నేటి పంచాంగం.. నేటి మాట..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌹పంచాంగం🌹
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 29 – 03 – 2024,
వారం … భృగువాసరే ( శుక్రవారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం – శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం – బహళ పక్షం,

తిథి : చవితి సా5.14 వరకు,
నక్షత్రం : విశాఖ సా5.52 వరకు,
యోగం : వజ్రం రా8.43 వరకు,
కరణం : బాలువ సా5.14 వరకు,
తదుపరి కౌలువ తె5.23 వరకు,

వర్జ్యం : రా10.00 – 11.40,
దుర్ముహూర్తము : ఉ8.26 – 9.14,
మరల మ12.28 – 1.17,
అమృతకాలం : ఉ8.33 – 10.14,
రాహుకాలం : ఉ10.30 – 12.00,
యమగండo : మ3.00 – 4.30,
సూర్యరాశి : మీనం,
చంద్రరాశి : తుల,
సూర్యోదయం : 6.01,
సూర్యాస్తమయం: 6.08,

*_నేటి మాట_*

*దైవ లీలలు*
చిత్రములు, విచిత్రములు, త్రైలోక్య పవిత్రంబులు ఆ దైవ లీలలు… అవి సామాన్యులకు అంతుపట్టవు కాక అర్థం కూడా కావు!!…

భస్మాసురునికి వరమిచ్చాడు శివుడు.
కానీ, దానిని పొందిన భస్మాసురునికి కృతజ్ఞత లేక పోయింది.
తనకు వర మిచ్చిన దైవము నే పరీక్షింప దలచాడు.
కానీ, ఈశ్వరుడు’ లయ’ కారుడు.
ఈశ్వరునికి ఇపుడు రక్షణ బాధ్యత లేదు.
కనుక ఈశ్వరుడు, రక్షణ బాధ్యత ఉన్న విష్ణువు కి బాధ్యత ఇచ్చాడు…

ఐతే భస్మాసురుని ఏవిధంగా శిక్షించాలి? ఈశ్వరుని వరమునకు విరుధ్ధముగాకుండా, తన రక్షణ జరగాలి, అందుకే విష్ణువు చక్కని డ్రామా ను నటించాడు!!…

తాను అందమైన స్త్రీ గా( మోహిని) గా రూపొంది, భస్మాసురుని ఆకర్షించాడు…

నేను చేసిన రీతిగా చేస్తే వరిస్తానన్నాడు.
మోహము, కోరిక వలన, వివేకము, విచక్షణ జ్ఞానము కోల్పోయి, మోహిని చెప్పినట్టల్ల ఆడి పాడి, మోహిని తలపై చేయి పెట్టుకున్నట్లు తాను కూడా తనచేతిని తలపై ఆనించుకొని, వెంటనే భస్మము ఐపోయాడు.
తన హస్తమే తనను భస్మము గావించింది.

ఇక్కడ ధర్మమునకు విరుధ్ధముగాకుండా రక్షణ జరిగింది!..
దైవ లీలలు సామాన్యులకు అర్ధముకావు…
ఎందుకు భగవంతుడు ఇట్లా చేశాడు, అట్లాచేశాడు, అనుకుంటూ ఉంటారు మానవులు…
కానీ దైవానికి శరణాగతి అయితే కొంత అనుగ్రహమును పొందగలుగుతాము ,అర్ధము చేసుకోగలుగుతాము!
అలా కాకుండా కేవలం అజ్ఞానం లో వుంటే తర్కవాదం తో ఏమీ అర్థం కావు!!

*_🌹శుభమస్తు🌹_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏