నేటి పంచాంగం.. నేటి మాట..

🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
🌹పంచాంగం🌹
శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు,

తేది … 10 – 3 – 2024,
వారం … భాను వాసరే (ఆది వారము),
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం
శిశిర ఋతువు,
మాఘ మాసం,
బహుళ పక్షం,

తిధి : ఆది అమావాస్య మ 3.34 వరకు
తదుపరి ఫాల్గుణ శు పాడ్యమి
నక్షత్రం : పూర్వాభాద్ర తె 3.45 వరకు
తదుపరి ఉత్తరాభాద్ర
యోగం: సాధ్యం సా 5.33 వరకు
తదుపరి శుభం
కరణం : నాగవం మ 3.34 వరకు
కింస్తుఘ్నం రా 2.20 వరకు
అమృతకాలం : రా 8.19 – 9.48 వరకు
దుర్ముహూర్తం : సా 4.29 – 5.16 వరకు
వర్జ్యం : ఉ 11.24 – 12.53 వరకు
రాహుకాలం : సా 4.30 – 6.00 వరకు
యమగండకాలం : మ 12.00 – 1.30 వరకు
సూర్యరాశి : కుంభం
చంద్రరాశి : కుంభం
సూర్యోదయం : 6.17
సూర్యాస్తమయం : 6.04

ద్వాపర యుగాది

*నేటి మాట*

ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ
శ్రీ పాద శ్రీ వల్లభ పరబ్రహ్మాణేినమః

శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములో పీఠికాపుర మహారాజు పరిస్థితి దీనంగా మారగా, రాజపురోహితుడు సుందరరామశర్మ ఇంట పరిస్థితులు కూడా బాగుండలేదు.

బంగారప్ప: సౌమ్యమనస్క అయిన సుందరరామశర్మ ఇల్లాలు ఉన్నట్టుండి వంటపాత్రలతో అతని నెత్తిని మోదుచుండెను.

శర్మ కుమారుడు, త్రాడునొకదానిని తెచ్చి తన తండ్రిని స్తంభమునకు కట్టివేయుచుండెను.

శర్మ కుమార్తె తన తండ్రి మీద ఉమ్మి వేసి, తన పాదరక్షలతో ముఖము వాయుగుట్టుచుండెను.

శర్మ భోజనము కోరినప్పుడు ఎండు గడ్డిని తెచ్చి తినమని పెట్టుచుండిరి. తినకపోయిన వాతలు కూడా పెట్టబడునని బెదిరించుచుండిరి.

శర్మ నియోగించిన బ్రాహ్మణులు మాత్రము దత్తపురాణమును పారాయణ చేయుచుండిరి.

పారాయణానంతరము వారు భోజనము చేసిన తదుపరి భూతప్రేత పిశాచములు ఇంట తిరుగాడుచూ, భయభ్రాంతులను చేయుచుండెను.

కొందరు స్త్రీలు వికృతముగా నవ్వుచూ,
నీవు ఏ రాజునకు పౌరోహిత్యము చేయుచున్నావో,
ఆ వంశములోని పై తరముల వారు,
పరాయి స్త్రీలను మాతృసమానులుగా ఎంచక, బలవంతముగా అనుభవించిరి.
ఆ స్త్రీలు ఎవరో కాదు! మేమే!
మా భర్తలతో మమ్ము సుఖముగా సంసారం చేసుకొనీయక మహాపరాధములు చేసిరి.

మేము ఈ రాజవంశము మీద పగ తీర్చుకోదలచితిమి.

మీరు మాకు పిండ ప్రధానము చేసినంత మాత్రమున,
మాకు సద్గతులు ఏమియును కలుగవు.

రాజద్రవ్యమును పొంది, భూరిదక్షిణలను పొంది,
ద్రవ్యశుద్ధి లేని ఆ ద్రవ్యమునకు అధికారులైన వారు,
మీరు గనుక,
మేము మీ కుటుంబములను కూడా వేధించదలచితిమి.
అని పలుకుచుండిరి

పారాయణ చేయు బ్రాహ్మణులను, సుందర రామశర్మయును, మహారాజును, కూడా భయభ్రాంతులై,
దత్తపురాణము పారాయణ చేసిన శుభఫలములు సిద్ధించునని విన్నాము,
కానీ ఇది ఏమి వైపరీత్యము?

ఈ పురాణ పఠనము వలన శంకరుడు ప్రసన్నుడై,
తన భూత ప్రేత పిశాచ గణములతో సహా కరాళనృత్యం చేయుచున్నాడు.

దత్తపురాణ పఠనమున,
విష్ణువు ప్రసన్నుడై,
తమకు మాత్రము భోజన సదుపాయం లేకుండా చేసి,
అన్నార్తులై వచ్చిన బిచ్చగాళ్లకు అనుగ్రహమును ప్రసాదించుచున్నాడు.

బ్రహ్మదేవుడు ప్రసన్నుడై అశ్లీలములు నింద్యములు అయిన వాక్కులతో తమను వేధించు వారిని సృష్టించినాడు.

ఆహా! దత్తపురాణ పఠనము వలన ఈ పద్ధతిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రసన్నులై,

వాక్కుల చేత హింసించి, చావటానికి కూడా వీలు లేకుండా విష్ణు తత్వముతో రక్షించి,
భూతప్రేత పిశాచములకు ఆనందమును కలిగించెడి నాట్యకళలతో జీవచ్ఛవములుగా చేసేటువంటి దత్తభక్తి మాకు జన్మజన్మలకు వలదు మహాప్రభో!
అని పరితపించుచుండిరి.

సర్వం శ్రీపాద శ్రీవల్లభ చరణారవిందమస్తు🙏