నేటి పంచాంగం.. నేటి మాట..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌻పంచాంగం🌻
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 03 – 03 – 2024,
వారం … భానువాసరే ( ఆదివారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం – శిశిర ఋతువు,
మాఘ మాసం – బహళ పక్షం,

తిథి : అష్టమి తె3.25 వరకు,
నక్షత్రం : అనూరాధ ఉ11.18వరకు,
యోగం : హర్షణం మ1.16 వరకు,
కరణం : బాలువ మ3.29 వరకు,
తదుపరి కౌలువ తె3.25 వరకు,

వర్జ్యం : సా 4.58 – 6.35,
దుర్ముహూర్తము : సా4.29 – 5.16,
అమృతకాలం : రా2.40 – 4.17,
రాహుకాలం : సా4.30 – 6.00,
యమగండo : మ12.00 – 1.30,
సూర్యరాశి : కుంభం,
చంద్రరాశి : వశ్చికం,
సూర్యోదయం : 6.21,
సూర్యాస్తమయం: 6.03,

*_నేటి మాట_*

*దైవానుగ్రహo ఎలా ప్రాప్తిస్తుంది???*

ఇది తెలియక ఎంతో మంది ఈరోజుల్లో సతమతమవుతున్నారు,
ఒకరు గొప్పగా పూజలు వ్రతాలు నోములు నిర్వహించడం,
ఇంకొకరు ఆడంభరం చేసి, అందరి మెప్పు పొందాలని ప్రయత్నించడం,
ఇలా ఎవరికి తెలిసిన రీతిగా వారు చేయడం జరుగుతుంది…
కానీ అసలు విషయం తెలుసుకోవాలంటే !!!….

ఒకనాడు నిండు సభలో ద్రౌపదిని పరాభవించుటకు దుర్యోధన, దుశ్శాసనులు పూనుకున్నప్పుడు…
ఆమె ‘కృష్ణా! కృష్ణా!’ అని ప్రార్థించగా కృష్ణుడా ప్రార్థనను విని ‘ఆమెను తాను రక్షించడానికి ఏ పవిత్ర కర్మలు చేసింది?’ అని యోచించాడు, శ్రీ కృష్ణుడు…

పరమాత్మకి అప్పుడు ఒక సంఘటన స్ఫురించిందట..!!
ఒక భోగి పండుగనాడు ద్రౌపది, సత్యభామ, రుక్మిణి మొదలగువారు పరివేష్టించి యుండగా, కృష్ణుడు చెరుకును కోయడానికి ప్రయత్నించి నప్పుడు అతని వేలు కోసుకుని రక్తం స్రవించింది…
దానిని నివారించడానికి రుక్మిణి, సత్యభామలు దాసీలను రక రకాలుగా ఆజ్ఞాపిస్తూ తొందరపడసాగారట…

కాని, ద్రౌపది వెంటనే తాను కట్టుకున్న నూతన వస్త్రాన్ని చించి కృష్ణుని వ్రేలికి కట్టింది…

ఆనాడు ద్రౌపది చేసిన త్యాగానికి ఫలితంగా కృష్ణుడు ఆమెకు అక్షయ వలువలిచ్చి ఆమె మానం కాపాడాడు…

కనుక, మనము చేసే కర్మలనుబట్టి భగవంతుడు ఫలాన్ని అందిస్తాడు.
త్యాగం వల్లనే దైవానుగ్రహాన్ని పొంద డానికి వీలౌతుంది…
అంతే కానీ మనం చేసే పూజలు వ్రతాలు నోములు వీటికి కాదు …
ఎదుటి మనిషికి సహాయం చేయడం, ఆకలిగొన్న వారికి అన్నం పెట్టడం, ఏదీ వీలు కానప్పుడు కనీసం వారితో ప్రేమగా మాట్లాడడం వీటి వల్ల … బగ్వద్ అనుగ్రహం తప్పకుండా దొరుకుతుంది…

*_🌻శుభమస్తు🌻_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏