నేటి పంచాంగం.. నేటి విశేషం..

.

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🍃పంచాంగం🍃
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 28 – 08 – 2023,
వారం … ఇందువాసరే ( సోమవారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయనం – వర్ష ఋతువు,
నిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం,

తిథి : ద్వాదశి మ3.28 వరకు,
నక్షత్రం : ఉత్తరాషాఢ రా1.21 వరకు,
యోగం : ఆయుష్మాన్ ఉ9.03 వరకు,
కరణం : బాలువ మ3.28 వరకు,
తదుపరి కౌలువ రా2.10 వరకు,
వర్జ్యం : ఉ10.20 – 11.50 &
మరల తె5.04 నుండి,

దుర్ముహూర్తము : మ12.26 – 1.16 &
మ2.56 – 3.46,
అమృతకాలం : రా7.20 – 8.50,
రాహుకాలం : ఉ7.30 – 9.00,
యమగండo : ఉ10.30 – 12.00,
సూర్యరాశి : సింహం,
చంద్రరాశి : ధనుస్సు,
సూర్యోదయం : 5.48,
సూర్యాస్తమయం: 6.17,

*_నేటి విశేషం_*

*దామోదర ద్వాదశి*
ఏకాదశి రోజున పూజలు, వ్రతాలు నోములు నోచుకుంటారు, ఉపవాసాలు కూడా ఉండి శ్రీ మహావిష్ణువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి…

సాలగ్రామాన్ని పూజించడం వలన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిని ఆరాధించిన ఫలితం దక్కుతుందని చెప్పబడుతోంది.

సాలగ్రామాన్ని అభిషేకించడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి.
సాలగ్రామాన్ని అభిషేకించిన నీటిని తీర్థంగా స్వీకరించడం వలన అనేక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని మనకు తెలుసు…
అలాంటి సాలగ్రామాలు *’గండకీ నది’* లో విరివిగా లభిస్తాయి.

సహజ సిద్ధంగా ఏర్పడిన సాలగ్రామాలు కొన్ని పుణ్యక్షేత్రాల్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో వుంటాయి.
ఎంతో విశిష్టతను సంతరించుకున్న సాలగ్రామాన్ని *’శ్రావణ శుద్ధ ద్వాదశి’* రోజున దానం చేయాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

అందుకు కారణం *శ్రావణ శుద్ధ ద్వాదశి … ‘దామోదర ద్వాదశి’* గా పిలవబడుతూ ఉండటమే.
ఏకాదశిన ఉపవాసం చేసిన వాళ్లు దామోదర ద్వాదశి రోజున ఆ ఉపవాస దీక్షను విరమిస్తుంటారు.

ఈ రోజున శ్రీమహావిష్ణువును వివిధ రకాల పూల మాలికలతో అలంకరించాలి.
అత్యంత భక్తిశ్రద్ధలతో పూజాభిషేకాలు నిర్వహించి , స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించాలి, మహా విశిష్టమైన ఈ రోజున శ్రీమహా విష్ణువుకి ప్రతీకగా చెప్పబడే సాలాగ్రామాన్ని దానంగా ఇవ్వడం మంచిదని శాస్త్రం స్పష్టం చేస్తోంది.

ఒకవేళ సాలగ్రామం లభించని పక్షంలో శ్రీమహావిష్ణువు వెండి ప్రతిమను దానంగా ఇవ్వవచ్చని అంటోంది.
*దామోదర ద్వాదశి* రోజున ఈ విధంగా చేయడం వలన మోక్షాన్ని పొందడానికి అవసరమైన అర్హత లభిస్తుందని చెప్పబడుతోంది…

*_🍃శుభమస్తు🍃_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏