నేటి పంచాంగం.. నేటి విశేషం..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌸పంచాంగం🌸
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 27 – 01 – 2024,
వారం … స్థిరవాసరే ( శనివారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం – హేమంత ఋతువు,
పుష్య మాసం – బహళ పక్షం,

తిథి : విదియ రా2.01 వరకు,
నక్షత్రం : ఆశ్రేష ఉ12.08 వరకు,
యోగం : ఆయుష్మాన్ ఉ7.43 వరకు,
కరణం : తైతుల మ1.04 వరకు,
తదుపరి గరజి రా2.01 వరకు,

వర్జ్యం : రా1.22 – 3.08,
దుర్ముహూర్తము : ఉ6.37 – 8.07,
అమృతకాలం : ఉ10.23 – 12.07,
రాహుకాలం : ఉ9.00 – 10.30,
యమగండo : మ1.30 – 3.00,
సూర్యరాశి : మకరం,
చంద్రరాశి : కర్కాటకం,
సూర్యోదయం : 6.38,
సూర్యాస్తమయం: 5.49,

*_నేటి మాట_*

*మానవ జన్మకుసార్థకత ఏమిటి??*

” సృష్టిలో ప్రతీ జీవి దైవ స్వరూపమే కనుక దైవారాధన కొరకు వినియెాగించే ఖర్చును దీనజన సేవ నిమిత్తం వినియోగించండి”…

దేవునికి దూప దీప నైవేద్యాలు పెట్టే వాల్లు కోట్ల కొలది ఉన్నారు, కానీ దీనులకు సహాయపడేవారు చాలా అరుదు…
పూజలు చేసిన వాడు దేవుణ్ణి వెతుక్కున్న వాడు అవుతాడు!!…
కానీ …
దానం చేసేవాడిని దేవుడే వెతుక్కుంటూ వస్తాడు …

నిజానికి దేవుడు నాకు ఇవి కావాలి అవి కావాలి అని అడగలేదు.
కానుకలతో ఆయనకు ఏం పని? ఇవన్నీ ఆయన ఇచ్చినవే, ఆయనకు లోటు ఏముందని? ఆకలితో అలమటించే వాడి ఆకలి తీర్చు.
నీవు దైవానికి గొప్ప సేవ చేసే వాడివి అవుతావు.
ఎవరకి ఏ సహాయం కావాలన్నా నీవు చేయగలిగినదంతా నీవు చేయు.
అదంతా దేవునికే చెందుతుంది.
ఇలా చేస్తే నీ పట్ల దేవుడు ఎంతగానో తృప్తి చెందుతాడు భగవంతుడు…
మానవ జన్మ రావడం నీవు చేసుకున్న గొప్ప పుణ్యం, దానికి సార్ధకతకు ఇదొక సులువైన మార్గం…

*_🌸శుభమస్తు🌸_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏