నేటి పంచాంగం. నేటి మాట..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🍁పంచాంగం🍁
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 21 – 03 – 2024,
వారం … బృహస్పతివాసరే ( గురువారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం – శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం – శుక్ల పక్షం,

తిథి : ద్వాదశి తె5.36 వరకు,
నక్షత్రం : ఆశ్రేష రా2.30 వరకు,
యోగం : సుకర్మ రా7.02 వరకు,
కరణం : బవ సా4.51 వరకు,
తదుపరి బాలువ తె5.36 వరకు,

వర్జ్యం : మ2.22 – 4.06,
దుర్ముహూర్తము : ఉ10.07 – 10.55,
మరల మ2.55 – 3.43,
అమృతకాలం : రా12.46 – 2.30,
రాహుకాలం : మ1.30 – 3.00,
యమగండo : ఉ6.00 – 7.30,
సూర్యరాశి : మీనం,
చంద్రరాశి : కర్కాటకం,
సూర్యోదయం : 6.10,
సూర్యాస్తమయం: 6.06,

*_నేటి మాట_*

*భక్తి తో – ఏమిటి లాభం*

” దేవునిపై భక్తి అనేది పార్ట్ రసం టైమ్ లా చేసే ఉద్యోగం కాకూడదు.”
ఏదో పండగ పూట భక్తి, విశ్వాసాలు చూపించి అటు తరువాత వదిలేయకూడదు…

భక్తి అనేది నిరంతరం సాగాల్సిన ప్రక్రియ.
అది మీ సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు మొదలగు ద్వంద్వాల సమయాలలో స్థిరంగా ఉండాలి.
“సతతం యోగినః” అని గీత ప్రకటిస్తుంది…
యోగులయినవారు భగవంతునితో నిరంతరం మమేకమై ఉంటారు.
కానీ నేడు మానవులు ఉదయం పూట యోగులుగా ఉంటారు కానీ మధ్యాహ్ననానికి భోగులుగా సాయంత్రానికి రోగులుగా మారిపోతున్నారు.
నిజమైన భక్తుడు ఎల్లవేళలా భగవంతునిలో లీనమై ఉండాలి.
అన్ని కర్మలను భగవంతునికి నైవేద్యం చేస్తూ ఉండాలి…

గురువుగా, విద్యార్థిగా, ఉద్యోగిగా, సేవకునిగా మీరు చేసే ఏ చిన్న కార్యమైనా భగవంతుని నామస్మరణ చేస్తూ చేస్తే అది పుణ్యఫలం అవుతుంది.
మన మనస్సును ఉత్కృష్టం చేయడానికి ఇదే సులభమైన మార్గం.
మన శరీరాన్ని భగవంతుడిచ్చిన బహుమతిగా భావిస్తే మనము ఏ పాపకర్మ కూడా చేయకూడదు!.
మన సంపదను దేవుడిచ్చిన బహుమతిగా భావించినప్పుడు మనము దానిని దుర్వినియోగం చేయకూడదు కదా!!
అలాగే, మన ప్రతిభను భగవంతుడు ప్రసాదించినట్లుగా భావించినప్పుడు, మనము వాటిని దైవిక సేవలో ఉపయోగించాలి.

ఇలా మనము మన దేహాన్ని, సంపదను, జ్ఞానాన్ని పరోపకారార్ధం ఉపయోగించుకున్నపుడు మీరు ఎట్టి సాధన చేయవలసిన పని లేకుండానే మీరు యోగులుగా తయారవుతాము,
“కాదు, లేదు భోగాలకు అలవాటు పడితిమా! నిత్యమూ రోగులై ఉండాల్సి వస్తుంది…”

*_🍁శుభమస్తు🍁_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏