నేటి పంచాంగం.. నేటి మాట..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌷పంచాంగం🌷
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 27 – 02 – 2024,
వారం … భౌమవాసరే ( మంగళవారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం – శిశిర ఋతువు,
మాఘ మాసం – బహళ పక్షం,

తిథి : తదియ రా11.22 వరకు,
నక్షత్రం : హస్త తె5.20 వరకు,
యోగం : శూలం మ2.55 వరకు,
కరణం : వణిజ ఉ10.22 వరకు,
తదుపరి విష్ఠి రా11.22 వరకు,

వర్జ్యం : మ12.08 – 1.54,
దుర్ముహూర్తము : ఉ8.43 – 9.29 &
మరల రా10.58 – 11.47,
అమృతకాలం : రా10.43 – 12.29,
రాహుకాలం : మ3.00 – 4.30,
యమగండo : ఉ9.00 – 10.30,
సూర్యరాశి : కుంభం,
చంద్రరాశి : కన్య,
సూర్యోదయం : 6.24,
సూర్యాస్తమయం: 6.01,

*_నేటి మాట_*

*మనకు భగవంతునిపై ఎలాంటి – విశ్వాసం వుండాలి??*
ఒక వ్యక్తి తన కొడుకుతో ఇంటికి తిరిగి వస్తున్నాడు…
వారు సముద్రంలో ఒక పడవలో ఉన్నారు,
అకస్మాత్తుగా పెద్ద తుఫాను వచ్చింది, తండ్రి యోధుడు, ప్రశాంతంగా ఉన్నాడు కానీ, కొడుకు చాలా భయపడ్డాడు, దాదాపు నిస్సహాయస్థితిలో జనా ఉన్నాడు.

వారిద్దరూ వెళ్తున్న పడవ చాలా చిన్నది, తుఫాను తీవ్రంగా ఉంది, ఏ క్షణంలోనైనా పడవ మునిగిపోయే అవకాశం ఉంది!!…
కొడుకు ఎంత భయపడుతున్నాడో, తండ్రి అంత మౌనంగా – ఏమీ జరగనట్లుగా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా కూర్చున్నాడు.

కొడుకు వణికిపోతూ తండ్రితో ఇలా అన్నాడు.. ”భయంగాలేదా.. ఇదే మన జీవితంలో చివరి క్షణం కావచ్చు , మనం ఒడ్డుకు చేరుకునేలా కనిపించడం లేదు.. ఈ క్షణంలో ఏదైనా అద్భుతం మాత్రమే మనల్ని రక్షించగలదు, లేదంటే మనం చనిపోతాం!”

కెరటాలు బలంగా పడవపై కొట్టడంతో ఒక్కసారిగా, “నీకు భయం వేయట్లేదా?” అని అరిచాడు.

కొడుకు అరుపులు విన్న తండ్రి నవ్వుతూ తన కోశం లోంచి కత్తిని తీశాడు, ఇప్పుడు కొడుకు మరింత కంగారు పడ్డాడు, తండ్రి ఏమి చేస్తున్నాడు? అని అనుకున్నాడు!!.

తండ్రి ఆ కత్తిని కుమారుడి మెడకు అతి దగ్గరగా తీసుకొచ్చాడు.
చాలా దగ్గరగా, కత్తి – మెడ మధ్య కేవలం సన్నని వెంట్రుక అంతరం మాత్రం మిగిలిఉంది, కత్తి దాదాపు అతని మెడకు తాకింది.

“ఇప్పుడు భయం కలగడం లేదా??“ అని అడిగాడు, తండ్రి…
కొడుకు నవ్వడం మొదలుపెట్టి, “నేనెందుకు భయపడాలి, నువ్వు నా తండ్రివి, కత్తి నీ చేతిలో ఉంది, నువ్వు నన్ను ఎప్పటికీ బాధించవని నాకు తెలుసు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావనీ నాకు తెలుసు” అన్నాడు, తండ్రి కత్తిని వెనక్కి పెట్టి,
“ఇదే నా సమాధానం కుమారా!
భగవంతుడు నన్ను ప్రేమిస్తున్నాడని, తుఫాను ఆయన చేతిలో ఉందని నాకు తెలుసు.
కాబట్టి, ఏది జరగబోయినా అది మంచికే.
మనకు మనుగడ ఉన్నామంచిదే; లేకున్నామంచిదే, ప్రతిదీ ఆయన చేతుల్లోనే ఉంది, ఆయన తప్పు చేయడు అన్నాడు.

భగవంతుని పై నమ్మకాన్ని వృద్ధి చేసుకోవాలి, అది మన సమస్త జీవితాన్ని మార్చగలదు.
పూర్తిగా విశ్వసించాలి, ఎందుకంటే సందిగ్ధత పనిచేయదు కదా!!!

*_🌷శుభమస్తు🌷_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏