నేటి పంచాంగం.. నేటి మాట….

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌸పంచాంగం🌸
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 16 – 03 – 2024,
వారం … స్థిరవాసరే ( శనివారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం – శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం – శుక్ల పక్షం,

తిథి : సప్తమి రా2.48 వరకు,
నక్షత్రం : రోహిణి రా9.09 వరకు,
యోగం : ప్రీతి రా10.57 వరకు,
కరణం : గరజి మ3.15 వరకు,
తదుపరి వణిజ రా2.48 వరకు,

వర్జ్యం : మ1.15 – 2.50,
మరల రా2.46 – 4.23,
దుర్ముహూర్తము : ఉ6.12 – 7.47,
మరల మ12.33 – 1.20,
అమృతకాలం : సా5.59 – 7.34,
రాహుకాలం : ఉ9.30 – 10.30,
యమగండo : మ1.30 – 3.00,
సూర్యరాశి : మీనం,
చంద్రరాశి : వృషభం,
సూర్యోదయం : 6.14,
సూర్యాస్తమయం: 6.06,

*_నేటి మాట_*

*సర్వదా సర్వకాలేషు, సర్వత్ర హరి చింతనం*

గడియారంలో మూడు ముళ్లుంటాయి, ఒకటి బిరబిరా ‘క్విక్’ గా తిరుగుతుంది, అదే సెకన్ల ముల్లు.
అరవై సెకన్లు అయినప్పుడు, ఒకనిముషం అవుతుంది…
అరవై నిముషాలు అయినప్పుడు గంట అవుతుంది…

అయితే మనం గంటల ముల్లుకే ప్రధాన్య మిస్తాముకానీ, సెకన్ల ముల్లును పట్టించుకోము…
సెకన్ల ముల్లు స్పీడుగా తిరుగుతున్నప్పటికీ, దానికి మనం విలువ ఇవ్వం.
అదే విధంగా మీరు ప్రొద్దున్న, సాయంకాలం, ఏదో కొద్ది సేపు మాత్రమే భగవంతుణ్ణి తలచుకుంటే దానికి అంతగా విలువ ఉండదు.
కాలం విలువ సెకన్ల నుండి గంటలలోకి జరిగి పోతుంది, కనుక ప్రతీ సెకండూ విలువైనదిగా గ్రహించాలి…

సర్వదా సర్వకాలేషు, సర్వత్రా భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండాలి, అదే గంటల ముల్లు వలె చాల ముఖ్యమైనది…

*_🌸శుభమస్తు🌸_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏