నేటి పంచాంగం.. నేటి మాట..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌿పంచాంగం🌿
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 26 – 02 – 2024,
వారం … ఇందువాసరే ( సోమవారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం – శిశిర ఋతువు,
మాఘ మాసం – బహళ పక్షం,

తిథి : విదియ రా9.22 వరకు,
నక్షత్రం : ఉత్తర రా2.54 వరకు,
యోగం : ధృతి మ2.25 వరకు,
కరణం : తైతుల ఉ8.18 వరకు,
తదుపరి గరజి రా9.22 వరకు,

వర్జ్యం : ఉ8.17 – 10.03,
దుర్ముహూర్తము : మ12.36 – 1.22 &
మరల మ2.55 – 3.41,
అమృతకాలం : సా6.55 – 8.41,
రాహుకాలం : ఉ7.30 – 9.00,
యమగండo : మ12.00 – 1.30,
సూర్యరాశి : కుంభం,
చంద్రరాశి : కన్య,
సూర్యోదయం : 6.26,
సూర్యాస్తమయం: 6.01,

*_నేటి మాట_*

*ప్రార్థన – ఫలితం*

నేటి మన భక్తి ఎలా వుంది అంటే…!!!
ఒక వ్రతం చేసినా, ఉపాసం చేసినా … వెంటనే ఫలితం కనబడాలి, అలా కాక పోతే… అప్పుడే దేవున్ని అయినా మారుస్తాం, లేకపోతే కోపం తో తిడతాం …
ఎవరైనా ఈ దేవుణ్ణి నమ్ముకొ, ఇట్టే పనులు అయిపోతాయి అంటే , చాలు అప్పుడే వెళ్తాం …

అమాంతం బిందెల కొలదీ నీరు పోసినంత మాత్రమున – మొక్క చెట్టుగా మారి ఫలాలను ఇచ్చేయదుగా!
దానికి కొంత సమయం అవసరం.

అలానే ప్రార్థన కూడా ఫలించడానికి కొంత సమయం తీసుకుంటుంది.
*మరి ఏమి చేయాలి???*
సహనం వహించాలి, మనం అనుకోగానే పనులు జరిగిపోవాలంటే కుదరదు, దేవుణ్ణి ప్రార్థించి ఆయనపై విశ్వాసము పెట్టుకోవాలి, ఆలస్యం అయినా తప్పకుండా ఆదుకుంటాడనే నమ్మకం వుండాలి…
ఉదా!!…
ఒక కటింగ్ షాప్ కి వెళ్లి, కటింగ్ చేయు అని కూర్చుంటాము…
అయ్యో ఏమి చేస్తాడో, నా తలపై ఎన్నింగాయాలు చెస్తాడో అని ఆలోచించం కదా…
చేసినంత సేపు ఆనందంగా కూర్చుని మై మరిచి పోతాము …
మరి ఆ విశ్వాసం భగవంతుని పై లేకపోతే ఆయన ఎలా ఫలితాన్ని అందిస్తాడు??…

*_🌿శుభమస్తు🌿_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏