నేటి పంచాంగం.. నేటి మాట…

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌸పంచాంగం🌸
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 02 – 03 – 2024,
వారం … స్థిరవాసరే ( శనివారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం – శిశిర ఋతువు,
మాఘ మాసం – బహళ పక్షం,

తిథి : సప్తమి తె3.34 వరకు,
నక్షత్రం : విశాఖ ఉ10.32వరకు,
యోగం : వ్యాఘాతం మ2.19 వరకు,
కరణం : విష్ఠి మ3.24 వరకు,
తదుపరి బవ తె3.34 వరకు,

వర్జ్యం : మ2.39 – 4.19,
దుర్ముహూర్తము : ఉ6.21 – 7.55,
అమృతకాలం : రా12.34 – 2.12,
రాహుకాలం : ఉ9.00 – 10.30,
యమగండo : మ1.30 – 3.00,
సూర్యరాశి : కుంభం,
చంద్రరాశి : వృశ్చికం,
సూర్యోదయం : 6.22,
సూర్యాస్తమయం: 6.02,

*_నేటి మాట_*

*భక్తుని పై – భగవంతుని అనుగ్రహం – ఎలా కలుగుతుంది???*

ఈరోజుల్లో మనందరికీ తెలిసినది ఏమంటే, పూజలు, నోములు, వ్రతాలు, చేస్తే భగవద్ అనుగ్రహం పొందవచ్చు అని, అలా అయితే అందరం జీవన్ముక్తులమైనట్లే…

సముద్రంనుండి నీరు వేడిమికి ఆవిరై పైకిపోవుటచేత మేఘములు ఏర్పడి వర్షాలు పడి పంటలు పండుచున్నాయి…

నీరే పైకి ఆవిరి కాకున్నా వర్షాలు పడే అవకాశం లేదు,
అలాగే మనం చేసే ప్రార్థనలు పైకి చేరితేనే భగవంతుని ఆశిస్సులు కిందికి రాగలవు…

భగవంతుడున్నాడనే స్పృహ లేకుండా నిత్యం తీరిక లేని వారివలే, సంసార సాగరంలో, మునిగి ఉంటూంటే ఇంకా, భగవద్ అనుగ్రహం ఎక్కడి నుండి వస్తుంది?…

సరైన సాధన చేయకుండా మీనమేషాలు లెక్కపెడుతూ కూర్చుంటే వచ్చేవి చింతలే తప్ప ఇంకేమీ రావు…

నిత్యం సాధన చేయాలి, భగవంతుడిని అనుభవించాలి, ఏది జరిగినా ఆయన దయ అన్న భావం వుండాలి, అపుడే భగవదనుగ్రహం కలుగుతుంది…🙏

*_🌸శుభమస్తు🌸_*
🙏సమస్త లోకా: సుఖినోభవంతు🙏