నేటి పంచాంగం.. నేటి విశేషం..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🍁పంచాంగం🍁
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 13 – 04 – 2024,
వారం … స్థిరవాసరే ( శనివారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం – వసంత ఋతువు,
చైత్ర మాసం – శుక్ల పక్షం,

తిథి : పంచమి సా4.15 వరకు,
నక్షత్రం : మృగశిర తె4.50 వరకు,
యోగం : సౌభాగ్యం ఉ5.59 వరకు,
తదుపరి శోభన తె4.27 వరకు,
కరణం : బాలువ సా4.15 వరకు,
తదుపరి కౌలువ తె4.01 వరకు,

వర్జ్యం : ఉ10.25 – 12.01,
దుర్ముహూర్తము : ఉ5.49 – 7.27,
అమృతకాలం : రా8.01 – 9.37,
రాహుకాలం : ఉ9.00 – 10.30,
యమగండo : మ1.30 – 3.00,
సూర్యరాశి : మీనం,
చంద్రరాశి : వృషభం,
సూర్యోదయం : 5.49,
సూర్యాస్తమయం: 6.10,

*_నేటి విశేషం_*

*శ్రీ పంచమి*
*మేష సంక్రమణం*
రా11.17 నుండి

మేష సంక్రమణే ప్రాగపరాదశఘటికాః పుణ్యకాలః.

మేషసంక్రమణం ప్రవేశానికి ముందు, తరువాత కూడా పది ఘడియలు పుణ్యకాలం.

కాబట్టి ఆ సమయంలో స్నాన, దాన, జప, తర్పణం మొదలైనవన్నీ అత్యధిక ఫలితాన్ని కలుగజేస్తాయని, మన జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది…
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్యుడు నవగ్రహాలకు రాజు…
జ్యోతిషంలో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశి మారటానికి ఒక్కో కాల వ్యవధి ఉంటుంది, రవికి నెల రోజుల కాలం వుంటుంది,
ఇలా ప్రతి గ్రహానికి కొంత కాల పరిమితి అనేది వుంటుంది.

అయితే ముఖ్యంగా సూర్యుడు నెలకి ఒక్కో రాశి చొప్పున (మేషాది మీనరాశులు) 12 రాశులలోనూ 12 నెలలు సంచరిస్తే.. సంవత్సర కాలం పూర్తవుతుంది.

సూర్యుడు మేష రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘మేష సంక్రమణం’ అని, సూర్యుడు వృషభ రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘వృషభ సంక్రమణం’ అని, సూర్యుడు మిథున రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘మిథున సంక్రమణం’ అని, సూర్యుడు కర్కాటక రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘కర్కాటక సంక్రమణం’ అని… ఇలా ఏయే రాశుల్లో ప్రవేశిస్తే ఆయా సంక్రమణ కాలంగా చెబుతారు.

కేరళ ప్రాంతీయ సాంప్రదాయం ప్రకారం ముఖ్యం గా మలబార్ ప్రాంతం లో మేష సంక్రమణం తర్వాత మొదటి రోజు ను *విషు కని* గా వేడుకలు జరుపుకొంటారు.
జ్యోతిష్య శాస్త్ర పరంగా ఈ రోజు ను ఉగాది గా భావిస్తారు.

*_🍁శుభమస్తు🍁_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏