నేటి పంచాంగం.. నేటి మాట..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌺పంచాంగం🌺
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 27 – 03 – 2024,
వారం … సౌమ్యవాసరే ( బుధవారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం – శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం – బహళ పక్షం,

తిథి : విదియ మ3.10 వరకు,
నక్షత్రం : చిత్ర మ2.39 వరకు,
యోగం : వ్యాఘాతం రా9.24 వరకు,
కరణం : గరజి మ3.10 వరకు,
తదుపరి వణిజ తె3.48 వరకు,

వర్జ్యం : రా8.40 – 10.24,
దుర్ముహూర్తము : ఉ11.40 – 12.28,
అమృతకాలం : ఉ7.39 – 9.24,
రాహుకాలం : మ12.00 – 1.30,
యమగండo : ఉ7.30 – 9.00,
సూర్యరాశి : మీనం,
చంద్రరాశి : తుల,
సూర్యోదయం : 6.02,
సూర్యాస్తమయం: 6.07,

*_నేటి మాట_*

*హీనమైనది ఏమిటి???*
హీనమైనది మనిషా, జంతువా, పక్షులా ???

పక్షులలో కాకి కడుహీనమైనదంటారు, దానిని నీచంగా చూస్తారు.
ఇక జంతువులలో గాడిద ను చాలా నీచంగా చూస్తారు.

కాకి, పరిశుద్ధ మై, పరిపక్వ మైన ఫలములను కాకుండా చెడి క్రుళ్ళిన పదార్థములనే ఆశిస్తుంది.
గాడిద ఏది పడితే అది తింటూ మాసిన బట్టల మూటలను మోస్తుంది…

అట్లే మనుష్యులలో పరమ నీచుడెవడంటే, పరులను దూషించువాడు.
సర్వులలో ఉన్న సచ్చిదానంద స్వరూపుని గుర్తించక, అందరిలో దోషాలు మాత్రమే గుర్తించి, మలినమైన మనస్సు తో రాగ, ద్వేషాలన్ని పెంచుకుంటూ దివ్య త్వాన్ని గుర్తించలేక పోవడం మహా పాపం…

మానవుడు అపవిత్రుడని హీనస్థితిలో వాడని, భావించరాదు.
ఈపరమ సత్యాన్ని మనము గుర్తించాలి.

“ఎన్ని సంవత్సరాలు సాధన సలిపినా, ఎన్ని వేదాంత ములను అభ్యసించి నా, మనస్సు లోని మాలిన్యమును తొలగించుకోకున్న, జీవిత కాలము వ్యర్థము గావించుకున్నట్లే”!…

*_🌺శుభమస్తు🌺_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏