైన ఎంత మురిసిపోతారో ఆ పుత్ర గాఢ పరిష్వంగం ఎంతలా అనుభవిస్తారో అందరికి తెలుసు…
నూట ముప్పై కోట్ల ప్రజలు రామలల్లాను అక్కున చేర్చుకుని ప్రతివాడు ఒక నాన్న, ఒక అమ్మ లా ఆ గాఢ పరిష్వంగం అనుభవించడానికి అయోధ్యలో ఆవిష్కృతం అయ్యే మధురక్షణాలు దగ్గరపడుతున్నాయి…

మన హృదయమే ఒక అయోధ్య అయ్యింది, మనం రామ్ లల్లాని అక్కున చేర్చుకుందాం.

దేవుడు కూడా మనిషిగ పుడితే నానాబాధలు పడవలెనా? అని మన కవులు ఎంత బాధ పడ్డా ,అవి అధిగమించడానికి మనిషి ఎంతైనా కష్టపడాలని అడవులకేగుట, మైత్రీవనం, వారధికోసం వానరమూకను సమకూర్చుకోవడం,అధర్మపరుల సంహారం.
ఇలా ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన తపన పడ్డాడు.
కష్టానికి తగిన ఫలితం చూపించాడు, అదే ధర్మ సంస్థాపన.

ఆఖరికి తను పుట్టిన *అయోధ్య* లో ఉండడానికి కలియుగంలో కూడా కష్టపడి మనందిరిలోనూ *సయోధ్య* కుదిర్చి తన గుడి తానే కట్టుకున్నాడు ఏ మాత్రం అతిశయం లేకుండా…
ఎందుకంటే ఆయన నిరతిశయానంద స్వరూపుడు కనుక, నిరాడంబరుడు కనుక, చివరకు ధర్మం గెలుస్తుంది అనే జ్ఞానికనుక.
ఎంత మంచి పుత్రుడుదయించాడు మన భరతభూమి మీద? రాముడిలాంటి కొడుకుంటే చాలదు మన జీవితాలకు ?
ప్రపంచంలో శాంతి సౌభాగ్యాలు విలసిల్లాలన్నా ,మనిషి మనిషిగా జీవించాలన్నా రాముని పయనం తెలుసుకుంటే చాలు.

అందుకే ఆయనకున్న గొప్ప అత్యుత్తమ పదహారు మంచి లక్షణాల్లో కొన్నైనా మనం సాధన చేస్తే, మన జీవితాలకు శాంతి సౌఖ్యం.

అందుకే శ్రీరామ పరివార్ కి జై! అంటూ అఖంఢ భారతావని జే జే లు పలుకుతోంది.
ప్రకృతి రామనామం ప్రవచిస్తోంది…
భూనభోమండలమంతా రామలల్లాకి జై అంటూ పలవరిస్తోంది పరవశిస్తోంది.

ఎన్నో ఏళ్ల కష్టం ఎన్నో ఏళ్ల తపన, ఎంతో మంది కరసేవకుల రామ భక్తి చూసిన రాముడొస్తున్నాడు, తనను తాను మన గుండెల్లో చూసుకోవడానికి వస్తున్నాడు.

బాల రాముడి ప్రతిష్ఠను చూడడానికి, భూమిజతో, సోదరులతో, హనుమ, మిగిలిన పరివారంతో కలిసి శ్రీరాముడు వేంచేసే ఘడియలు దగ్గర పడుతున్నాయి.

దశాబ్దాల కాలంగా రామనిర్మాణానికి దశలవారిగా అడ్డు పడిన అవాంతరాల
“*దశకంఠరావణులపై*”భరత
మాత ముద్దుబిడ్డలందరు ఒక్కొక్కొడు ఒక్కొక్క కోదండ రాముడై విజయం సాధించారు.

చిరకాల వాంఛ నెరవేరే ఆనంద క్షణం కోసం సాధుపుంగవులు, రామభక్తులు, రామసేవకులు
కోటి కన్నులతో వేచి చూసిన మధుర ఘట్టానికి తెరలేస్తోంది.

బాలుని గా అయోధ్య పవిత్ర భూమి పై నడయాడిన శ్రీరాముడు, సాకేత రాముడై, సీతారాముడై, సమస్త భారతీయుల మనోభిరాముడై మనముందుకు వచ్చి ఆశీర్వదించే అపురూపమైన ఘడియలు ఆసన్నమైనవి.

గొప్ప షోడశ గుణాలు కలవాడు ఎవరా! అని వెతికిన దేవతలకు రఘువంశదీపుడు రాముడొక్కడే అని,
ఆయన ఈ భరతభూమి పై జన్మించాడని తెలిసిన దేవతలు ఆహా! మానవులెంత ధన్యులు అని అసూయపడ్డారట.

రాముడి చరిత్ర గురించి వాల్మీకి వ్రాసిన మహాకావ్యమైన శ్రీ రామాయణ అధ్యాయాలు మనమందరం ఒక్కసారి “మననం” చేసుకుంటే మనకి ఆకళింపయ్యే అంతరార్థం సూక్ష్మంగా ఇలా చెప్పవచ్చు.

“మాట తేనెలొలుకుతుంది.” “మూర్తీభవించిన సత్యం ధర్మం మాట్లాడుతాయి ” ” గురుప్రాశస్తాన్ని వివరిస్తుంది”

“దుర్జనులపట్ల మాట , బాణం గర్జిస్తాయి,”” వినయం విల్లుల ఒంగుతుంది” “కృతజ్ఞత, క్షమాగుణం ప్రవహిస్తాయి ”
“రాజ్యం వేచిచూస్తుంది” “భూమిపులకరిస్తుంది. “”మైత్రీధర్మం ప్రకాశిస్తుంది””ప్రజలు హర్షిస్తారు, దేవతలు వినమ్రులవుతారు”” పృకృతి ఆయన కనుసన్నల్లో మెలుగుతుంది “”ధర్మపత్ని అంటేనిర్వచనం” తెలుస్తుంది.
“సోదరప్రేమకు అర్థం తెలుస్తుంది” “యుగాలు గడిచినా, కాలాలుమారినా, గతితప్పక ధర్మాన్ని ఆచరిస్తే మనల్నిఆయనే రక్షించుకుంటాడు అనే విశ్వాసంతో ఆయనతో పాటు మనం నడిస్తే చాలు , ఆయనలా అనుకరిస్తే చాలు జీవితాల్ని”రామమయం” చేసుకోవచ్చు.

రామో విగ్రహవాన్ ధర్మః అని రాక్షసుడైన మారీచుడు భయంతో అన్నా, ధర్మం నిప్పులాంటిదని, తప్పితే దహనం చేస్తుందనే గొప్పజ్ఞానాన్ని పొందాలంటే రామాయణం చదవాలి, రాముణ్ణి ఆదర్శం గా తీసుకోవాలి.
సనాతన ధర్మానికి రామాయణం జీవగర్ర. మానవుడైన రాముడు దేవుడయ్యాడు…

రాశీభూతమైన రాముణ్ణి సీతా దేవి, లక్ష్మణ,భరత,శత్రుఘ్న హనుమాన్ సమేతంగా ఆహ్వానిద్దాం…

… జై శ్రీ రాం …
స్వస్తి🙏🚩

*_🚩శుభమస్తు🚩_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏