నేటి పంచాంగం.. నేటి మాట..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌹పంచాంగం🌹
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 01 – 03 – 2024,
వారం … భృగువాసరే ( శుక్రవారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం – శిశిర ఋతువు,
మాఘ మాసం – బహళ పక్షం,

తిథి : షష్ఠి తె3.15 వరకు,
నక్షత్రం : స్వాతి ఉ9.17వరకు,
యోగం : ధృవం మ2.59 వరకు,
కరణం : గరజి మ2.50 వరకు,
తదుపరి వణిజ తె3.15 వరకు,

వర్జ్యం : మ3.10 – 4.51,
దుర్ముహూర్తము : ఉ8.42 – 9.29,
మరల మ12.35 – 1.22,
అమృతకాలం : రా1.16 – 2.57,
రాహుకాలం : ఉ10.30 – 12.00,
యమగండo : మ3.00 – 4.30,
సూర్యరాశి : కుంభం,
చంద్రరాశి : తుల,
సూర్యోదయం : 6.24,
సూర్యాస్తమయం: 6.02,

*_నేటి మాట_*

*దైవమే సర్వభూతాంత రాత్మ అని ఎలా తెలుసుకోవాలి???*

అర్జునికి శ్రీ కృష్ణ పరమాత్ముడు తనయందే సర్వ చరాచర ప్రపంచమును చూపెను, విశ్వమంతా సూక్ష్మ రూపమున ఉన్న మర్మమును అర్జునునకు దర్శించిన తరువాత నే తెలిసెను!!…

కాని దానికి ముందు కృష్ణుడు సర్వాంతర్యామి అని అర్జునుడు తెలిసికొన లేదు,
భగవంతుడు సర్వాంతర్యామి అని తెలుసుకోవడం కష్టం…

కానీ …
జీవులందరుయందూ, అదే విధముగా, ప్రకృతి అంతయూ పరమాత్మ స్వరూపమే!
అందరియందు ప్రేమ పలు విధాలుగా ప్రకాశించుచునే యుండును, ఇది శాశ్వతము మారేది కాదు.

కానీ, వినియోగ విధానమును బట్టి వివిధ నామములు అనగా వాత్సల్యమనియు, అనురాగ మనియు, భక్తి అనియు, ఇష్టమని, అనేక పేర్లతో కన్పించుచుండును.

కానీ ప్రేమ స్వరూపము మారదు, అందరిలోనూ దైవం చూసి ప్రేమ భావమును పెంచుకుంటే, భగవంతుడు సర్వభూతాంత రాత్మ అను యదార్ధము మనకు స్పష్టమగును…

*_🌹శుభమస్తు🌹_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏