నేటి పంచాంగం…

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🥀పంచాంగం🥀
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 14 – 03 – 2024,
వారం … బృహస్పతివాసరే ( గురువారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం – శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం – శుక్ల పక్షం,

తిథి : చవితి ఉ6.38 వరకు,
తదుపరి పంచమి తె5.02 వరకు,
నక్షత్రం : భరణి రా10.15 వరకు,
యోగం : వైధృతి తె3.08 వరకు,
కరణం : భద్ర ఉ6.38 వరకు
తదుపరి బవ సా5.50 వరకు,
ఆ తదుపరి బాలువ తె5.02 వరకు,

వర్జ్యం : ఉ8.29 – 10.00,
దుర్ముహూర్తము : ఉ10.11 – 10.58,
మరల మ2.56 – 3.43,
అమృతకాలం : సా5.39 – 7.11,
రాహుకాలం : మ1.30 – 3.00,
యమగండo : ఉ6.00 – 7.30,
సూర్యరాశి : కుంభం,
చంద్రరాశి : మేషం,
సూర్యోదయం : 6.14,
సూర్యాస్తమయం: 6.06,

*_నేటి మాట_*

*సేవ*
ఈరోజుల్లో అందరి నోట వినేది ఈ సేవ చేసాను, ఆ సేవ చేసాను అని…
ఈ సమస్తము భగవంతునికి చెందినదే…
నేడు మనం అనుభవిస్తున్న సకలము అయన ఇచ్చినదే,
మరి అయనకు చెందిన దానిని అయనకు అందించేటప్పుడు, ఈ సమర్పణలో మనము అయనకు ఏదో ఉపకారము చేసినట్లు గర్వపడడం, డప్పు కొట్టుకోవడం ఎందుకు?

భగవంతుని నిమిత్తం సేవ చేయడం గొప్ప అదృష్టంగా భావించాలి!!…

అలాంటపుడు సేవ చేసిన తర్వాత ఇంత చేసాము, అంత చేసాము అని ఎప్పుడూ గర్వపడకూడదు!!…

చేసిన సేవకు ప్రతిఫలం ఆశించడం కానీ లేదా ఇంకేదో ఇవ్వమని దైవమును అడగడం కానీ చేయకూడదు…
సేవను దేవుడు మనకు అప్పజెప్పిన బాధ్యతగా భావించాలి…
ఏదైనా సేవా కార్యం చేసినపుడు అణకువతో , గౌరవంతో గర్వపడకుండా చేయాలి… కృతజ్ఞతతో ఉండాలి…

ఎందుకంటే … ” సేవను పొందిన వ్యక్తి రూపంలో మన సేవను అంగీకరించినది ఆ భగవంతుడే కాబట్టి!!.. ”

*_🥀శుభమస్తు🥀_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏