నేటి పంచాంగం.. నేటిమాట…

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌺పంచాంగం🌺
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 13 – 03 – 2024,
వారం … సౌమ్యవాసరే ( బుధవారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం – శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం – శుక్ల పక్షం,

తిథి : తదియ ఉ8.37 వరకు,
నక్షత్రం : అశ్విని రా11.18 వరకు,
యోగం : బ్రహ్మం ఉ8.22 వరకు,
తదుపరి ఐంద్రం తె5.40 వరకు,
కరణం : గరజి ఉ8.37 వరకు,
తదుపరి వణిజ రా7.38 వరకు,

వర్జ్యం : రా7.31 – 9.02,
దుర్ముహూర్తము : ఉ11.45 – 12.33,
అమృతకాలం : సా4.30 – 6.00,
రాహుకాలం : మ12.00 – 1.30,
యమగండo : ఉ7.30 – 9.00,
సూర్యరాశి : కుంభం,
చంద్రరాశి : మేషం,
సూర్యోదయం : 6.16,
సూర్యాస్తమయం: 6.04,

*_నేటి మాట_*

*పాపాన్ని పుణ్యం చేత తగ్గించ గలమా???*
ఈరోజుల్లో చాలా మంది చెప్పేది, ఇదే …
మీరు పుణ్యకార్యాలు చేయండి, పాపాలు పోతాయి అని…
కానీ అది తప్పు, ముళ్ళ మొక్కల బీజాలనూ, పళ్ల మొక్కల బీజాలనూ కలిపి ఎంత బాగా గిలక రించి విత్తి నప్పటికీ, ముళ్ళ విత్తనం ముళ్ళమొక్కగానే, పళ్ల విత్తనం పళ్ల మొక్క గానే పెరుగుతుంది.

*మరి దీనికి పరిహారము ఏమిటి??*
ఉంది….
మన ఆదాయంలో దానధర్మాలకు ఖర్చు పెడితే, అంతమేరకు ఇన్కంటాక్స్ రిబెట్ ఇస్తారు, వారు విధించిన పన్ను తక్కువ చేస్తారు…

అలానే, మనం మనస్సు పెట్టి నామస్మరణ చేస్తే ఇంత,
నామ జపం చేస్తే మరికొంత, లిఖిత జపం చేస్తే ఇంకా కొంత,
ధ్యానం చేస్తే ఇంత అని తగ్గిస్తారు.
అయితే పూర్తిగా తక్కువ అవదు, మిగిలిన ది అనుభవించాలి…

*అట్లయితే ఈ భగవద్ దర్శనాల వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటి?*

ఉరిశిక్ష పడిన ఖైదీ కి క్షమాభిక్ష రాష్ట్ర పతి ప్రసాదిఁచవచ్చు…
జీవిత ఖైదీగా మార్చవచ్చు, అవతార మూర్తి యొక్క అనుగ్రహం, దుష్కార్యముల ఫలాల తీవ్రతను తగ్గిస్తుంది…

దర్శన స్పర్శన వల్ల శాశ్వత మైన సంతోషం ఉండదు…

అందుచేత ఉనంచోటనే భగవంతుణ్ణి దర్శించేటట్లు మారాలి, అంతర్ దృష్టిని పెంపొందించు కావాలి, అప్పుడే అన్నీ సాధ్యమవుతాయి…

*_🌺శుభమస్తు🌺_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏