నేటి పంచాంగం.. నేటి మాట..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌺పంచాంగం🌺
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 07 – 03 – 2024,
వారం … బృహస్పతివాసరే ( గురువారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం – శిశిర ఋతువు,
మాఘ మాసం – బహళ పక్షం,

తిథి : ద్వాదశి రా10.17 వరకు,
నక్షత్రం : ఉత్తరాషాఢ ఉ9.50 వరకు,
యోగం : పరిఘము రా2.36 వరకు,
కరణం : కౌలువ ఉ11.12 వరకు,
తదుపరి తైతుల రా10.17 వరకు,

వర్జ్యం : మ1.37 – 3.08,
దుర్ముహూర్తము : ఉ10.13 – 11.00 &
మరల మ2.55 – 3.42,
అమృతకాలం : రా10.43 – 12.14,
రాహుకాలం : మ1.30 – 3.00,
యమగండo : ఉ6.00 – 7.30,
సూర్యరాశి : కుంభం,
చంద్రరాశి : మకరం,
సూర్యోదయం : 6.19,
సూర్యాస్తమయం: 6.03,

*_నేటి మాట_*

*ఆధ్యాత్మిక ఉన్నతికి సోపానాలు…!!*
వేదాంతం లౌకిక జీవనంలో దేన్నీ వద్దని చెప్పటం లేదు, అన్నిట మితంగా ఉండమంటుంది…
మితాహార వ్యవహారాల ద్వారా ఆధ్యాత్మిక ఉన్నతికి సాధన సులభం అవుతుంది.

రోజులో నాల్గవ వంతు నిద్రతో సరిపెట్టుకోగలిగితే నిద్రను జయించినట్లే,
ప్రతి పూటా అర్ధాకలితో భోజనం పూర్తి చేయగలిగితే ఆకలిని జయించినట్లే,
ఏదైనా పనిచేస్తూ మధ్యలో అన్నంతింటే తిరిగి వెంటనే ఆ పని కొనసాగించేలా ఉండాలి,
తిని ఎవరింటికైనా వెళ్తే మళ్ళీ భోజనం చేయగలిగినంత మాత్రమే తింటే అది నిత్యోపాసన అవుతుంది!!…

మానవుడు ప్రధానంగా రుచికి, నిద్రకి లొంగిపోతున్నాడు.
అది తగ్గించుకోవాలి, ఉపవాసం పేరుతో భోజనం మానేస్తే దేవుడికి ఏం లాభం…
మన మనసును అవసరమైనప్పుడే అదుపులో ఉంచుకోవడం మనోనిగ్రహం అవుతుంది.
అంతేగాని మనసును అసలు కదలకుండా చేయటం ఎవరివల్లా కాదు…
భక్తి పేరుతో చాదస్తాలు చేసి, దేవుడి పేరుతో వికృత పోకడలు చేస్తే అది మన ఆరోగ్యానికి హాని చేసుకోవడమే … అంతే కానీ అది ఏమాత్రం ఆధ్యాత్మికత కాదు…

*_🌺శుభమస్తు🌺_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏