నేటి పంచాంగం… నేటి మాట…

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌷పంచాంగం🌷
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 13 – 02 – 2024,
వారం … భౌమవాసరే ( మంగళవారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం – శిశిర ఋతువు,
మాఘ మాసం – శుక్ల పక్షం,

తిథి : చవితి రా8.27 వరకు,
నక్షత్రం : ఉత్తరాభాద్ర రా6.07 వరకు,
యోగం : సిద్ధం ఉ7.42 వరకు,
తదుపరి సాధ్యం తె4.40 వరకు,
కరణం : వణిజ ఉ9.34 వరకు,
తదుపరి భద్ర రా8.27 వరకు,

వర్జ్యం : తె5.23నుండి,
దుర్ముహూర్తము : ఉ8.49 – 9.35 &
రా10.58 – 11.49,
అమృతకాలం : మ1.37 – 3.07,
రాహుకాలం : మ3.00 – 4.30,
యమగండo : ఉ9.00 – 10.30,
సూర్యరాశి : మకరం,
చంద్రరాశి : మీనం,
సూర్యోదయం : 6.33,
సూర్యాస్తమయం: 5.56,

*_నేటి మాట_*

*తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త !!*

ఈ భూమిపై స్వేచ్ఛగా నివసించడానికి మానవునిలో సహా సకల జీవరాశులకు సమాన హక్కులు ఇవ్వబడ్డాయి.
ఎవరూ ఎవరికీ బానిసలుగా ఉండాలని ఎక్కడా చెప్పలేదు…
సృష్టిలో సకల జీవ జాతులలో గొప్పది మానవ జాతి.
అన్ని జన్మల కంటెనూ మానవజన్మ అత్యున్నతమైనది.
కనుక సకల జీవుల సంరక్షణ భారం మావునికి అప్పగించబడింది.
తద్వారా మానవుని సంరక్షణ భారం  భగవంతుడు తీసుకున్నాడు..
అయితే మానవుడు ఏం చేస్తున్నాడు! తనకు మిగతా జాతులు కన్నా ఎక్కువ బలం, అధికారం ఉందని తనకు ఇష్టం వచ్చినట్లు వాటి పట్ల హింసకు పాల్పడుతున్నాడు.
తనకు మాత్రం చిన్న నొప్పి అయితే ‘ అమ్మో…. బాబోయ్ … చచ్చిపోతున్నాను..’ అంటూ కేకలు వేస్తాడు! దేవుణ్ణి తూలనాడుతుంటాడు.

నీకైతే నొప్పా!? వాటికి లేదా నొప్పి?? దేవుడు నికొక్కడికే బంధువా! నీ గోడు మాత్రమే విని వాటి గోడు నిర్లక్ష్యం చేయడానికి!!? బలంతో భారం వహించమని చెప్తే బాధలకు గురి చేస్తావా??!
నీ హింస పూరిత చర్యలతో ఆ మూగ జీవుల ఆర్తనాదాలు నీ చెవులకు మంగళ వాయిద్యాలుగా వినిపిస్తున్నట్లు అనుభూతి చెందుతున్నావేమో!!
గుర్తు పెట్టుకో, ఏదో ఒక రోజు నీకు కూడా అదే గతి పట్టవచ్చును!!
అప్పుడు నీ గోడు వినేందుకు భగవంతుడు సహితం చెవులు మూసుకుని నిద్రపోతాడు!! తస్మాత్ జాగ్రత్త!!…

*_🌷శుభమస్తు🌷_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏