నేటి పంచాంగం… నేటి మాట.

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
☘️పంచాంగం☘️
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 18 – 03 – 2024,
వారం … ఇందువాసరే ( సోమవారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం – శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం – శుక్ల పక్షం,

తిథి : నవమి రా2.28 వరకు,
నక్షత్రం : ఆర్ధ్ర రా9.51 వరకు,
యోగం : సౌభాగ్యం రా8.13 వరకు,
కరణం : బాలువ మ2.45 వరకు,
తదుపరి కౌలువ రా2.28 వరకు,

వర్జ్యం : ఉ.శే.వ.7.30 వరకు,
దుర్ముహూర్తము : మ12.32 – 1.20,
మరల మ2.55 – 3.43,
అమృతకాలం : ఉ11.36 – 1.14,
రాహుకాలం : ఉ7.30 – 9.00,
యమగండo : ఉ10.30 – 12.00,
సూర్యరాశి : మీనం,
చంద్రరాశి : మిథునం,
సూర్యోదయం : 6.11,
సూర్యాస్తమయం: 6.06,

*_నేటి మాట_*

*భగవంతుడు – భక్తుడు*

భగవంతుని గుర్తించి మనము స్వీకరిస్తే ఆయన ఉంటాడు, కనబడుతాడు…
ఆయనను తిరస్కరిస్తే ఆయన ఉండడు, కాక కనబడడు కూడా…
హిరణ్యకశిపుడు హరి ఎక్కడా లేడన్నాడు, కనుక ఎక్కడా కనబడలేదు, అతనికి…
అంతటా ఉన్నాడని ప్రహ్లాదుడు విశ్వసించాడు…
కాబట్టి స్తంభము నుండి వెలిసి, ప్రహ్లాదుని విశ్వాసం సత్యమని నిరూపించాడు…
అంతే కానీ, హిరణ్య కశిపుని సవాలు ఎదుర్కోవడం కోసమని స్తంభములో ప్రవేశించడం కాదు…

అన్నిటా, అంతటా నిండి ఉన్నట్లే, ఆ స్తంభములో కూడా ఆయన ఎప్పుడూ ఉన్నాడు…
ఆ క్షణంలో తన ఉనికి ప్రదర్శించాడు, అంతే!…

సాధు సత్పురుషులు, మహర్షులు, ఆర్తితో ప్రార్ధించినపుడు, భగవంతుడు అవతరిస్తాడు…

*ఆయన కర్తవ్యాలు మూడు…!!!*

వేద రక్షణ,
ధర్మ రక్షణ,
భక్త రక్షణ…

నిశ్చలమైన విశ్వాసము, నిర్భయం, నిరహంకారం, సద్గుణం, ఇవి లేకుండా, ఆడంబరంగా పూజ చేస్తే, వ్యర్థమే… కాలము, శక్తీ, అన్నీ వృధా అవుతాయి…

ఇలాంటి సందర్భంలో మనము పవిత్ర గ్రంధాల నుండీ, పురాణముల నుండి, ఉపనిషత్తులనుండి, ప్రసంగాల నుండీ మనము పొందుతున్న లాభమేమిటి?…

వీటి మూలంగా మనమైనా బాగు పడ్డామా? లేక చదివితేనే పుణ్యము వస్తుంది, అనుకొంటే మనకన్నా ముందు టేబురికార్డులకు, మన సెల్లులకు ముందుగా పుణ్యం వస్తుంది, అవి నిత్యం పటిస్తున్నాయి కాబట్టి…

భగవంతుని దర్శన భాగ్యం పొందిన మనము ఎంతవరకు పురోగమించాము?
దర్శనమాత్రమునే పుణ్యము వస్తుంది, మోక్షానికి అర్హత వస్తుంది అనుకుంటే, మనకన్నా ముందు, నిత్యం ఆయన కోవెలలో ఉన్న చీమలకు, దోమలకు, కీటకాలకు వస్తుంది…
ఎందుకనగా అవి నిత్యం ఆయనను అంటిపెట్టుకుని ఉంటున్నాయి కాబట్టి…

ఆయన దగ్గర నుంచి పారమార్థిక జీవిత రహస్యం , తెలుసుకున్న దానికి నిదర్శనంగా మన జీవన సరళిలో ఏదైనా మంచి మార్పు కన పడాలి…
మనలోనుండి మధుర భాషణం, విజయ, పరాజయాలకు పొంగని, కృంగని ఆత్మ నిగ్రహం మనము ప్రదర్శించాలి…
ఇవన్నీ మన భక్తికి సంకేతాలు, లేశమైన అహంభావము లేకుండా, భగవంతుని శరణాగతి పొందాలి…
అప్పుడే మనము భక్తులు అని పించుకోగల అర్హత పొంద గలుగుతాము…

*_🌺శుభమస్తు🌺_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏