నేటి పంచాంగం.. నేటి విశేషం..

*🕉️పంచాంగం🚩*

తేదీ 23 – 03 – 2024,
వారం … స్థిరవాసరే ( శనివారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం – శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం – శుక్ల పక్షం,
తిథి : త్రయోదశి ఉ7.24 వరకు,
నక్షత్రం : పుబ్బ పూర్తి
యోగం : శూలం రా7.46 వరకు,
కరణం : తైతుల ఉ7.24 వరకు, తదుపరి గరజి 8.06 వరకు,
వర్జ్యం : మ1.40 – 3.26,
దుర్ముహూర్తము : ఉ6.05 – 7.42,
అమృతకాలం : రా12.17 – 2.03,
రాహుకాలం : ఉ9.00 – 10.30,
యమగండo : మ1.30 – 3.00,
సూర్యరాశి : మీనం,
చంద్రరాశి : సింహం,
సూర్యోదయం : 6.07,
సూర్యాస్తమయం: 6.07

*త్రయోదశి యొక్క విశిష్టత*

*”’యమ దర్శన త్రయోదశి , తిథులలో 13 వ తిథి త్రయోదశి , 13 వ సంఖ్య అత్యంత శుభకరం”*

“పదమూడు సంఖ్య మంచిది కాదని పాశ్చాత్యుల నమ్మకం, కానీ భారతీయసంప్రదాయంలో పదమూడవ తిథి మంచిరోజు. తిథులలో పదమూడవ తిథి త్రయోదశి”…
ప్రతి నెలలోనూ రెండుసార్లు అంటే కృష్ణపక్షంలో ఒకసారి , శుక్లపక్షంలో ఒకసారి వస్తుంది.
ఆ విధంగా సంవత్సరానికి ఇరవై నాలుగుసార్లు వస్తుందన్న మాట.
ఈ తిథికి అధిపతి మన్మథుడు, ప్రతి తిథిలోనూ మనం ఏదో ఒక పండుగను ఆచరిస్తాం.

కానీ ఈ తిథిలో ఏ పండుగలూ లేవు, అందుకే ఇది శనీశ్వరుని సొంతమైనది.
ఈయన ప్రభావం ఈ తిథిపై ఉంటుంది, కాబట్టే దీనిని శని త్రయోదశి అని అంటారు.

“ఈ తిథిలో ప్రయాణం శుభ ఫలితాలనిస్తుంది. తిథి ఫలం శుభం కాబట్టి ఈ తిథి రోజున వంకాయ తినకూడదు.”

*”త్రయోదశి గాయత్రి మంత్రం”*

*”ఓం మనోజాతాయై విద్మహే అనంగాయై:|*
*ధీమహి తన్నో: త్రయోదశి ప్రచోదయాత్‌||”*

*”ప్రతి త్రయోదశికి ఆచరించవలసిన విషయాలను పరిశీలిద్దాం.*

“ఛైత్ర శుద్ధ త్రయోదశి – దీనికే అనంగ త్రయోదశి అనీ , మన్మథ త్రయోదశి , మదన త్రయోదశి అనీ పేరు. మన్మథుడు అతి సౌందర్యవంతుడు.
“మన్మథుడి వాహనం చిలుక, పుష్పాలే అయన బాణాలు, ప్రేమకు అధిదేవత.”

*”శరీర దాత , శాప ప్రదాత ఒక్కరే :”*
*మన్మథుడు బ్రహ్మదేవుని హృదయంలో నుంచి జన్మించాడు, ఆయన భార్య రతీదేవి బ్రహ్మదేవుని ఎడమ భాగం నుంచి జన్మించింది, ఆయనకు జన్మను ప్రసాదించిన బ్రహ్మదేవుడే ఆయనకు శాపమిచ్చాడు. ఆ శాప ప్రభావంవల్లనే ఆయన తన శరీరాన్ని కోల్పోయాడు. రతీ మన్మథులు అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలు,
వారిని పూజిస్తే దాంపత్య సుఖం ప్రాప్తిస్తుంది.

ఈ త్రయోదశికే ‘కామదేవ త్రయోదశి’ అని మరో పేరుకూడా ఉంది , ఆ రోజున దవనంతో శివుడిని పూజిస్తే చాలా మంచి ఫలితం లభిస్తుందని “స్మృతి కౌస్తుభంలో” చెప్పబడింది.”

*”వరాహ జయంతిపై తర్జనభర్జనలు :*
“ఛైత్రబహుళ త్రయోదశి – ఈ రోజున వరాహ జయంతి. దశావతారాలలో మూడవది ఈ అవతారం”.
ఈ విషయం మీద పండితులలో చిన్న భేదాభిప్రాయం ఉంది.
ఛైత్ర బహుళ నవమి అని కొంతమంది అంటుంటారు, కానీ పంచాంగ కర్తలు మాత్రం ఛైత్ర బహుళ త్రయోదశినే ‘వరాహ జయంతి’గా” పేన్కొంటాయి.”

*వైశాఖ శుద్ధ , బహుళ త్రయోదశిలకు ప్రత్యేకతలేమీ లేవు.”*

*”జ్యేష్ట శుద్ధ త్రయోదశి – రంభా త్రిరాత్ర వ్రతం, ఆరోజున అరటి చెట్టుకింద ఉమామహేశ్వరుల పూజచేస్తారు, కానీ ఇది అంతగా ఆచరణలో లేదు.”*

*”సున్ని ఉండలు నైవేద్యం :*
*”శ్రావణ శుద్ధ త్రయోదశి – అనంగ త్రయోదశి వ్రతం. రతీమన్మథులకు ఎర్రరంగా పుష్పాలు , కుంకుమ కలిపిన అక్షతలను ఉపయోగించాలి. మినుములు , బెల్లం , నేయి కలిపిన పదార్థాన్ని నైవేద్యంగా పెడతారు. పాలనుకూడా పెడతారు, మైనపువత్తితో హారతి ఇస్తారని పెద్దల చెబుతారు.”*

*”ఆశ్వయుజ బహుళ త్రయోదశి -*
*”ధన త్రయోదశి , ఇది దీపావళి పండుగకి రెండు రోజుల ముందు వస్తుంది. ఆరోజు నుంచీ దీపాలు పెడతారు. లక్ష్మీపూజ చేస్తారు.”*

*”కార్తీక బహుళ త్రయోదశి – దీపదానం శ్రేష్టం. మార్గశిర శుద్ధత్రయోదశి- అనంగ త్రయోదశి వ్రతం మంచిది.”*

*”యమ దర్శన త్రయోదశి :*
*మార్గశిర కృష్ణ త్రయోదశి – దీనిని యమదర్శన త్రయోదశి అంటారని చాతుర్వర్గ చింతామణిలో చెప్పబడింది.”